Home » Jai Shankar
బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్ ఇవాళ(మంగళవారం) అఖిలపక్ష నేతలను కలవనున్నారు. దీనికి సంబంధించి ఆ దేశ పరిస్థితులను ఇప్పటికే ఆయన నిశితంగా పరిశీలిస్తున్నారు. బంగాదేశ్ పరిస్థితులపై విదేశాంగ, హోంశాఖ, రక్షణ శాఖ మంత్రులతోపాటు ఉన్నతాధికారులతో ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు.
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina) రాజీనామా చేసి సోమవారమే ప్రత్యేక విమానంలో ఢిల్లీలోని హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితిని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ప్రధాని మోదీకి(PM Modi) వివరించారు.
విదేశీ గడ్డపై భారత తొలి జనఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు. మారిషస్‌లో(Mauritius) గురువారం జరిగిన ఈ కార్యక్రమానికి విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్(Jai Shankar) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్తో కలిసి జైశంకర్ జనఔషధి కేంద్రాన్ని ప్రారంభించారు.
కాంబోడియాలో చిక్కుకున్న తెలుగు యువతను కాపాడాలని టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. మానవ అక్రమ రవాణాకు ఏపీ కేంద్రంగా మారడం ఆందోళనకరమని ఆయన ఎక్స్(ట్విటర్) వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. 150మందిని స్వదేశానికి తీసుకొచ్చేలా సహాయపడాలని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు.
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ పార్టీపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి ధ్వజమెత్తారు. భారత తొలి ప్రధాని నెహ్రూ హయాంలోనే చైనా దురాక్రమణకు దేశ భూభాగాన్ని కోల్పోయామన్నారు
పీఓకేను భారత్‌లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) ఆదివారం స్పందించారు. పీఓకేను భారత్‌లో కలపాలని చూస్తే పాకిస్థాన్ గాజులు తొడుక్కుంటూ కూర్చోదని భారత్‌కు వార్నింగ్ ఇచ్చారు.
భారత్‌లో జరుగుతున్న ఎన్నికలను వీక్షించేందుకు దేశానికి 10 దేశాలకు చెందిన 18 రాజకీయ పార్టీల నేతలు వచ్చారు. బీజేపీ ఆహ్వానం మేరకు సార్వత్రిక ఎన్నికలను వీక్షించేందుకు విదేశీ రాజకీయ నాయకులు వచ్చారు. బీజేపీ ఎన్నికల ప్రచారం, ఎన్నికల నిర్వహణ పద్ధతుల గురించి వారంతా తెలుసుకోనున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ విదేశీ రాజకీయ నాయకులందరికీ బీజేపీ ఎన్నికల ప్రచార పద్ధతుల గురించి సవివరమైన సమాచారాన్ని అందజేస్తారు.
వాస్తవాధీన రేఖ వద్ద డ్రాగన్ దేశం నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు పేర్లు పెట్టింది. ఈ చర్యను భారత్ ( India ) తీవ్రంగా ఖండిస్తోంది. ఇలా ఇప్పడే కాదు గతంలోనూ పలు మార్లు పేర్లు మారుస్తూ మూడు జాబితాలను రిలీజ్ చేసింది.
కచ్చాతీవు ద్వీపం వ్యహహారం అకస్మాత్తుగా తెరపైకి వచ్చినది కాదంటూ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం తాజాగా కౌంటర్ ఇచ్చారు. కొందరు ''చాలా వేగంగా రంగులు మారుస్తుంటారు'' అంటూ జైశంకర్‌పై విమర్శలు గుప్పించారు.