Raghurama:జూన్ 4న వైసీపీకి పెద్దకర్మ: రఘురామ సంచలనం
ABN , Publish Date - May 21 , 2024 | 05:24 PM
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని తెలుగుదేశం పార్టీ నేత, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 13వ తేదీన వైసీపీకి ప్రజలు తిరస్కరించారని వివరించారు. ఒకవిధంగా ఆ పార్టీ 13వ తేదీన చనిపోయిందని తెలిపారు. జూన్ 4వ తేదీన సీఎం జగన్ దిమ్మదిరిగే ఫలితాలు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.
విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని తెలుగుదేశం పార్టీ నేత, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామ కృష్ణరాజు (Raghurama Krishna Raju) సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 13వ తేదీన వైసీపీకి ప్రజలు తిరస్కరించారని వివరించారు. ఒకవిధంగా ఆ పార్టీ 13వ తేదీన చనిపోయిందని తెలిపారు. జూన్ 4వ తేదీన సీఎం జగన్ దిమ్మదిరిగే ఫలితాలు రావడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు చూసి వైసీపీకి ఆ రోజు పెద్ద కర్మ నిర్వహించాల్సి ఉంటుందని సెటైర్లు వేశారు. జగన్‌కు రిటర్న్ గిప్ట్ ఉంటుంది.. ఆ విషయం తర్వాత చెబుతామని మీడియా ప్రతినిధులకు రఘురామ వివరించారు.
నరకం చూపించారు..
గత ప్రభుత్వ హయాంలో తనకు నరకం చూపించారని రఘురామ వివరించారు. పుట్టి పెరిగిన ఊరు వచ్చేందుకు నాలుగేళ్ల సమయం పట్టిందని పేర్కొన్నారు. చివరికీ హైదరాబాద్‌లో అరెస్ట్ చేయించారని.. జగన్‌లో ఓ ఉన్మాది ఉన్నారని విమర్శించారు. ఉన్మాదికి అధికారం దక్కడంతో కొందరిని టార్గెట్ చేశారని రఘురామ వెల్లడించారు. తాను ఒక్కోడినే కాదు చాలామందిని జగన్ వేధించారు.. చివరికి అశోక గజపతిరాజు లాంటి సౌమ్యుడిని కూడా వదల్లేదని గుర్తుచేశారు.
కూటమి విజయం పక్కా
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయంపై రఘురామ ధీమాతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలకు 120 నుంచి 125 సీట్ల వరకు వస్తాయని వివరించారు. కూటమి నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తోందని ఆ పార్టీ నేతలు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని రఘురామ ధ్వజమెత్తారు. జగన్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ముహూర్తం కూడా ప్రకటించారు. ఆ ముహూర్తానికి వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతుందని సెన్సేషన్ కామెంట్స్ చేశారు.
Read Latest AP News and Telugu News