Home » Janasena
అందరి చూపు.. పిఠాపురం వైపే..! జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ్నుంచి పోటీచేయడంతో గెలుస్తారా..? ఓడిపోతారా..? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇక మెగాభిమానులు, జనసైనికులు అయితే నరాలు తెగే ఉత్కంఠతో వెయిట్ చేశారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘ఆరా’ మస్తాన్ పిఠాపురంలో గెలిచేదెవరో తేల్చి చెప్పేశారు.
జనసేన పార్టీ కీలక నేత నాగబాబు.. కూటమి కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. వైసీపీ మునిగిపోయే నావ అని.. ఈ విషయంలో ఆ పార్టీ నేతలు కొంత ఉద్వేగానికి లోనై దాడులు నిర్వహిస్తారని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటుందని.. కాబట్టి అటువంటి వాటికి ప్రతిస్పందించొద్దని జనసేన పార్టీ కీలక నేత నాగబాబు పార్టీ కార్యకర్తలకు ట్విటర్ వేదికగా తెలిపారు.
మచిలీపట్నంలో వైసీపీ రౌడీ మూకల అరాచకం మరోసారి వెలుగు చూసింది. జనసేన నాయకుడు కర్రి మహేష్ కారును వైసీపీ నేతలు తగుల బెట్టారు. ఇంటి ముందు పార్క్ చేసిన కారును తగుల పెట్టడంతో ఆవేదనకు గురైన మహేష్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మహేష్ మీడియాతో మాట్లాడుతూ.. అర్ధరాత్రి రెండు గంటల తరువాత తన కారును వైసీపీ గూండాలు తగుల పెట్టారని తెలిపారు.
నిడదవోలు అసెంబ్లీ స్థానంలో గెలుపు ఎవరిదనే దానిపై ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీ నాయకులు గెలుపు తమదంటే ఉమ్మడి అభ్యర్థిగా వచ్చిన గెలుపు మాదేనని ఉమ్మడి పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తైంది. గెలుపు గుర్రాలు ఎవరనేదానిపై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. పోలింగ్ పూర్తైన తరువాత వారం పాటు పోటీపడి బెట్టింగ్‌లు కట్టారు. కొందరు వైసీపీ అధికారంలోకి వస్తుందని పందేలు కాస్తే.. మరికొందరు ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందంటూ పందేలు కట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని తెలుగుదేశం పార్టీ నేత, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 13వ తేదీన వైసీపీకి ప్రజలు తిరస్కరించారని వివరించారు. ఒకవిధంగా ఆ పార్టీ 13వ తేదీన చనిపోయిందని తెలిపారు. జూన్ 4వ తేదీన సీఎం జగన్ దిమ్మదిరిగే ఫలితాలు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రస్తుతం బెట్టింగ్‌ల్లో కొత్త ట్రెండ్ నడుస్తోంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారన్న దానితో సంబంధం లేకుండా కేవలం ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏయే సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయి? ఏవి వైసీపీ దక్కించుకుంటుంది అన్న వాటిపై ఎక్కువగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.
ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన పామర్రులో అధికారం మాదంటే మాదేనంటూ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కులమతాలకు అతీతంగా పేదలకు అందించిన పింఛన్లు, ఇతర సంక్షేమ పథకాలతో వైసీపీ అభ్యర్థి రెండోసారి గెలుపొందటం ఖాయమని ఆ పార్టీ శ్రేణులు ప్రగాల్భాలు పలుకుతుండగా, వారికి దీటుగా ఎన్టీయే కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ వర్గాలు గత ఐదేళ్ల వైసీపీ పాలనతో ..
Andhrapradesh: ఎంపీ రఘురామ కృష్ణంరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం తిరుమలకు చేరుకున్న ఎంపీ.. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపీ రఘురామకు అర్చకులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయంపై ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలిచ్చిన విరాళాలతో పోటీచేసి గెలిచిన పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ఏలిన నియోజకవర్గమది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు డబ్బే ప్రధానమైంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నగదు వెదజల్లాయి. ఒక ఓటు సుమారు రూ.3 వేల వరకూ పలికిందంటే ఈ నియోజకవర్గం ఎంత ఖరీదైందో తెలుస్తుంది.