Home » ISRO
మరికాసేపట్లో భారత దేశ సింహాలు చంద్రునిపై గర్జించబోతున్నాయి. చంద్రయాన్-3 కార్యక్రమం అంతా సజావుగానే జరుగుతోందని, గతంలో సూచించినట్లుగా ప్లాన్-బీ వైపు ఆలోచించవలసి అవసరం లేదని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) వర్గాలు తెలిపాయి.
చంద్రయాన్-3ని పర్యవేక్షిస్తున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (European Space Agency-ESA) బుధవారం ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించి తమ సంస్థలో అన్ని వ్యవస్థలు సజావుగా ఉన్నట్లు తెలిపింది.
చంద్రయాన్-3 విజయవంతమయ్యే సమయం ఆసన్నమవుతోంది. మరికొద్ది గంటల్లో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లిపై అడుగు పెట్టబోతున్నాయి. అంతా సవ్యంగానే జరుగుతోందని, షెడ్యూలు ప్రకారమే అన్ని కార్యక్రమాలు జరుగుతాయని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ప్రకటించింది.
భారతీయుల కలలను సాకారం చేస్తూ చంద్రయాన్-3 దూసుకెళ్తోంది. భారత దేశాన్ని ప్రపంచంలో సమున్నత స్థానంలో నిలపబోతోంది. అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శాస్త్రవేత్తల శ్రమకు ఫలితం రాబోతోంది. అంతా సవ్యంగానే జరుగుతోంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO)ను గతంలో ఎగతాళి చేసిన పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవద్ చౌదరి ప్రస్తుతం ప్రశంసిస్తున్నారు. చంద్రయాన్-3 కార్యక్రమం యావత్తు మానవాళికి చరిత్రాత్మక సమయమని అభివర్ణిస్తున్నారు. చంద్రయాన్-2 సమయంలో ఇస్రోను ఆయన ఎగతాళి చేశారు.
చంద్రయాన్ 3 ల్యాండింగ్‌ను పాకిస్థాన్ మీడియా కూడా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆ దేశ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి(Fawad Chaudhry) కోరారు. ఈ మేరక ఆయన ట్విట్టర్(ఎక్స్) వేదికగా ఓ ట్వీట్ చేశారు.
అది.. 2019, సెప్టెంబరు 7! సమయం అర్ధరాత్రి దాటింది. చంద్రయాన్-2(Chandrayaan-2) మిషన్‌లో భాగంగా భూమి నుంచి 3.84 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ప్రవేశించిన ల్యాండర్ విక్రమ్.. సరిగ్గా చంద్రుడి దక్షిణ ధ్రువం పైభాగానికి చేరుకుంది.
చందమామపై చెరగని ముద్ర వేసే చరిత్రాత్మక ఘట్టం కోసం యావత్ భారతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3(Chandrayaan-3) వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
చంద్రునిపై అడుగు పెట్టేందుకు చంద్రయాన్-3కి మరికొన్ని గంటల సమయమే ఉంది. ల్యాండర్ విక్రమ్ సాఫ్ట్ ల్యాండింగ్ చేసి.. ప్రపంచవ్యాప్తంగా భారత్ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 23వ తేదీన...
ఇప్పుడు అందరి దృష్టి చంద్రయాన్-3 మీదే ఉంది. ఇంతకుముందు చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైన నేపథ్యంలో.. ఈసారి అలా జరగకూడదని, చంద్రయాన్-3 విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నారు. ఇది చంద్రుడిపై..