IPL 2024: నేడు RR vs MI మ్యాచ్.. ఏ జట్టు గెలుస్తుందంటే
ABN , Publish Date - Apr 22 , 2024 | 10:19 AM
నేడు ఐపీఎల్ 2024లో 38వ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్ జట్టు మొదటి స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ జట్టు ఆరో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో ఇప్పుడు చుద్దాం.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్ల మధ్య 38వ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో రాజస్థాన్ రాయల్స్(RR) జట్టు మొదటి స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్(MI) జట్టు ఆరో స్థానంలో ఉంది. సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ తమ చివరి గేమ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన 224 పరుగుల విజయాన్ని విజయవంతంగా ఛేదించి రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో సొంత మైదానంలో జరగనున్న ఈ మ్యాచ్ కూడా గెలవాలని రాజస్థాన్ చూస్తోంది.
మరోవైపు ముంబై ఇండియన్స్(MI) జట్టు ఏడు మ్యాచ్‌ల్లో కేవలం మూడు విజయాలు మాత్రమే సాధించింది. ఈ సీజన్‌లో చివరిసారిగా ఇరు జట్లు తలపడగా, రాజస్థాన్ రాయల్స్ వాంఖడే స్టేడియంలో ముంబైపై ఆరు వికెట్ల తేడాతో సులువుగా విజయాన్ని నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ 192 పరుగులకే ఆలౌటైంది. 9 పరుగుల తేడాతో స్వల్ప విజయాన్ని నమోదు చేసింది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో పేలవంగా ఆడుతోంది. దీంతో ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి తీరాలని ముంబై ఇండియన్స్ జట్టు భావిస్తోంది.
ఐపీఎల్(IPL) చరిత్రలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మొత్తం 30 మ్యాచ్‌లు జరిగాయి. ముంబై(MI) జట్టు 16 మ్యాచ్‌ల్లో గెలుపొందగా, రాజస్థాన్ జట్టు 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 3 మ్యాచ్‌లు గెలవగా, ముంబై ఇండియన్స్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
ఇక జైపూర్(jaipur)లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం(Sawai Mansingh Stadium) పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంది. ఈ పిచ్ మంచి బౌన్స్ అందిస్తుంది. బ్యాట్స్‌మెన్స్ పెద్ద షాట్లు కొట్టడం ఖాయమని చెప్పవచ్చు. ఈ పిచ్ స్పిన్నర్లు కూడా అనుకూలంగా ఉంటుందని క్రీడా వర్గాలు అంటున్నాయి. ఇక గూగుల్ గెలుపు అంచనా ప్రకారం ఈ మ్యాచులో ముంబై ఇండియన్స్ జట్టు 54 శాతం గెలిచే అవకాశం ఉండగా, రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 46 శాతం అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్టు ప్రాబబుల్ 11 యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (C/WK), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్.
ముంబై ఇండియన్స్(Mumbai Indians) జట్టు ప్రాబబుల్ 11 రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (C), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, మహ్మద్ నబీ, జెరాల్డ్ కోయెట్జీ, శ్రేయాస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా.
ఇది కూడా చదవండి:
FIDE Title: 17 ఏళ్లకే చరిత్ర సృష్టించిన గుకేశ్..ప్రపంచ ఛాంపియన్ టైటిల్ కైవసం
IPL 2024: ఐపీఎల్‌లో అరుదైన మైలురాయి చేరుకున్న దినేశ్ కార్తీక్
మరిన్ని క్రీడా వార్తల కోసం