KKR vs SRH-Qualifier 1: టాస్ గెలిచిన సన్‌రైజర్స్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే?
ABN , Publish Date - May 21 , 2024 | 07:04 PM
ఐపీఎల్-2024లో అసలు సిసలైన సమరానికి తెరలేచింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-1 మ్యా్చ్ షురూ అయ్యింది. ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
అహ్మదాబాద్: ఐపీఎల్-2024లో అసలు సిసలైన సమరానికి తెరలేచింది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-1 మ్యా్చ్ షురూ అయ్యింది. ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ మాట్లాడుతూ.. పిచ్ మంచి వికెట్ మాదిరిగా కనిపిస్తోందని, భారీ స్కోర్ సాధిస్తామని ఆశిస్తున్నట్టు తెలిపాడు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.
కోల్‌తా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఈ పిచ్‌పై తాము బౌలింగ్ చేయడానికి ఇష్టపడతామని అన్నాడు. క్యూరేటర్‌తో మాట్లాడానని, ఇది భిన్నమైన పిచ్ అని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్‌లో ఎలా ఉంటుందో చూద్దామని అన్నాడు. గత మ్యాచ్‌లో ఆడిన టీమ్‌తో ఆడుతున్నట్టు చెప్పాడు.
తుది జట్లు..
సన్‌రైజర్స్ హైదరాబాద్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్, టీ.నటరాజన్.
కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్ర్యూ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.