Janasena: రాష్ట్ర క్యాబినెట్‌లో జనసేన ఉంటుందా? నాగబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..
ABN , Publish Date - Jun 05 , 2024 | 02:18 PM
Andhra Pradesh Election Results: పవన్ కల్యాణ్‌పై నమ్మకంతోనే ప్రజలకు ఆయనకు బ్రహ్మరథం పట్టారని జనసేన పార్టీ నాయకుడు నాగబాబు అన్నారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. రాష్ట్ర అభివృద్ధిలో కూడా పవన్ బాధ్యత తీసుకుంటారని అన్నారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీ తప్పకుండా అభివృద్ధి చెందుతుందన్నారు నాగబాబు. ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ..
Andhra Pradesh Election Results: పవన్ కల్యాణ్‌పై నమ్మకంతోనే ప్రజలకు ఆయనకు బ్రహ్మరథం పట్టారని జనసేన పార్టీ నాయకుడు నాగబాబు అన్నారు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. రాష్ట్ర అభివృద్ధిలో కూడా పవన్ బాధ్యత తీసుకుంటారని అన్నారు. కూటమి ఆధ్వర్యంలో ఏపీ తప్పకుండా అభివృద్ధి చెందుతుందన్నారు నాగబాబు. ప్రజలతో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ తన సొంత డబ్బుతో సాయం అందించిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పవన్‌ను మావాడు అనుకున్నారని.. రాష్ట్ర క్యాబినెట్‌లో కూడా జనసేన భాగస్వామ్యం ఉంటుందని నాగబాబు స్పష్టం చేశారు. అయితే, పవన్ కల్యాణ్‌కు మంత్రి పదవి అనేది తన పరిధిలో లేదన్నారు. తమ అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా తాము స్వాగతిస్తామన్నారు.
ఇదే సమయంలో వైసీపీ నేతల తీరుపై నాగబాబు తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ వాళ్లకు అధికారం అంటే హక్కుగా.. తాము రాజులం, ప్రజలు బానిసలు అన్నట్లుగా చూశారాన్నారు. కానీ, తమకు ప్రజలే రాజులు అని.. తాము సేవకులం అని.. ఆ విధంగా పాలనలో ముందుకు సాగుతామని నాగబాబు చెప్పారు. సినిమా అనేది ఒక పరిశ్రమ అని.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమారంగం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కలిపి అవసరమైన సహకారం కోరతామన్నారు. వైసీపీ ప్రభుత్వం సినీ పరిశ్రమను కొంతవరకు ఇబ్బంది పెట్టిందన్నారు. ప్రస్తుతం ఫిల్మ్ ఫ్రెండ్లీ ప్రభుత్వం ఉంటుందనే నమ్మకం తమకుందని నాగబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. తాము సినీ పరిశ్రమ ద్వారానే ఎదిగామని.. తమ వంతు కృషి తాము చేస్తామని నాగబాబు స్పష్టం చేశారు.