AP Politics: సర్వే సంస్థల నివేదికలతో.. బెట్టింగ్‌లపై వెనకడుగు..
ABN , Publish Date - May 23 , 2024 | 10:44 AM
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తైంది. గెలుపు గుర్రాలు ఎవరనేదానిపై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. పోలింగ్ పూర్తైన తరువాత వారం పాటు పోటీపడి బెట్టింగ్‌లు కట్టారు. కొందరు వైసీపీ అధికారంలోకి వస్తుందని పందేలు కాస్తే.. మరికొందరు ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందంటూ పందేలు కట్టారు.
ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తైంది. గెలుపు గుర్రాలు ఎవరనేదానిపై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. పోలింగ్ పూర్తైన తరువాత వారం పాటు పోటీపడి బెట్టింగ్‌లు కట్టారు. కొందరు వైసీపీ (YSRCP) అధికారంలోకి వస్తుందని పందేలు కాస్తే.. మరికొందరు ఎన్డీయే కూటమి (NDA Alliance) అధికారంలోకి వస్తుందంటూ పందేలు కట్టారు. పోలింగ్ పూర్తై పది రోజులు అవుతుంది. క్షేత్రస్థాయి నుంచి సర్వే సంస్థలకు పూర్తిస్థాయిలో సమాచారం అందింది. అంతేకాదు పార్టీ నేతలకు ఓటింగ్ జరిగిన విధానంపై క్లారిటీ వచ్చింది. దీంతో బెట్టింగ్‌లు కట్టేందుకు కొందరు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని సర్వే సంస్థల నివేదికలు చెబుతుండటంతో.. పందేలు కట్టేందుకు ముందుకు రావడంలేదట. వైసీపీపై భారీగా బెట్టింగ్‌లు కాసేందుకు రెడీ అయిన వ్యక్తులు సైతం ప్రస్తుతం పందేలు కాసేందుకు ముందుకు రావడంలేదట. మరోవైపు కూటమికి అనుకూలంగా బెట్టింగ్ కాసేందుకు ముందుకు వస్తుండగా.. వైసీపీపై మాత్రం ఎవరూ అడుగు ముందుకు వేయడంలేదనే చర్చ జరుగుతోంది.
ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు..
పందేం వద్దు బాబోయ్..
పోలింగ్ తర్వాత రోజు ఎన్ని కోట్లయినా బెట్టింగ్ కట్టేందుకు రెడీ అంటూ కాలర్ ఎగరవేసిన కొందరు ప్రస్తుతం మాత్రం చప్పుడు చేయడంలేదనే టాక్ వినిపిస్తోంది. ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీకి ఎక్కువ సీట్లు వస్తాయంటూ 10 కోట్లు పందేం కాసేందుకు ఒక వ్యక్తి పోలింగ్ జరిగిన మరుసటి రోజు రెడీ అయ్యారట. అవతలి పార్టీ రెండు రోజులు టైమ్ అడగ్గా.. ఓకే అన్నారట. తాజాగా కూటమికే ఎక్కువ వస్తాయంటూ రూ.10కోట్లు పందేం కాసేందుకు మరోపార్టీ రెడీ కాగా.. అవతలి వ్యక్తి సారీ తాను పందేం కాయబోనని చెప్పారట. ఇలా వైసీపీపై బెట్టింగ్ కాసేందుకు సొంతపార్టీ నేతలే వెనకడుగు వేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.
ఓటింగ్ సరళి తర్వాత క్లారిటీ..
కనీసం మెజార్టీ మార్క్‌కు కావాల్సిన సీట్లలో అయినా గెలుస్తామని వైసీపీ నేతలు పోలింగ్ ముందు వరకు ధీమాగా ఉన్నారట. పోలింగ్ పూర్తైన తర్వాత ఓటింగ్ సరళి పరిశీలించాక.. వైసీపీకి 50 దాటే అవకాశం లేదనే చర్చ సొంత పార్టీలోనే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సీట్లు మరో 10 నుంచి 20 మధ్యలో పెరిగినా వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. అసలు ఫలితం ఎలా ఉండబోతుందనేది మాత్రం జూన్4న తేలనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Latest AP News and Telugu News