Home » IT Raids
అధికార పార్టీ నేతలపై రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, కొత్తపేట్ గ్రీన్ హిల్స్ కాలనీ లోని శేఖర్ రెడ్డి నివాసంలోనూ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. జేసీ బ్రదర్స్ షోరూమ్స్‌తో పాటు అమీర్‌పేట్‌లోని కార్పొరేట్ ఆఫీసులో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణలో పలువురు ప్రజాప్రతినిధుల ఇళ్లపై ఐటీ దాడులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 60 బృందాలతో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, మెదక్ ఎంపీ కొత్తా ప్రభాకర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. కాగా.. జూబ్లీహిల్స్‌లోని తమ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి తల్లి అమృతమ్మ అనారోగ్యానికి గురయ్యారు.
తెలంగాణలో బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి బీఆర్ఎస్కు చెందిన ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లు, కంపెనీలు, షాపింగ్ కాంప్లెక్స్‌లలో ఐటీ అధికారులు సోదాలు చేయడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్లలో వరుసగా.. పైగా ఒకే రోజు ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు చేయడంతో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన మొదలైంది.
అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంట ఐటీ సోదాలు సంచలనంగా మారాయి. భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసం, కంపెనీల్లో నేటి ఉదయం నుంచి ఐటీ సోదాలను ప్రారంభించింది. భువనగిరి, హైదరాబాద్ కొత్తపేట గ్రీన్ హిల్స్ కాలానీలోని కార్యాలయాల్లో మొత్తం 12 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ఎక్సైజ్, విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(Minister Senthil Balaji)పై ఐటీ పంజా విసిరింది. ఆయన సోదరుడు అశోక్‌కుమార్, బం
తమిళనాడు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు శుక్రవారం దాడులు చేశారు...
హైదరాబాద్‌లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న విజ్ రియాల్టీస్, విజ్ ప్రాపర్టీలపై సోదాలు కొనసాగుతున్నాయి. కింగ్స్, కోహినూర్, ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ కంపెనీల్లో సైతం నేడు కూడా సోదాలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్, విశాఖలలో నేడు ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో వచ్చేసి.. కోహినూర్ డెవలపర్స్, రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఆదాయ చెల్లింపుల విషయంలో అవకతవకలు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ రోజు ఏక కాలంలో 20 బృందాలతో ఐటీ సోదాలు నిర్వహిస్తోంది.
నగరంలో వస్త్ర వ్యాపారుల ఇళ్లలో ఐటీ (IT) దాడులు నిర్వహించారు. కళామందిర్, మందిర్, కాంచీపురం వరమహాలక్ష్మీ, KLM, రూపవల్లి, కాంచీపురం వల్లీ సిల్క్స్ బ్రాంచుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు.
చెన్నైకి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ జీ స్వ్కేర్ సంస్థపై ఐటీ దాడులు సోమవారం ఉదయం సోదాలు నిర్వహించారు.