IT Raids : ఐటీ సోదాల ఎఫెక్ట్.. చివరి నిమిషం వరకూ పొంగులేటి నామినేషన్‌పై ఉత్కంఠ.. ఫైనల్‌గా ఇలా..!?
ABN , First Publish Date - 2023-11-09T16:34:04+05:30 IST
Telangana Elections: మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం, ఆఫీసులలో ఐటీ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఖమ్మం, నారాయణపురం, హైదరాబాద్ మూడు ప్రాంతాలలో అయిదు చోట్ల ఏకదాటిగా అధికారులు దాడులు చేపట్టారు.
ఖమ్మం: మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Former MP Ponguleti Srinivasreddy) నివాసం, ఆఫీసులలో ఐటీ దాడులు (IT Raids) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఖమ్మం, నారాయణపురం, హైదరాబాద్ మూడు ప్రాంతాలలో అయిదు చోట్ల ఏకదాటిగా అధికారులు దాడులు చేపట్టారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు (గురువారం) పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి నామినేషన్ (Nomination) వేయాల్సి ఉండగా.. చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఎట్టకేలకు ఐటీ అధికారులు కేవలం రెండు గంటలు మాత్రమే నామినేషన్ వేసేందుకు సమయం ఇచ్చారు. దీంతో వెంటనే పొంగులేటి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వెంటనే పొంగులేటి తిరిగి ఇంటికి చేరుకున్నారు. రాఘవ నిలయంలో ఐటీ అధికారుల ముందు ఆయన హాజరయ్యారు. ఐటీ అధికారులు ఇచ్చిన సమయానికే అంటే రెండు గంటల్లో నామినేషన్ దాఖలు కార్యక్రమం పూర్తి చేసుకుని ఐటీ అధికారుల ముందు శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.
మరోవైపు పొంగులేటి నివాసాలపై ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 11 గంటల నుంచి పొంగులేటి నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఖమ్మం, నారాయణపురం, హైదరాబాద్ నివాసాలలో కార్యాలయంలో ఐటీ తనిఖీలు కొనసాగుతున్నాయి. పొంగులేటి ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు.
కాగా.. గురువారం తెల్లవారుజామున 4:30 గంటల నుంచి పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఖమ్మంలోని పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు. మొత్తం 8 వాహనాల్లో ఐటీ అధికారులు వచ్చారు. పొంగులేటి కుటుంబసభ్యుల నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పొంగులేటి అనుచరుల సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో పొంగులేటికి చెందిన నివాసంలో కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే తనపై ఐటీ దాడులు ఉండొచ్చునని మూడు రోజుల క్రితమే పొంగులేటి ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.