Share News

AP Election Results: మంత్రి పదవిపై మనసులోని మాట బయటపెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

ABN , Publish Date - Jun 05 , 2024 | 03:15 PM

రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన ఆయన.. మంత్రి పదవిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన.. మూడోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా బుధవారం నాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

AP Election Results: మంత్రి పదవిపై మనసులోని మాట బయటపెట్టిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Kotamreddy Sridhar Reddy

నెల్లూరు, జూన్ 05: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన ఆయన.. మంత్రి పదవిపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసిన ఆయన.. మూడోసారి గెలుపొందారు. ఈ సందర్భంగా బుధవారం నాడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. అనేక అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ ఎపిసోడ్‌పై హాట్ కామెంట్స్ చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.


‘ఎన్నికలు ముగిసాయి గేమ్ ఓవర్ అయ్యింది. ఈ గేమ్‌లో ప్రజలు విన్నర్స్ అయ్యారు. ఒకే నియోజకవర్గంలో వరుసగా గెలిచిన ముగ్గురు ఎమ్మెల్యేల వరుసలో నేను చేరాను. మళ్లీ జన్మంటూ ఉంటే ఈ గెలుపును మరచిపోలేను. గేమ్ చైంజర్ అన్న ఆదాల ప్రయత్నాలు రూరల్లో విఫలం అయ్యారు.

ఈ ఎన్నికల్లో ఉచ్చ నీచాలు మరచి నా వ్యక్తిత్వాన్ని హననం చేశారు. నా కుటుంబ సభ్యులను సైతం అవమానపరిచారు. కుట్రలు, కుతంత్రాలు నాకు తెలియదు. ప్రజల పక్షాణ ఉంటాను. అందుకే అధికారాన్ని ధిక్కరించి బయటకు వచ్చా. జగన్మోహన్ రెడ్డిని డీకొట్టిన నేను ఈ పసికూనలను లెక్కచేయను. ప్రజల అండ ఉంటే కొండలను సైతం తలతో కొడితే పగిలిపోతాయి. నా గెలుపు కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు చేసిన కృషి మరువలేను. వామపక్ష సానుభూతి పరులు నిశ్శబ్ద విప్లవం చేసి నన్ను గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు సైతం నా విజయానికి కృషి చేశారు. నా వెంట నడిచిన నాయకులకు ఒకటే మాట చెపుతున్నాను. కక్ష సాధింపులకు పాల్పడవద్దని కోరుకుంటున్నాను. కక్ష సాధింపులకు పాల్పడితే నా గడప మెట్లు కూడా తొక్కనివ్వను. పదికాలాలు నెల్లూరు రూరల్ ప్రజల గుండెల్లో నిలిచిపోయే పనులు చేస్తాను. అధికారం వచ్చింది అని అహంకారం తలకేక్కితే మనకు కూడా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన పరిస్థితే వస్తుంది. వైసీపీ నాయకులకు కూడా ఒక మాట చెప్తున్నాను. నా మంచితనాన్ని చేతగానితనంగా, నన్ను అసమర్ధుడుగా మాత్రం చూడవద్దు. వైసీపీ నాయకులు డ్రగ్స్ సిగరెట్లు, గంజాయి, ఇసుక మాఫియా, అక్రమాలు, క్రికెట్ బెట్టింగ్, భూ దందాలు చేస్తాం అంటే చట్టం తన పని తాను చేస్తుంది. షోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడితే చట్టం తన పని కఠినంగా చేస్తుంది.’ అని వైసీపీ శ్రేణులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే కోఠం రెడ్డి.


మంత్రి పదవిపై మనసులోని మాట..

కష్ట సమయంలో తనకు అండగా నిలబడిన వారిని గుర్తు చేస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. తన బిడ్డలకు ఫోన్ చేసి స్కూల్‌కు వెళ్లిన పిల్లలు తిరిగి రారని బెదిరించారన్నారు. అయితే, వారికి ఎదురు తిరగమని చెప్పానని.. పోరాడితే పోయేది ఏమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప అని తన బిడ్డలకు చెప్పానన్నారు కోటంరెడ్డి. పులివెందుల సెంటర్‌కు రమ్మన్నా వస్తామని చెప్పామన్నారు. ఇదే సమయంలో మంత్రి పదవి ఆశించడంపై కీలక కామెంట్స్ చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. మంత్రి పదవి ఆశించడం తప్పు కాదన్నారు. అయితే, తనకు మంత్రి ఇవ్వడం అనేది చంద్రబాబుదే నిర్ణయం అని స్పష్టం చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 05 , 2024 | 03:15 PM