IT Raids : రూ.8 కోట్ల నగదు బదిలీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఐటీ
ABN , First Publish Date - 2023-11-21T08:06:47+05:30 IST
మంచిర్యాలలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం భారీగా నగదు బదిలీ అయిందన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థల ఖాతాల్లోకి రూ.8కోట్ల నగదు బదిలీ జరిగింది. గుర్తు తెలియని ఖాతా నుంచి నగదు బదిలీపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
మంచిర్యాల : మంచిర్యాలలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వివేక్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోసం భారీగా నగదు బదిలీ అయిందన్న సమాచారంతో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 13న విశాఖ ఇండస్ట్రీస్, విజిలెన్స్ సెక్యూరిటీ సంస్థల ఖాతాల్లోకి రూ.8కోట్ల నగదు బదిలీ జరిగింది. గుర్తు తెలియని ఖాతా నుంచి నగదు బదిలీపై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రూ.8కోట్ల నగదును ఫ్రీజ్ చేసి ఈసీ, ఐటీ, ఈడీ అధికారుల దృష్టికి పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులిచ్చిన సమాచారం ఆధారంగా వివేక్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు చెన్నూరులో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వివేక్, వినోద్ నివాసాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ రైడ్ జరుగుతోంది.