అరాచకం గురించి జగన్ మాట్లాడితే రోత పుడుతోంది: లోకేశ్
ABN , Publish Date - Jul 19 , 2024 | 05:48 AM
హింస, విధ్వంసం, అరాచకం గురించి వైఎస్ జగన్ మాట్లాడితే రోత పుడుతోందని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు.
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): హింస, విధ్వంసం, అరాచకం గురించి వైఎస్ జగన్ మాట్లాడితే రోత పుడుతోందని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘బాధితులనే నిందితులుగా చేసి ప్రభుత్వం తానే టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటింది. మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూటమి ప్రభుత్వం కూకటివేళ్లతో పెళ్ళగించి వేస్తోంది. ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్ తనకు పేటెంట్ ఉన్న ఫేక్ ప్రచారాలతో...
అబద్ధపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నాడు. అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడు. శవాలతో రాజకీయాలు చేసే మీ విషపు సంస్కృతికి తెర దించుతూ ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలు. మీకు అర్ధం కాదా?’ అని ప్రశ్నించారు. నేరాలు చేసి మళ్లీ వాటిని వేరేవారిపై నెట్టే మీ కపట నాటకాలకు కాలం చెల్లింది. జగన్ హెచ్చరికలకు భయపడే ప్రభుత్వం కాదు. ప్రజలకు, వారి మాన ప్రాణాలకు జవాబుదారిగా ఉండే ప్రజా ప్రభుత్వం మాది’ అని లోకేశ్ పేర్కొన్నారు.