Share News

Minister Narayana: టీడీఆర్‌ బాండ్ల అక్రమాలపై విచారణ

ABN , Publish Date - Jul 05 , 2024 | 04:58 AM

గత ప్రభుత్వంలో జరిగిన టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంపై విచారణ చేయిస్తామని పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు.

Minister Narayana: టీడీఆర్‌ బాండ్ల అక్రమాలపై విచారణ

  • నెల్లూరు, కడపలో బాఽధ్యులపై చర్యలు: మంత్రి నారాయణ

అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో జరిగిన టీడీఆర్‌ బాండ్ల కుంభకోణంపై విచారణ చేయిస్తామని పురపాలక శాఖా మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. తణుకులో రూ.36 కోట్ల విలువైన బాండ్లను జారీ చేయాల్సి ఉండగా రూ.700 కోట్లకు పైగా జారీ చేసినట్టు తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు. నెల్లూరు, కడప లే అవుట్లలో అవకతవకలపై విచారణా కమిటీ నివేదిక వచ్చిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. తమ హయాంలో మంజూరు చేసిన దాదాపు 9 లక్షల టిడ్కో గృహాల నిర్మాణాలను గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిందన్నారు. ఈ పథకాలన్నింటినీ పునఃప్రారంభించేందుకు త్వరలో తగు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి తెలిపారు.

Updated Date - Jul 05 , 2024 | 04:58 AM