Home » IPL Live
Suresh Raina: వచ్చే ఐపీఎల్ సీజన్‌లో లక్నోసూపర్ జెయింట్స్ మెంటార్‌గా టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు లక్నో ఫ్రాంచైజీకి, సురేష్ రైనాకు మధ్య ఒప్పందం కూడా కుదిరినట్టు సమాచారం.
Gujarat Titans: హార్దిక్ పాండ్యా వంటి ఆల్ రౌండర్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అన్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను నడిపించే బాధ్యత యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్‌పై ఉందని అన్నాడు.
Preity Zinta: మంగళవారం జరిగిన ఐపీఎల్ వేలంలో పంజాబ్ కింగ్స్ ఓనర్ ప్రీతి జింటా పెద్ద పొరపాటే చేసింది. పొరపాటున తమ లిస్ట్‌లో లేని ఆటగాడిని కొనేసింది. ఆ తర్వాత తప్పు తెలుసుకుని వేలం నిర్వహకురాలు మల్లికా సాగర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
Pat Cummins: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం కమిన్స్ ఏది పట్టుకున్నా బంగారమే అయింది. ఈ ఏడాది జూన్‌లో కమిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ గెలిచింది.
Mitchell Starc: ఐపీఎల్ 2023 వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ చరిత్ర సృష్టించాడు. 17 ఏళ్ల ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాడు. స్టార్క్‌ను ఏకంగా రూ.24.75 కోట్ల భారీ ధరకు కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
IPL 2024: ఐపీఎల్ 2023 వేలం ముగిసింది. మినీ వేలం అనే పేరే కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మురించాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరతో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్(రూ.24.75)ను కోల్‌కతా నైట్ రైడర్స్ కొనుగోలు చేసింది.
IPL 2024: ఎంతో ఆసక్తి నెలకొల్పిన ఐపీఎల్ 2024 వేలం ముగిసింది. 10 ఫ్రాంచైజీలు కలిసి మొత్తంగా రూ.230.45 కోట్లు ఖర్చు చేసి 72 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. అత్యధికంగా కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది.
IPL 2024: వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ యువ ఆటగాడు, ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర అదరగొడుతున్నాడు. ఇప్పటికే మూడు సెంచరీలతో తన సత్తా చాటుకున్నాడు. దీంతో అతడు వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిసెంబరులో ఐపీఎల్ వేలం జరగనున్న నేపథ్యంలో ఫ్రాంఛైజీలు రచిన్ రవీంద్ర కోసం భారీగా బిడ్డింగ్ వేసే అవకాశాలు ఉన్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో చెన్నై
అదేంటో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB)కు ఐపీఎల్(IPL)లో కలిసి రావడం