Share News

MS Dhoni: స్వంత ఊరిలో రిలాక్స్ అవుతున్న ధోనీ.. రాంచీలో బైక్‌పై షికార్లు.. వీడియో వైరల్!

ABN , Publish Date - May 21 , 2024 | 12:23 PM

ఐపీఎల్-2024 కోసం రెండు నెలలుగా బీజీ బిజీగా గడిపిన దిగ్గజ క్రికెటర్ ధోనీ ప్రస్తుతం రిలాక్స్ మూడ్‌లోకి వచ్చేశాడు. టోర్నీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ నిష్క్రమించడంతో మళ్లీ తన సాధారణ జీవితం గడిపేందుకు సిద్దమయ్యాడు.

MS Dhoni: స్వంత ఊరిలో రిలాక్స్ అవుతున్న ధోనీ.. రాంచీలో బైక్‌పై షికార్లు.. వీడియో వైరల్!
Dhoni bike ride

ఐపీఎల్-2024 (IPL 2024) కోసం రెండు నెలలుగా బీజీ బిజీగా గడిపిన దిగ్గజ క్రికెటర్ ధోనీ (MS Dhoni) ప్రస్తుతం రిలాక్స్ మూడ్‌లోకి వచ్చేశాడు. టోర్నీ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ నిష్క్రమించడంతో మళ్లీ తన సాధారణ జీవితం గడిపేందుకు సిద్దమయ్యాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో సీఎస్‌కే 27 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో రన్‌రేట్ మెరుగ్గా ఉన్న ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌కు చేరింది. చెన్నై (CSK) ఇంటి దారి పట్టింది.


మ్యాచ్ ముగిసిన వెంటనే తన స్వస్థలం రాంచీకి (Ranchi) వెళ్లిన ధోనీ.. సోమవారం తన బైక్ ‌పై షికార్లు చేశాడు. హెల్మెట్ ధరించి యమహా బైక్‌పై షికారుకు వెళ్లాడు (Dhoni bike ride). ఆ సమయంలో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన ధోనీ అభిమానులు ఫిదా అవుతున్నారు. కాగా, ఒకవైపు ధోనీ రిటైర్మెంట్ గురించి మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంటే.. మరోవైపు ధోనీ మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఇలా హాయిగా టైమ్ గడుపుతున్నాడు.


ఈ సీజన్‌లో ధోనీ తన బ్యాట్‌తో చెలరేగి మళ్లీ పాత వింటేజ్ ధోనీని గుర్తు చేశాడు. మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన ధోనీ220.55 స్ట్రైక్‌రేట్‌తో 161 పరుగులు చేశాడు. కాగా, సీజన్‌తోనే ధోనీ ఐపీఎల్ కెరీర్ ముగిసిందనే చర్చ జోరుగా సాగుతోంది. అయితే ఐపీఎల్ రిటైర్మెంట్‌పై ధోనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. నిజానికి చెన్నైలో అభిమానుల మధ్య ధోనీ రిటైర్ కావాలని అనుకున్నాడు. అలా జరగకపోవడంతో ధోనీ తీవ్ర నిరాశకు గురైనట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

MS Dhoni-IPL: ఐపీఎల్ నుంచి ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై బిగ్ అప్‌డేట్!


MS Dhoni: ఆర్సీబీ ప్లేయర్లకు షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయిన ధోనీ.. అప్పుడు కోహ్లీ ఏం చేశాడంటే!


మరిన్ని క్రీడా వార్తలు కోెసం క్లిక్ చేయండి..

Updated Date - May 21 , 2024 | 01:07 PM