Home » Jagan Mohan Reddy
వరదలకు విజయవాడ, కృష్ణా జిల్లాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర తెలిపారు. కూటమి నేతలు అందరూ నిరంతరం ప్రజల కష్టాలు తీర్చేందుకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారని.. బాధితులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు.
Andhrapradesh: వైసీపీ నేతల అక్రమ ఇసుక దందా వలనే బుడమేరుకు గండ్లు పడి కోతకు గురైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లు బుడమేరును గాలికొదిలేసిన జగన్.. నేడు ప్రభుత్వంపై బురద చల్లేందుకు వచ్చాడని మండిపడ్డారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అభిమానంతో సుదూర ప్రాంతాల నుంచి కలవడానికి వచ్చిన మహిళలపై రోప్ పార్టీ పోలీసులు దాష్టీకం చూపించారు. సుదూర ప్రాంతాల నుంచి జగన్‌ను కలిసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానులపై ఇలా పోలీసులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
పచ్చని కొండల నడుమ ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో... గుంటూరు, విజయవాడ నగరాల మధ్యలో మంగళగిరి ఎయిమ్స్ ఏర్పాటైంది. పది రూపాయలకే ఉత్తమ వైద్యసేవలు అందిస్తారనే పేరుంది.
Andhrapradesh: అచ్యుతాపురం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మాట్లాడుతూ మంత్రులు స్పాట్‌కు వెళ్ళలేదని.. ప్రభుత్వం తీరు బాలేదని అనడం చూస్తే అయన మానసికస్థితి అర్థమవుతోందన్నారు.
సీపీ హయాంలో ఐదేళ్లపాటు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరదాల పాలన చేశారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గడిచిన ఐదేళ్ల పాలనలో జగన్ సభలు, పర్యటనలు చేయాలంటే పాఠశాలలు మూసివేశారని, చెట్లు నరికి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: జగన్... నీరో చక్రవర్తిలా ఇంట్లో కూర్చుని పబ్జీ గేమ్‌లు ఆడుతూ ఐదేళ్లు నెట్టుకొచ్చేశారిన రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని, వ్యవస్థలను విధ్వంసం చేసిన ఘనత జగన్ దే అని అన్నారు. గత ఏడాది ఇచ్చిన థర్డ్ పార్టీ నివేదిక అమలు చేయకపోవడం వల్లే...
గత ఐదేళ్లలో జగన్ సర్కారు అడ్డగోలుగా అప్పులు చేసింది. కేంద్రం నిధులను ఇష్టారీతిన దారి మళ్లింది. 2023-24లో కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ.172 కోట్లు ఏమి చేసిందో? ఎందుకు ఖర్చు పెట్టిందో నేటికీ అంతు చిక్కడం లేదు. రాష్ట్రాలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్రం రాష్ట్రాల మూలధన
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత లోకేశ్ జన్మదినం సందర్భంగా ఆయన ఫ్లెక్సీ పెట్టామని తన హోటల్ మూయించారని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు చెందిన ప్రకాశ్ బాబు మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఫిర్యాదు చేశారు.
మద్యం కేసులో సీఐడీ అధికారులు ఉచ్చు బిగిస్తున్నారు. ఊహకు అందని విధంగా జగన్ సర్కారు చేసిన దోపిడీపై కూపీ లాగుతున్నారు. సీఐడీ అధికారులు తాజాగా మద్యం డిస్టిలరీస్ యజమానుల్ని పిలిచి అత్యంత విలువైన సమాచారం సేకరించారు.