Home » IPL 2024
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో క్వాలిఫయర్-2 ఆడేందుకు అర్హత సాధించాల్సిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు సమష్టిగా రాణించారు. అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది.
కింగ్ కోహ్లి మరో కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పన రన్ మెషీన్.. తాజాగా మరో ఫీట్ సాధించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. కోహ్లి తప్ప మరే ప్లేయర్ ఇప్పటివరకు ఆ దరిదాపుల్లో ఎవరూ లేరు. ఐపీఎల్ రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్- ఆర్సీబీ మధ్య జరుగుతోంది. ఓపెనర్ కోహ్లి 33 పరుగులు చేసి వెనుదిరిగాడు.
ఐపీఎల్-2024లో (IPL 2024) మరో కీలక సమరానికి తెరలేచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ (RCB vs RR) జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు.
ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ లీగ్ దశలోనే ఇంటి బాట పట్టింది. లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో పది ఓడింది. కేవలం నాలుగు మ్యాచ్‌లే గెలిచింది. టీమ్ గెలవకపోవడానికి ప్రధాన కారణం కెప్టెన్సీ మార్పు అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఐపీఎల్-2024లో అసలు సిసలైన సమరానికి తెరలేచింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-1 మ్యా్చ్ షురూ అయ్యింది. ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఐపీఎల్-2024లో నేటి (మంగళవారం) నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు షురూ కానున్నాయి. అహ్మదాబాద్ వేదికగా క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR vs SRH) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు నేరుగా ఫైనల్ చేరుతుంది. ఓడిపోయిన జట్టు క్వాలిఫైయర్-2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
ఐపీఎల్-2024 కోసం రెండు నెలలుగా బీజీ బిజీగా గడిపిన దిగ్గజ క్రికెటర్ ధోనీ ప్రస్తుతం రిలాక్స్ మూడ్‌లోకి వచ్చేశాడు. టోర్నీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ నిష్క్రమించడంతో మళ్లీ తన సాధారణ జీవితం గడిపేందుకు సిద్దమయ్యాడు.
ఐపీఎల్ 2024(IPL 2024) సీజన్ ప్రస్తుతం ప్లేఆఫ్ దశకు చేరుకుంది. ఈ క్రమంలో నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) క్వాలిఫయర్1లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) జట్టుతో తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు అహ్మదాబాద్‌లో వాతావరణం ఎలా ఉంది, వర్షం వచ్చే ఛాన్స్ ఉందా, పిచ్ పరిస్థితి ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి ప్లే ఆఫ్స్ చేరడంలో ఆ జట్టు పేసర్ యశ్ దయాల్ కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్ వేసి ఆర్సీబీని విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆర్సీబీ నయా హీరోగా యశ్ దయాల్ మారిపోయాడు. అయితే ఐపీఎల్‌లో అతడి ప్రయాణం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. 2023లో దయాల్ కఠిన పరీక్షను ఎదుర్కొన్నాడు.
ఐపీఎల్ 2024(IPL 2024)లో రేపు కీలక మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్ 1లో టేబుల్ టాప్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), రెండో ర్యాంకర్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) మధ్య రేపు (మే 21) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉంది, స్టేడియం పిచ్ ఎలా ఉందనే విషయాలను ఇక్కడ చుద్దాం.