Home » Jagan Cases
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ, ఈడీ కేసులకు సంబంధించి దాఖలైన డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ చేపట్టాలని నాంపల్లి సీబీఐ కోర్టును తెలంగాణహైకోర్టు మరోసారి ఆదేశించింది.
హింస, విధ్వంసం, అరాచకం గురించి వైఎస్ జగన్ మాట్లాడితే రోత పుడుతోందని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు.
‘కోడికత్తి’ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
రాష్ట్రానికే కాదు.. దేశానికి కూడా కీలకమైన వైద్య రంగంలో అవసరమైన అన్ని పరికరాలను ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో విశాఖలో గత చంద్రబాబు సర్కారు ఏర్పాటు చేసిన మెడ్ టెక్ జోన్ నిర్వీర్యమైంది.
మీకు సొంత కారు ఉందా? ఉంటే... రోజుకు ఐదొందల కిలోమీటర్లు తిరుగుతారా? ఒక రోజూ.. రెండు రోజులూ కాదు! వరుసగా 30 రోజులు.. నిర్విరామంగా రోజూ 500 కిలోమీటర్ల చొప్పున తిరగగలరా? ‘అంత రాచకార్యాలు మాకేముంటాయ్ బాస్!
జగన్ సర్కారు కాంట్రాక్ట్ సంస్థను మార్చకుండా యథాతథంగా పనులు కొనసాగించినట్టయితే రూ.1,771 కోట్లతో ఈపాటికి ఎప్పుడో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ ఆ క్రెడిట్ చంద్రబాబుకు దక్కుతుందనే అక్కసుతో అధికారంలోకి రాగానే పనులు ఆపేసింది.
పట్టణ ప్రాంతాల్లో 24.4 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించే బాధ్యతను అదానీ సంస్థకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పగించారు.
గత ప్రభుత్వ హయాంలో జగన్ టిడ్కో గృహాలను ఆరువేల కోట్ల రూపాయలకు తాకట్టు పెట్టి ఆ నిధులను దారి మళ్లించారని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
టీడీఆర్ కుంభకోణంలో మాజీ సీఎం జగనే సూత్రధారి అని, ఆయన్ను నిందితుడిగా పరిగణించి అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.
గత ప్రభుత్వంలో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై విచారణ చేయిస్తామని పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు.