Share News

Soudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం... 9 మంది భారతీయులు మృతి

ABN , Publish Date - Jan 29 , 2025 | 05:24 PM

జడ్డాలో జరిగిన ప్రమాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. మృతులు, వారి కుటుంబాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్న జెడ్డాలోని కాన్సుల్ జనరల్‌‌తో మాట్లాడానని చెప్పారు.

Soudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం... 9 మంది భారతీయులు మృతి

న్యూఢిల్లీ: పశ్చిమ సౌదీ అరేబియా (Soudi Arabia)లో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. జియాన్ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయులు మృతిచెందారు. జెడ్డాలోని భారతీయ రాయబార కార్యాలయం బుధవారంనాడు సోషల్ మీడియా పోస్ట్‌లో ఈ వివరాలు వెల్లడించింది. జిజాన్ సమీపంలోని జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది భారతీయ పౌరులు మరణించడంపై తీవ్ర సంతాపాన్ని తెలియజేసింది. అధికారులతోనూ, మృతుల కుటుంబాలతోనూ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతన్నట్టు తెలిపింది. హెల్ప్‌లైన్ సైతం ఏర్పాటు చేసినట్టు పేర్కొంది.

Union Cabinet: రూ.16,300 కోట్లతో నేషనల్ క్రిటికల్ మినరల్స్ మిషన్‌కు కేంద్రం ఓకే


దురదృష్టకరం: జైశంకర్

జడ్డాలో జరిగిన ప్రమాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్న జెడ్డాలోని కాన్సుల్ జనరల్‌‌తో మాట్లాడానని, పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తనకు వివరించారని సోషల్ మీడియా పోస్ట్‌లో జైశంకర్ తెలిపారు.


హెల్ప్‌లైన్ నెంబర్లివే

8002440003(టోల్ ఫ్రీ)

0122614093

0126614276

0556122301(వాట్సాప్)


ఇవి కూడా చదవండి..

Delhi Elections: యమునలో విషం కలిపి... కేజ్రీ వ్యాఖ్యలపై ఈసీ లేఖ

Amit Shah: యమునలో విషం వ్యాఖ్యలపై కేజ్రీకి అమిత్‌షా 3 సవాళ్లు

Read More National News and Latest Telugu News

Updated Date - Jan 29 , 2025 | 05:27 PM