Home » Janasena
ప్రజలిచ్చిన విరాళాలతో పోటీచేసి గెలిచిన పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు ఏలిన నియోజకవర్గమది. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు డబ్బే ప్రధానమైంది. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నగదు వెదజల్లాయి. ఒక ఓటు సుమారు రూ.3 వేల వరకూ పలికిందంటే ఈ నియోజకవర్గం ఎంత ఖరీదైందో తెలుస్తుంది.
Andhrapradesh: ఏపీలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పసుమర్రు దగ్గర బస్సు, టిప్పర్ ఢీ కొని అగ్ని జ్వాలలు ఎగసిపడటంతో ఆరుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు. అక్కడ బైపాస్ రోడ్ పనులు సాగుతున్న క్రమంలో తగిన రహదారి భద్రత చర్యలు తీసుకోవడం, వేగ నియంత్ర చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం సంభవించి ఉండేది కాదని అన్నారు.
మళ్లీ మేమే గెలుస్తున్నామన్నారు.. మహిళలు, వృద్ధులు, యువత పెద్దఎత్తున ఓట్లేశారని.. ఇవి మాకే పడ్డాయన్నారు.. సోమవారం పోలింగ్ ముగిసీ ముగియగానే..
Andhrapradesh: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ నాయకత్వానికి, ఉత్తర్ప్రదేశ్ అటవీశాఖ మంత్రి అరుణ్ కుమార్ సక్సేనాకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘దేశంలో అత్యంత పవిత్ర పుణ్య క్షేత్రం, శైవ క్షేత్రమైన వారణాశిలో నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించినందుకు నా కృతజ్ఞతలు’’ అని అన్నారు.
రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సంచలన రికార్డు నమోదైంది. పోటెత్తిన ఓటర్లతో బ్యాలట్లేకాదు.. రికార్డులు సైతం బద్దలయ్యాయి.
పోలింగ్ ముగిసిన తర్వాత కూడా వైసీపీ మూకల దాడులు కొనసాగుతునే ఉన్నాయి. మంగళవారం చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై హత్యాయత్నానికి పాల్పడ్డాయి.
Andhrapradesh: పిఠాపురం ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించబోతున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆ పార్టీ నేత నాగబాబు తెలిపారు. ‘‘గెలవడం అనేది మాకు ముఖ్యం. మెజారిటీ అనేది తర్వాత విషయం. గెలుపు అనేది ఎలాగైనా గెలుపే, గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంతతో గెలిచే మనది ముఖ్యం కాదు’’ అని అన్నారు.
తాము అధికారంలోకి రావడం ఖాయమేనని టీడీపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్సభ ఎన్నికలు -2024 పోలింగ్ ముగిసింది. చాలా ప్రాంతాల్లో వైసీపీ మూకలు హింసాత్మక ఘటనల మధ్య ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 6 గంటల్లోగా క్యూలైన్లలో ఉన్నవారికి పోలింగ్ సిబ్బంది అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఏపీలో ఓటింగ్ 67.99 శాతం పోలింగ్ నమోదయింది.
Andhrapradesh: ఏపీలో యుద్ధ ప్రాతిపదికన కాలువలకు మరమ్మతులు చేపట్టాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులపై గత అయిదేళ్లుగా దృష్టిపెట్టలేదని విమర్శించారు. సాగు నీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు వేసవి సమయంలో చేపట్టాలన్నారు.