AP Election 2024: కూటమి గెలుపునకు వైసీపీ కారణం..
ABN , Publish Date - May 14 , 2024 | 01:46 PM
Andhrapradesh: పిఠాపురం ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించబోతున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆ పార్టీ నేత నాగబాబు తెలిపారు. ‘‘గెలవడం అనేది మాకు ముఖ్యం. మెజారిటీ అనేది తర్వాత విషయం. గెలుపు అనేది ఎలాగైనా గెలుపే, గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంతతో గెలిచే మనది ముఖ్యం కాదు’’ అని అన్నారు.
కాకినాడ, మే 14: పిఠాపురం ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) గెలిపించబోతున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని ఆ పార్టీ నేత నాగబాబు (Janasena Leader Nagababu) తెలిపారు. ‘‘గెలవడం అనేది మాకు ముఖ్యం. మెజారిటీ అనేది తర్వాత విషయం. గెలుపు అనేది ఎలాగైనా గెలుపే, గెలిచిన తర్వాత ఏం చేస్తాం అనేది ముఖ్యం తప్ప ఎంతతో గెలిచే మనది ముఖ్యం కాదు. మెజార్టీ ఎంతైనా గెలుస్తామని నమ్మకం మాత్రం మాకు ఉంది. మా గెలుపుకి వైసీపీ పాలను కూడా కొంత కారణం’’ అని చెప్పుకొచ్చారు.
Indigo Flight: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నిలిచిన ఇండిగో విమానం...
స్వేచ్ఛపూరితమైన వాతావరణం కోసం డెమొక్రటిక్ అయిన పాలన కోసం ప్రజలంతా కలిసి వైసీపీని దింపేయాలని కంకణం కట్టుకున్నారన్నారు. ఇప్పటం సభలో ఓట్లు చీలనీయం అన్న మాటను లేదా చేసిన ప్రతిజ్ఞను ఈరోజు వరకు తూచా తప్పకుండా పాటిస్తూ వచ్చామని తెలిపారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురం ప్రజలు ప్రేమతో ఓటు వేశారన్నారు.
Loksabha Elections 2024: సౌత్‌లో బీజేపీ బలపడిందా..?
ఎర్రకండువాపై..
ఎర్రకండువ అనేది జనసేన జెండా కాదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఎర్రజెండా వేసుకుంటున్నారు కాబట్టి దానికి అంత పాపులారిటీ వచ్చిందన్నారు. ఈ ఎర్రకండువాని కాశీతువాలంటారని.. అది తమ చిన్నప్పుడు నుంచి చూస్తూనే ఉన్నామన్నారు. సామాన్య మానవుడు చెమట తుడుచుకునేందుకు ఉపయోగించే ఒక సాధారణ టవల్ అని చెప్పుకొచ్చారు. వైసీపీ వాళ్లు ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే ఆ తువాళ్ళు తీసేయమన్నారని మండిపడ్డారు. వైసీపీ వాళ్లు ఎన్నికల్లో వారి జెండాలు వేసుకుని తిరగవచ్చని.. ఎర్ర టవలుని తీసేయండి అంటే ఎలా కుదురుతుందని నాగబాబు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
Mukesh Kumar Meena: ఏపీలో 81 శాతం పైనే పోలింగ్..
Putta Mahesh: ఓటింగ్ అంతా కూటమికి అనుకూలం
Read Latest AP News And Telugu News