Home » Janasena
రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన ఆయన.. మంత్రి పదవిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన.. మూడోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా బుధవారం నాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Andhra Pradesh Election Results: పవన్ కల్యాణ్‌పై నమ్మకంతోనే ప్రజలకు ఆయనకు బ్రహ్మరథం పట్టారని జనసేన పార్టీ నాయకుడు నాగబాబు అన్నారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. రాష్ట్ర అభివృద్ధిలో కూడా పవన్ బాధ్యత తీసుకుంటారని అన్నారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీ తప్పకుండా అభివృద్ధి చెందుతుందన్నారు నాగబాబు. ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ..
ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా ముఖ్యమని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కూటమి గెలుపు తర్వాత యనమల తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా ముఖ్యమన్నారు. నాయకుల ప్రవర్తన సరిగా లేకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారన్నదానికి ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని పేర్కొన్నారు.
జనసేన కేంద్ర కార్యాలయానికి సినీ నటుడు పృధ్వీ వచ్చారు. జనసేన తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపారు. పార్టీ కీలక నేతలైన నాదెండ్ల మనోహర్, నాగబాబులను పృధ్వీ కలిశారు. ఈ సందర్భంగా పృధ్వీ మాట్లాడుతూ.. ఫ్యాన్ విరిగిపోయి శ్మశానానికి తీసుకెళుతున్నారన్నారు. ఐదేళ్ల నుంచి ఫ్యాన్ వేస్తున్నారని.. ఇక ఆపాలలని చెబుతూనే ఉన్నానన్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించడంపై జనసేన సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు కూటమిపై నమ్మకంతో అద్భుతమైన విజయం అందించారని హర్షం వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హస్తినకు బయలుదేరారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి చంద్రబాబు వెళ్లనున్నారు. సాయంత్రం జరిగే ఎన్డీఏ సమావేశానికి ఆయన హాజరు కానున్నారు. ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఎన్డీఏలో ఉన్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. తన ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ సహా ఢిల్లీ పెద్దలను ఆయన ఆహ్వానించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అఖండ విజయం సాధించింది. కూటమి విక్టరీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీ రోల్ పోషించారు. ఎన్నికల్లో గడప గడపకు ప్రచారం చేశారు. జగన్ నిరంకుశ వైఖరి, గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపారు. దాంతో కూటమికి ప్రజలు పట్టం కట్టారు.
అమరావతి: 2024 ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ గల్లంతైపోయింది. సీఎం జగన్, పెద్దిరెడ్డి మినహా వైసీపీలోని హేమా హేమీలందరూ ఓటమిపాలయ్యారు. మంత్రులు, మాజీ మంత్రులు డిప్యూటీ సీఎంలు ఓటమిపాలయ్యారు. ఫలితాల్లో ప్రభుత్వ వ్యతిరేకత, జగన్‌పై వ్యతిరేకత ప్రతిఫలించింది.
తాజాగా వెలువడిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో జనసే ప్రభంజనం సృష్టించింది. మొత్తం పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి గెలుపు దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. కూటమి జెట్ స్పీడ్‌లో దూసుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని చోట్ల కూటమిదే హవా. అసెంబ్లీలోనే కాదు.. లోక్‌సభలోనూ సత్తా చాటుతోంది. కృష్ణా, విజయనగరం, విశాఖలలో వైసీపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థులు పూర్తి స్థాయి మెజారిటీని కనబరుస్తున్నారు. గొడవలు జరిగిన తాడిపత్రి, మాచర్ల, చంద్రగిరి తదితర ప్రాంతాలన్నింటిలోనూ కూటమి సత్తా చాటుతోంది