Share News

AP Election 2024 Polling highlights: ఏపీ పోలింగ్ డే.. ఒక్క క్లిక్‌తో ఎక్కడేం జరుగుతోందో తెలుసుకోండి..!

ABN , First Publish Date - May 13 , 2024 | 04:54 AM

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు -2024 పోలింగ్ ముగిసింది. చాలా ప్రాంతాల్లో వైసీపీ మూకలు హింసాత్మక ఘటనల మధ్య ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 6 గంటల్లోగా క్యూలైన్లలో ఉన్నవారికి పోలింగ్ సిబ్బంది అవకాశం కల్పించారు. సాయంత్రం 5 గంటల సమయానికి ఏపీలో ఓటింగ్ 67.99 శాతం పోలింగ్ నమోదయింది.

AP Election 2024 Polling highlights: ఏపీ పోలింగ్ డే.. ఒక్క క్లిక్‌తో ఎక్కడేం జరుగుతోందో తెలుసుకోండి..!

Live News & Update

  • 2024-05-13T20:26:59+05:30

    రాష్ట్రప్రజల తెగువకు పాదాభివందనం : నారా లోకేశ్

    రాష్ట్రప్రజల తెగువకు పాదాభివందనం అంటూ ఎక్స్ వేదికగా నారా లోకేశ్ స్పందించారు. రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు అధికారపార్టీ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ పోలింగ్ కేంద్రాలవద్ద ఓట్లతో తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అభినందనలు అని పేర్కొన్నారు. ‘‘ తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరడం వెల్లివిరిసిన ప్రజాచైతన్యానికి నిదర్శనం. భావితరాల భవిష్యత్తు కోసం అరాచకశక్తులకు ఎదురొడ్డి ఎపి ప్రజలు చూపిన తెగువ చరిత్ర పుటల్లో నిలచిపోతుంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఉప్పెనలా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ఓటరు దేవుళ్లకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శ్రమించిన నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.

  • 2024-05-13T20:05:43+05:30

    రాష్ట్రప్రజల తెగువకు పాదాభివందనం: నారా లోకేశ్

    రాష్ట్రంలో ప్రజాతీర్పును తారుమారు చేసేందుకు అధికారపార్టీ చేసిన అన్ని ప్రయత్నాలను తిప్పికొడుతూ పోలింగ్ కేంద్రాలవద్ద ఓట్లతో తిరుగుబాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి నా అభినందనలు. తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు ఓటుహక్కు వినియోగించుకునేందుకు బారులు తీరడం వెల్లివిరిసిన ప్రజాచైతన్యానికి నిదర్శనం. భావితరాల భవిష్యత్తు కోసం అరాచకశక్తులకు ఎదురొడ్డి ఎపి ప్రజలు చూపిన తెగువ చరిత్ర పుటల్లో నిలచిపోతుంది. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఉప్పెనలా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చిన ఓటరు దేవుళ్లకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. పార్టీ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శ్రమించిన నాయకులు, కార్యకర్తలందరికీ ధన్యవాదాలు.

  • 2024-05-13T19:50:51+05:30

    IWdjNCWWOmI-HD.jpg

    రాత్రి 10 గంటలకు పోలింగ్ ముగిస్తాం: ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా

    • కొన్నిచోట్ల ఇంకా పోలింగ్ కొనసాగుతోంది

    • ఈవీఎంలు మొరాయించిన చోట్ల వెంటనే మార్చివేశాం

    • ఇంకా కొన్ని చోట్ల వందల మంది క్యూలైన్లలో ఉన్నారు

    • ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించే ప్రక్రియ తెల్లవారు కొనసాగుతోంది

    • పోలింగ్ ఆఫీసర్లు అందించే సమాచారం ఆధారంగా రీపోలింగ్‌పై నిర్ణయం

    • పల్నాడులో 12 చోట్ల ఘర్షణలు జరిగాయి

    • గతంలో కంటే భిన్నంగా ఓటింగ్ శాతం పెరుగుతుంది

    • పుంగనూర్ ఎస్సైపై ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాం

    • పల్నాడులో ఒక ఈవీఎంను ధ్వంసం చేశారు

    • ఈవీఎంలలోని డేటా భద్రంగా ఉంది

    • 11 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారు. అక్కడ మార్చి మళ్లీ పోలింగ్ నిర్వహించాం

    • తుది పోలింగ్ రేపు వెల్లడిస్తాం

  • 2024-05-13T19:25:47+05:30

    రాత్రి 9 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం

    • పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 13, 14, 15, 16 పోలింగ్ బూతుల్లో వందలాదిగా బారులు తీరి ఉన్న ఓటర్లు..

    • పోలింగ్ కేంద్రంలో ఉన్నవారికి కూపన్లు జారీ చేసి ఓటింగ్ చేసే అవకాశం కల్పించిన అధికారులు

    • అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 227, 228,187, రాయదుర్గం మండలంలోని ఉడేగోళం, వీరాపురం, గుమ్మఘట్ట మండలంలోని గొల్లపల్లి, కనేకల్ మండలంలోని గరుడచేడు, తుంబింగనూరు గ్రామాలు, కనేకల్ మండల కేంద్రంలోని 33 పోలింగ్ కేంద్రంలో ఏడు గంటల తర్వాత కూడా కొనసాగుతున్న పోలింగ్

  • 2024-05-13T19:20:39+05:30

    • సాయంత్రం 6 దాటినా కొన్ని చోట్ల కొనసాగుతున్న పోలింగ్

    • పోలింగ్ శాతం పెరిగే అవకాశం

    • 6 గంటలకు కర్నూలు పార్లమెంట్ (పాణ్యం నియోజకవర్గం మినహాయించి) 69.53 శాతం

    • కర్నూలు : 65.35 శాతం

    • పాణ్యం : 71.42 శాతం

    • పత్తికొండ : 70.85 శాతం

    • కోడుమూరు : 68.54 శాతం

    • ఎమ్మిగనూరు : 75.98 శాతం

    • మంత్రాలయం : 79.18 శాతం

    • ఆదోని : 65.86 శాతం

    • ఆలూరు : 69.76 శాతం

  • 2024-05-13T18:10:26+05:30

    • ఏపీలో ముగిసిన పోలింగ్

    • సాయంత్రం 6 గంటలకు ముగిసిన పోలింగ్

    • క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం ఇచ్చిన ఎన్నికల సిబ్బంది

  • 2024-05-13T18:09:36+05:30

    రద్దీగా మారీన విజయవాడ - హైదరాబాద్ రహదారి

    • రహదారి పొడవునా బైకులు, కార్లు, బస్సులతో రద్దీ

    • ఆంధ్ర ప్రాతంలో ఓటు హక్క వినియోగించుకొని హైదారాబాద్‌కు తిరిగి పయనమైన ఆంధ్ర వాసులు

    • రెండు రోజుల క్రితం తెలంగాణ నుంచి ఆంధ్రకు వచ్చిన ఆంధ్ర ప్రాంత వాసులు

    • సొంత ఊర్లలో ఓటు హక్క వినియోగించుకొని తెలంగాణకు పయనం

  • 2024-05-13T17:55:54+05:30

    ఏపీలో జిల్లాల వారీగా పోలింగ్

    • కడప : 72.85 శాతం

    • చిత్తూరు : 74.06 శాతం

    • బాపట్ల : 72.14 శాతం

    • అల్లూరి : 55.17 శాతం

    • అనకాపల్లి : 65.97 శాతం

    • అనంతపురం : 68.04 శాతం

    • అన్నమయ్య : 67.63 శాతం

    • కృష్ణా : 73.53 శాతం

    • కోనసీమ : 73.55 శాతం

    • నంద్యాల : 71.43 శాతం

    • విశాఖపట్నం : 57.42 శాతం

    • ఏలూరు : 71.10 శాతం

    • పశ్చిమ గోదావరి : 68.98 శాతం

    • నెల్లూరు : 69.95 శాతం

    • కర్నూలు : 64.55 శాతం

    • ప్రకాశం : 71 శాతం

    • ఎన్టీఆర్‌: 67.44 శాతం

    • విజయనగరం : 68.16 శాతం

    • తూర్పు గోదావరి: 67.93 శాతం

    • పల్నాడు : 69.10 శాతం

    • శ్రీకాకుళం : 67.48 శాతం

    • తిరుపతి: 65.88 శాతం

    • గుంటూరు: 65.58 శాతం

    • కాకినాడ : 65.01 శాతం

    • సత్యసాయి : 67.16 శాతం

    • పార్వతీపురం మన్యం: 61.18 శాతం

  • 2024-05-13T17:32:57+05:30

    సాయంత్రం 5 గంటలకు ఏపీలో 67.99 శాతం పోలింగ్

  • 2024-05-13T17:20:28+05:30

    • జోగి రమేశ్ కొడుకు వీరంగం

    • పోలింగ్ సిబ్బందిపై దాడి

    • Untitled-10.jpg

  • 2024-05-13T17:19:53+05:30

    ఏపీలోని మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతంలో ఉన్న అరకు, పాడేర, రంపచోడవరం నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

  • 2024-05-13T17:02:57+05:30

    పోరంకిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ

    ఒకరిపై ఒకరు సవాళ్లు, ప్రతి సవాళ్లు

    రాళ్లు రువ్వుకున్న కార్యకర్తలు

    పరిస్థితి ఉద్రిక్తం

    ఇరు వర్గాలను‌ చెదర గొట్టిన పోలీసులు

  • 2024-05-13T16:40:36+05:30

    Chandrababu2.jpg

    పోలీసులు విఫలమయ్యారు.. ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు

    రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల హింసపై కేంద్ర ఎన్నికల సంఘానికి తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. నేడు జరుగుతున్న ఎన్నికల్లో రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలీసులు శాంతిభద్రతలు పరిరక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందారని అన్నారు. వైసీపీ కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఎన్టీఏ కూటమి అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. పోలీసుల కళ్లెదుటే ఒక్క పల్నాడు జిల్లాలో ఇప్పటి వరకు 12 కు పైగా రక్తపు గాయాలతో కూడిన హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదులో చంద్రబాబు పేర్కొన్నారు.

  • 2024-05-13T16:34:52+05:30

    Untitled-5.jpg

    • ఈ రోజు ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత కూడా జగన్, విడుదల రజనీ పేరుతో ఐవీఆర్ఎస్ కాల్స్

    • కేసు నమోదు చేసిన పోలీసులు

    • ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఓటర్లు

    • జగన్, విడుదల రజనీ పేరుతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన జగన్‌కు ఓటు వెయ్యండి అంటూ వస్తున్న ఐవీఆర్‌ఎస్ కాల్స్

    • చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన దేవినేని ఉమ, పంచుమర్తి అనురాధ

    • వీటిపై పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన ఎన్నికల కమీషన్

    • ఐవీఆర్ఎస్ కాల్స్ వాయిస్ ఉన్న పెన్ డ్రైవ్‌ను కూడా ఎన్నికల కమీషన్‌కు అందించిన టీడీపీ నేతలు

    • ఎన్నికల కమీషన్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన మంగళగిరి పోలీసులు

    • క్రైం నెంబర్ 249/24 కింద కేసు నమోదు

    • ఐపీసీలోని 188, 171f, 171h, ప్రజాప్రాతినిధ్యం చట్టంలోని 123, 126, 130 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన మంగళగిరి రూరల్ పోలీసులు

    • పోలింగ్ ప్రారంభమైన తర్వాత ఐవీఆర్ఎస్ కాల్స్ రావడాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్నికల సంఘం

    • గుంటూరు పశ్చిమ అభ్యర్ది విడుదల రజనీపై కూడా కేసు నమోదు

  • 2024-05-13T16:27:59+05:30

    • అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో ముగిసిన పోలింగ్

    • ఈ నియోజకవర్గాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయి

    • అందుకే ముందుగా పోలింగ్ ముగిసింది

  • 2024-05-13T16:23:02+05:30

    ఏపీలో ఎన్నికల సందర్భంగా జరుగుతున్న హింసాత్మక ఘటనలపై తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ జరగుతుందని.. వైఎస్సార్సీపీ నేతలు అల్లర్లు, దాడులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • 2024-05-13T16:05:07+05:30

    తిరుపతిలో సైలెంట్‌గా దొంగ ఓట్లు

    • మంచి దుస్తులు కట్టుకునే విధంగా చేసి మహిళలని కారులో తీసుకొని వెళ్లి దొంగ ఓట్లు వేయిస్తున్న వైసీపీ

    • వలస వెళ్లినవారు, అన్ ట్రేస్డ్‌గా ఉన్న ఏ ఎస్ డీ లిస్టును పోలింగ్ ఏజెంట్లకు ఇవ్వకుండా రహస్యంగా ఉంచుతున్న బూతుల్లోని పోలింగ్ సిబ్బంది

    • నిన్న రాత్రి తమకు అమ్ముడుపోయిన సిబ్బంది ఉన్న బూతుల్లో రహస్యంగా ఓటింగ్

    • వెబ్ కాస్టింగ్‌లో దొరకుండా ఒక్కో బూతు ఒక్కో రంగు చీరతో తీసుకుపోతున్న వైసీపీ కార్యకర్తలు

    • ఏ ఎస్ డీ లిస్టులో ఉన్న ఓట్లను, ఖరీదైన చీరలు కట్టుకు వచ్చిన మహిళల ద్వారా వేయిస్తున్న వైసీపీ

  • 2024-05-13T15:58:49+05:30

    Untitled-4.jpg

    అనకాపల్లి జిల్లాలో మధ్యాహ్నం 3 గంటల సమయానికి 44.70 శాతం పోలింగ్ నమోదు

    నియోజకవర్గాల వారీగా చూస్తే..

    • అనకాపల్లి.... 60.80 శాతం

    • చోడవరం............ 52.76 శాతం

    • మాడుగుల.. 56.00 శాతం

    • నర్సీపట్నం........ 58.12 శాతం

    • పాయికరావుపేట... 46.79 శాతం

    • ఎలమంచిలి..... 47.54 శాతం

    • పెందుర్తి......... 43.80 శాతం

  • 2024-05-13T15:57:12+05:30

    గుంటూరు జిల్లా: అంకిరెడ్డిపాలెంలో దళితులపై దాడి

    • రిగ్గింగ్ చేయడానికి వచ్చారంటూ దాడికి పాల్పడ్డ వైసీపీ వర్గం

    • దాడికి గురైన దళిత యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

    • యువకులు ఎక్కడ ఉన్నారో చెప్పాలంటూ కుటుంబ సభ్యుల ఆగ్రహం

  • 2024-05-13T15:55:49+05:30

    ECI.jpg

    ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనపై ఈసీ సీరియస్

    • వైసీపీ దాడులపై ఎన్నికల సంఘం ఆగ్రహం

    • దాడులు చేసేవారిని ఉపేక్షించవద్దని పోలీసు ఉన్నతాధికారులకు ఈసీ ఆదేశాలు జారీ

    • తెనాలి, మాచర్ల, అనంతపురంలో ఘటనలపై ఈసీ ఆగ్రహం

    • గృహ నిర్బంధంతో పాటు కేసులు పెట్టాలని ఆదేశం

    • పుంగనూరులో నిందితులను వదిలేసిన ఎస్‌ఐని సస్పెండ్ చేయాలని ఆదేశాలు

    • పోలింగ్ ముగుస్తున్న సమయంలో అరాచకాలకు దిగుతున్న వైసీపీ

    • గెలుపు అవకాశాలు లేని ప్రాంతాల్లో చెలరేగుతున్న వైసీపీ మూకలు

    • ఓడిపోతున్నామనే నిరాశలో వైసీపీ దాడులకు తెగబడుతోందని టీడీపీ ఆరోపణ

  • 2024-05-13T15:55:37+05:30

    అల్లూరి జిల్లా: ఓటర్లతో వెళ్తున్న వ్యాన్ బోల్తా..

    • ముగ్గురు పరిస్థితి విషమయం.. 12 మందికి తీవ్ర గాయాలు

    • పెద్దకోట పంచాయతీ సీడీవలస పాటిపెల్లి వద్ద బొల్తా పడిన వ్యాన్

    • కుడియా వద్ద భారీ బొలెరో బోల్తా

    • వేలమామిడి పోలింగ్ బూత్ అధికారులు నిర్లక్ష్యం

    • పెదకోట పంచాయతీ కేంద్రంలో పోలింగ్ ఏర్పాటు చేయడమే ఈ దుర్ఘటన జరగడానికి ప్రధానమైన కారణమని బాధితుల మండిపాటు

  • 2024-05-13T15:49:40+05:30

    ఏపీలో మధ్యాహ్నం 3 గంటలకు 55.49 శాతం పోలింగ్

    • కడపలో : 60.57 శాతం

    • చిత్తూరులో : 64.64 శాతం

    • బాపట్లలో : 59.49 శాతం

    • అల్లూరిలో : 48.87 శాతం

    • అనకాపల్లిలో : 53.45 శాతం

    • అనంతపురంలో : 54.25 శాతం

    • అన్నమయ్యలో : 54.44 శాతం

    • కృష్ణాలో : 59.39 శాతం

    • కోనసీమలో : 59.73 శాతం

    • నంద్యాలలో : 59.30 శాతం

    • విశాఖపట్నంలో : 46.21 శాతం

    • ఏలూరులో : 57.14 శాతం

    • పశ్చిమ గోదావరి జిల్లాలో : 54.60 శాతం

    • నెల్లూరులో : 58.14 శాతం

    • కర్నూలులో : 52.26 శాతం

    • ప్రకాశంజిల్లాలో : 59.96 శాతం

    • ఎన్టీఆర్‌ జిల్లాలో : 55.71 శాతం

    • విజయనగరంలో : 54.31 శాతం

    • తూర్పు గోదావరి జిల్లాలో : 52.32 శాతం

    • పల్నాడులో : 56.48 శాతం

    • శ్రీకాకుళంలో : 54.87 శాతం

    • తిరుపతిలో : 54.42 శాతం

    • గుంటూరులో : 52.24 శాతం

    • కాకినాడలో : 52.69 శాతం

    • సత్యసాయి జిల్లాలో : 57.56 శాతం

    • పార్వతీపురం మన్యం జిల్లాలో : 51.75 శాతం

  • 2024-05-13T15:36:21+05:30

    ఏపీలో మధ్యాహ్నం 3 గంటలకు 55.49 శాతం పోలింగ్

  • 2024-05-13T15:25:34+05:30

    అమరావతి: రెంటచింతల ఎస్సై సస్పెండ్ చేయాలంటూ ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. దీంతో మరికాసేపట్లో ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

  • 2024-05-13T15:20:26+05:30

    ఏపీలో 50 శాతం దాటిన పోలింగ్...

    ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం 2 గంటల సమయానికి పోలింగ్ 50 శాతం మార్కు దాటింది. ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ శాతం నమోదవ్వొచ్చనే ఎన్నికల సంఘం అధికారులు విశ్లేషిస్తున్నారు.

  • 2024-05-13T15:18:19+05:30

    • ముప్పాళ్ల మండలం మాదల పోలింగ్ బూత్‌ పై రాళ్లు రువ్విన వైసీపీ శ్రేణులు

    • టీడీపీకి ఓట్లు వేస్తున్నారనే అక్కసుతో పోలీంగ్ బూత్‌పై రాళ్లు రువ్విన వైసీపీ

    • భయబ్రాంతులకు గురైన టీడీపీ సానుభూతిపరులు

    • పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు..

  • 2024-05-13T15:14:57+05:30

    తిరుపతి: బ్రాహ్మణ కాల్వలోని పోలింగ్ బూత్ వద్ద ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌పై వైసీపీ అభ్యర్థి మోహిత్ రెడ్డి దౌర్జన్యానికి పాల్పడ్డారు. దుర్భషలాడి ఫోన్ కింద కొట్టిన మోహిత్ రెడ్డి.

  • 2024-05-13T15:11:03+05:30

    పిఠాపురం నియోజకవర్గంలో 1 గంటకు 41.50 శాతం ఓటింగ్

    Polling.jpg

  • 2024-05-13T14:55:18+05:30

    విజయవాడ పశ్చిమలో ఉద్రిక్తత

    విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని భవానిపురం స్వాతి సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జలీల్ ఖాన్ వర్గానికి, వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దాడికి వైసీపీకి వైసీపీ నాయకులు ప్రయత్నించారు. రోడ్డుపై బైఠాయించిన వైసీపీ మద్దతుదారులను పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి చెదరగొట్టారు.

  • 2024-05-13T14:30:22+05:30

    ఎమ్మెల్యే అన్నబత్తుని శివ కుమార్‌కు గృహ నిర్భంధం

    Untitled-2.jpg

    అమరావతి: తెనాలిలో ఓటర్‌పై చేయిచేసుకున్న తెనాలి ఎమ్మెల్యే అన్నబత్తుని శివ కుమార్‌కు గృహ నిర్భంధం విధించాలంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. క్యూ లైన్‌లో రాకుండా పోలింగ్ బూత్‌లోకి వెళ్లొద్దంటూ ప్రశ్నించిన సామాన్యుడు గొట్టిముక్కల సుధాకర్‌‌పై వెళ్తున్న శివకుమార్‌ దాడి చేశాడు. తనను ప్రశ్నించడాన్ని ఎమ్మెల్యే శివకుమార్ జీర్ణించుకోలేక ఈ దాడి చేశారు. శివకుమార్ వ్యవహారశైలిపై ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. అతడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆయనను పోలింగ్ పూర్తయ్యే వరకు గృహ నిర్బంధంలో ఉంచాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

  • 2024-05-13T14:24:23+05:30

    • పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయి గేట్‌లో ఘర్షణ

    • రాళ్లు రువ్వుకున్న ఇరు వర్గాలు

    • టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మ రెడ్డి వర్గీయుడి కారు దగ్ధం

  • 2024-05-13T14:16:59+05:30

    తెనాలి ఎమ్మెల్యే చేతిలో దాడికి గురైన వ్యక్తి విషయంలో పైశాచికత్వం

    తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ చేతిలో దాడికి గురైన వ్యక్తి విషయంలో పోలీసులు పైశాచికత్వం ప్రదర్శించారు. ఎమ్మెల్యే అనుచరుల దాడిలో గాయపడ్డ బాధితుడు గొట్టిముక్కల సుధాకర్‌ను ఆస్పత్రికి కాకుండా 2-టౌన్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. దీంతో టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్థానిక టీడీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ ముట్టడికి సిద్ధమవుతున్నాయి.

  • 2024-05-13T13:55:15+05:30

    సోషల్ మీడియాలో మరో ఫేక్ వీడియో.. అస్సలు నమ్మొద్దు

    Chandrababu.jpg

    పోలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ కూడా సోషల్ మీడియాలో వైసీపీ మూకల దుష్ప్రచారాలు ఆగడం లేదు. ‘‘పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్డీయేకి మద్దతు కరువు. పోలింగ్ కేంద్రాల నుంచి చంద్రబాబు నాయుడు తిరిగి వెళ్లిపోతున్నారు’’ అంటూ ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పేరిట ఫేక్ వీడియోను వైరల్‌గా మార్చారు. ఈ వీడియోను తెలుగుదేశం పార్టీ ఖండించింది. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ప్రకటన చేసింది. ‘‘జూన్ 4 తర్వాత మా పార్టీ ఆఫీస్ ముందు ఒక ఫోటోషాప్ సెంటర్ పెట్టుకో జగన్..’’ అంటూ టీడీపీ ఖండించింది.

  • 2024-05-13T13:30:05+05:30

    అక్షరాలా కోటిన్నర..!

    • ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 36 శాతం మేర పోలింగ్ నమోదు 36.84 శాతం మేర ఓటేసిన మహిళలు

    • 35.03 శాతం మేర ఓటేసిన పురుషులు

    • ఇప్పటి వరకు ఓటేసిన కోటిన్నర మంది ఓటర్లు

    • రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,14,01,887 ఓటర్లు

    • ఇందులో పురుషులు 2,03,39,851 మంది..

    • మహిళలు 2,10,58, 615 మంది..

    • ఇతరులు 3,421 మంది

    Polling.jpg

  • 2024-05-13T13:25:26+05:30

    ఏపీలో మధ్యాహ్నం 1 గంట వరకూ పోలింగ్ శాతం ఇలా..

    • కడపలో : 27.17 శాతం

    • చిత్తూరులో : 26.10శాతం

    • బాపట్లలో : 26.80 శాతం

    • అల్లూరిలో : 18.43 శాతం

    • అనకాపల్లిలో : 19.97 శాతం

    • అనంతపురంలో : 23.91 శాతం

    • అన్నమయ్యలో : 22.28 శాతం

    • కృష్ణాలో : 26.14 శాతం

    • కోనసీమలో : 26.81 శాతం

    • నంద్యాలలో : 26.60 శాతం

    • విశాఖపట్నంలో : 20.42 శాతం

    • ఏలూరులో : 24.40 శాతం

    • పశ్చిమ గోదావరి జిల్లాలో : 23.35 శాతం

    • నెల్లూరులో : 23.60 శాతం

    • కర్నూలులో : 21.90 శాతం

    • ప్రకాశంజిల్లాలో : 24.10 శాతం

    • ఎన్టీఆర్‌ జిల్లాలో : 29 శాతం

    • విజయనగరంలో : 23.19 శాతం

    • తూర్పు గోదావరి జిల్లాలో : 21.79 శాతం

    • పల్నాడులో : 23.18 శాతం

    • శ్రీకాకుళంలో : 21.54 శాతం

    • తిరుపతిలో : 22.80 శాతం

    • గుంటూరులో : 24.28 శాతం

    • కాకినాడలో : 21.45 శాతం

    • సత్యసాయి జిల్లాలో : 20.58 శాతం

    • మన్యం జిల్లాలో : 18.61 శాతం

    ap polling.jpg

  • 2024-05-13T13:15:57+05:30

    పీఎస్‌లో ఎమ్మెల్యేను కొట్టిన వ్యక్తి!

    • క్యూలో రమ్మన్నందుకు ఓటరుపై దాడిచేసిన తెనాలి వైసీపీ అభ్యర్థి దాడి

    • నన్నే క్యూలో రమ్మంటావా అంటూ ఓటరుపై విచక్షణా రహితంగా దాడికి తెగబడిన ఎమ్మెల్యే

    • సహనం కోల్పోయి ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఓటరు

    • ఆ ఓటరును గొట్టిముక్కల సుధాకర్‌గా గుర్తించిన వైసీపీ కార్యకర్తలు

    • రివర్స్ కేసుపెట్టి సుధాకర్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు

    • గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లకుండా 2టౌన్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు

    • పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు

    • ఓడిపోతామనే భయంతోనే ఇలా దాడికి దిగారంటూ తిట్టిపోస్తున్న టీడీపీ శ్రేణులు

    chmepa-chellu.jpg

  • 2024-05-13T13:10:12+05:30

    నివురుగప్పిన నిప్పులా పల్నాడు!

    • పల్నాడు జిల్లాలో పోలింగ్ ప్రారంభం నుంచి గొడవలు

    • క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో వైసీపీ-టీడీపీ వర్గాల బాహాబాహీ

    • దొడ్లేరులోని పోలింగ్ కేంద్రం ఎదుట నడిరోడ్డు మీద ఇరువర్గాల దాడులు

    • పోలీసు బలగాల లేమి కారణంగా ఇరువర్గాలను చెదరగొట్టలేని ఖాకీలు

    • అరగంటకు పైగా నడిరోడ్డుపై ఇరువర్గాల ఘర్షణ

  • 2024-05-13T13:00:08+05:30

    ఓటేయమన్నారు.. కొట్టుకున్నారు!

    • పశ్చిమ గోదావరి జిల్లా పలుచోట్ల గొడవలు

    • ఆచంట మండలం కొడమంచిలిలో టీడీపీ- వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట.. ఉద్రిక్తత

    • కొడమంచిలి హైస్కూల్ పోలింగ్ కేంద్రం ఎదుట ఇరు పార్టీల నేతలు ఓటర్లను తమ పార్టీకే ఓటు వేయాలని కోరడంతో ఘర్షణ

    • మూకుమ్మడిగా వైసీపీ నాయకులు.. టీడీపీ నాయకులపై దాడి

    • పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో ప్రచారం చేసుకోవాలని నిబంధనలు ఉల్లంఘించినప్పటికీ పట్టించుకోని పోలీసులు

    • ఓటమి భయంతోనే ఎమ్మెల్యే రంగనాథరాజు తన అనుచరులైన గుండాలతో దాడి చేయించారని టీడీపీ ఆరోపణ

    TDP-vs-YSRCP.jpg

  • 2024-05-13T12:50:34+05:30

    • మాచర్లలో ఆగిపోయిన పోలింగ్!

    • మాచర్లలో 216, 205, 206, 207 పోలింగ్ స్టేషన్లలో నిలిచిపోయిన పోలింగ్

    • ఈవీఎంలను పగులగొట్టిన వైసీపీ కార్యకర్తలు

    • పోలింగ్ నిలిపివేసి.. భయంతో బయటకు వెళ్లిపోయిన సిబ్బంది

    Macharla.jpg

  • 2024-05-13T12:40:57+05:30

    రియల్ సీనే కానీ.. ఏమీ జరగలేదు!!

    • అనంతపురం తాడిపత్రిలో మళ్లీ ఫ్యాక్షన్ పడగలు!

    • రియల్‌ లైఫ్‌లో సినిమాను మించిన సీన్లు కనిపించిన పరిస్థితి

    • ఒకే పోలింగ్ బూత్‌లో ఎదురుపడ్డ ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి

    • ఒకరిని చూస్తూ మరొకరు ఎదురెదురుగా నిలబడిన పరిస్థితి

    • ఏం జరుగుతుందా అని జనాల్లో హైటెన్షన్

    • అనుకున్నట్లుగానే మొదలైన గొడవ

    • పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గని నేతలు

    • ఆఖరికి అదుపులోనికి వచ్చిన పరిస్థితి.. అంతా ప్రశాంతం

    • మరోవైపు.. కమాన్‌ సర్కిల్‌లో వైసీపీ, టీడీపీ వర్గీయుల ఘర్షణ

    • పరస్పరం రాళ్ల దాడి.. పలు వాహనాలు ధ్వంసం

    • దీంతో మళ్లీ మొదటికి వచ్చిన పరిస్థితులు

    Tadipatri.jpg

  • 2024-05-13T12:30:44+05:30

    నంద్యాల జిల్లాలో పరిస్థితి ఇదీ..

    మధ్యాహ్నం 12-00 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 28.21

    • ఆళ్లగడ్డ : 28.58 శాతం

    • బనగానపల్లి : 26.88 శాతం

    • డోన్ : 28.21 శాతం

    • నందికొట్కూర్ : 28.69 శాతం

    • నంద్యాల : 28.66 శాతం

    • శ్రీశైలం : 28.22 శాతం

    • అధికారికంగా ప్రకటించిన జిల్లా కలెక్టర్

  • 2024-05-13T12:20:33+05:30

    మధ్యాహ్నం 12 గంటలకు లెక్కలివీ..

    • ఏపీలో జిల్లాల వారీగా ఇప్పటి వరకూ పోల్ పర్సెంటేజ్

    • అధికారిక లెక్కల ప్రకారం ఏపీ వ్యాప్తంగా పోలైన ఓట్లు శాతం 23.10

    పార్లమెంట్ స్థానాల వారీగా..

    • అమలాపురం : 26.74%

    • అనకాపల్లి : 19.33%

    • అనంతపూర్ : 23.66%

    • అరకు : 16.99%

    • బాపట్ల : 27.03%

    • చిత్తూరు : 25.98%

    • ఏలూరు : 24.28%

    • గుంటూరు : 20.84%

    • హిందూపూర్ : 21.36%

    • కడప : 27.02%

    • కాకినాడ : 21.26%

    • కర్నూలు : 21.86%

    • మచిలీపట్నం : 25.84%

    • నంద్యాల : 26.39%

    • నరసాపురం : 23.26%

    • నరసరావుపేట : 23.25%

    • నెల్లూరు : 23.70%

    • ఒంగోలు : 26.04%

    • రాజమండ్రి : 21.75%

    • రాజంపేట : 22.83%

    • శ్రీకాకుళం : 21.87%

    • తిరుపతి : 22.11%

    • విజయవాడ : 21.39%

    • విశాఖపట్నం : 21.34%

    • విజయనగరం : 22.30%

    Polling.jpg

  • 2024-05-13T12:00:08+05:30

    • ఓటరును కొట్టడమేంటి..?

    • పోలింగ్ సరళిని పరిశీలించిన స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా

    • హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు.

    • పోలింగ్ సరళిని కమాండ్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షించిన మిశ్రా

    • ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ సరళిని వివరించిన ఎంకే మీనా

    • 42 వేల సీసీ కెమెరాలు పెట్టినా హింసాత్మక ఘటనలు ఎందుకు జరిగాయంటూ దీపక్ మిశ్రా ఆగ్రహం

    • తెనాలి అయితా నగర్‌లో ఓటర్‌పై.. ఎమ్మెల్యే చేయి చేసుకున్న ఘటనపై దీపక్ మిశ్రా మండిపాటు

    • ఓటరును కొట్టడమేంటి అని ఆగ్రహం

    • ఐతానగర్ పోలింగ్ బూత్ వద్దనున్న పరిస్థితిని సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన దీపక్ మిశ్రా

    • ఎమ్మెల్యే కొట్టిన ఘటనకు సంబంధిచి సీసీ ఫుటేజ్‌ను తెప్పించాలన్న దీపక్ మిశ్రా

    • హింసాత్మక ఘటనలు జరిగిన మరో ఐదు ప్రాంతాల్లోని పరిస్థితి నివేదికవ్వాలని అధికారులకు మిశ్రా ఆదేశాలు

    a0.jpg

  • 2024-05-13T11:55:58+05:30

    కొనసా...గుతున్న పోలింగ్.. కూటమిలో ఫుల్ జోష్!

    • ఏపీలో ముమ్మరంగా కొనసాగుతున్న పోలింగ్

    • మారుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు అదే జోరు

    • వేల సంఖ్యలో ఓటర్లతో పోలింగ్ బూత్‌లు కిటకిట

    • ఉత్సాహంగా ఓటు వేయడానికి వస్తున్న అన్ని వర్గాల ప్రజలు

    • గ్రామీణ ప్రాంతాలతో పాటు ఈసారి పట్టణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్

    • మాచర్ల, పుంగనూరు వంటి చోట్ల దాడులు జరిగినా పోలింగ్‌పై కనిపించని చెడు ప్రభావం

    • 11 గంటలకే దాదాపు 25% పోలింగ్ నమోదైనట్లు అంచనా

    • ఓటింగ్ శాతం భారీగా పెరుగుతుండడంపై కూటమి శ్రేణుల్లో ఉత్సాహం

    • ఊహించిన దానికంటే ట్రెండ్స్ తమకు పాజిటివ్‌గా ఉన్నాయని కూటమి పెద్దల అభిప్రాయం

    1THREE-PARTIES-LOGO.jpg

  • 2024-05-13T11:50:16+05:30

    వైసీపీ నేతల అరాచకం

    • కృష్ణా జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఆగని వైసీపీ దౌర్జన్యాలు

    • పెనమలూరు నియోజకవర్గం వణుకురులో వైసీపీ నేతల అరాచకం

    • టీడీపీ, పోలీసులపై దాడికి పాల్పడిన వైసీపీ నేత అరేపల్లి శ్రీకాంత్

    • పోలింగ్ ఆపేందుకు యత్నిస్తున్న అధికార పార్టీ నాయకులు

    • వైసీపీ నేతల చర్యపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు

    TDP-vs-YSRCP.jpg

  • 2024-05-13T11:45:14+05:30

    రాప్తాడులో రచ్చ.. రచ్చే!

    • అనంతపురం రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్తతల మధ్య సాగుతున్న పోలింగ్

    • పోలింగ్ బూతుల వద్ద వైసీపీ నాయకుల హల్చల్

    • ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసీపీ నాయకులు

    • అత్యంత సమస్యాత్మక గ్రామంగా ఉన్న మద్దెలచెరువులో పోలీసుల వైఫల్యం

    • కేవలం ఒక్క హోంగార్డును మాత్రమే ఎన్నికల విధులకు కేటాయింపు

    • నమూనా ఈవీఎంతో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్న నాయకులు

    • బహిరంగంగా ప్రచారం చేస్తున్న పట్టించుకోని అధికారులు

    • నెమలివరం గ్రామంలో టిడిపి నాయకులతో పలుసార్లు గొడవలకు దిగిన వైసీపీ నాయకులు

    • ఇప్పటికే రెండు, మూడుసార్లు పోలింగ్ నిలిపివేత

    • మేడాపురం గ్రామంలో వైసీపీ నాయకుల దౌర్జన్యం

    • ఓటర్లను ప్రలోభపెడుతున్న క్రమంలో అడ్డుకున్న టీడీపీ నాయకులు

    • టీడీపీ నేతలపై దౌర్జన్యానికి దిగుతున్న వైసీపీ నాయకులు

    • నామాల గ్రామంలో కూడా వైసీపీ నాయకుల బరితెగింపు చర్యలు

    • బహిరంగంగా ప్రలోభాలకు గురి చేస్తున్న వైసీపీ నాయకులు

    Rapthadu.jpg

  • 2024-05-13T11:40:27+05:30

    ఎన్నికల సంఘానికి లేఖ!

    • ఎన్నికల సంఘానికి మాజీ మంత్రి దేవినేని ఉమా లేఖ

    • నరసరావుపేట అసెంబ్లీ వైసీపీ అభ్యర్ధి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై ఎన్నికల సంఘానికి దేవినేని ఉమా ఫిర్యాదు

    • ఎక్కువ సంఖ్యలో అనుచరులు, వాహనాలతో గొపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో తిరుగుతున్నారు

    • సెక్షన్ 144 అమలు చేయడంలో పోలీసులు వైఫల్యం చెందారు

    • చట్ట విరుద్ధ చర్యలకు పాల్పడినందుకు గాను గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి

    • నరసరావుపేటలో సెక్షన్ 144 సరిగ్గా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనాను కోరిన దేవినేని ఉమా

    devineni-uma-maheswara-rao.jpg

  • 2024-05-13T11:30:24+05:30

    ఎమ్మెల్యే అభ్యర్థికి చెంప దెబ్బ!

    • ఓటర్లపై వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడి

    • రివర్స్ అటాక్ చేసిన ఓటరు

    • గుంటూరు జిల్లా పోలింగ్ బూత్‌లో ఓటర్లపై

    • తెనాలి ఎమ్మెల్యే శివ కుమార్ దాడి

    • ఓటు వేసేందుకు క్యూ లైన్ కాకుండా నేరుగా వెళ్ళిన ఎమ్మెల్యే

    • ఎమ్మెల్యేను ప్రశ్నించిన క్యూ లైన్‌లోని ఓటర్లు

    • క్యూలైన్‌లోని ఓటర్లపై దాడి చేసిన ఎమ్మెల్యే.. అతని అనుచరులు

    • ఎమ్మెల్యే శివ కుమార్‌పై తిరగబడి దాడి చేసిన ఓటర్లు

    chmepa-chellu.jpg

  • 2024-05-13T11:15:58+05:30

    రిగ్గింగ్‌‌కు యత్నం.. అడ్డుకొని నెట్టేశారు!

    • రిగ్గింగ్‌కు యత్నించిన వైసీపీ అభ్యర్థి మేనల్లుడు

    • బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం మిన్నేకళ్ళు గ్రామంలో అద్దంకి వైసీపీ అభ్యర్థి హనిమిరెడ్డి మేనల్లుడు కైపు మహేష్ రెడ్డి పోలింగ్ కేంద్రంలో‌కి ప్రవేశించి ఓటర్ స్లిప్పులు లాక్కొని రిగ్గింగ్‌కు ప్రయత్నం

    • అడ్డుకుని మహేష్ రెడ్డిని బయటకు నెట్టేసిన ఓటర్లు

  • 2024-05-13T11:10:21+05:30

    ఓటు వేయడం బాధ్యత!

    • కడప జిల్లాలో ఓడేసిన కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల దంపతులు

    • వేంపల్లె మండలం, ఇడుపులపాయ పోలింగ్ బూత్- 261లో ఓటేసిన వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్

    • ఓటేసిన తర్వాత షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

    • భారత రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు

    • పాలకులను ఎంచుకొనే హక్కు రాజ్యాంగం మనకు ఇచ్చింది

    • ఓటు ముందు ధనవంతుడు అయినా ఒక్కటే..పేదవాడైనా ఒక్కటే

    • ఓటు సమానమైన హక్కు

    • ఓటు వేయడం ఒక భాధ్యత

    • కడప జిల్లా అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి

    • జరుగుతున్న దాడులపై ఈసీ తక్షణం చర్యలు తీసుకోవాలి

    • ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి

    • పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు ధ్వంసం చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాలి.. అభ్యర్థిని బహిష్కరించాలని షర్మిల డిమాండ్

    YS-Sharmila.jpg

  • 2024-05-13T11:05:05+05:30

    ఓపీఓ.. మీకిది తగునా!

    • సత్యసాయి జిల్లా కదిరి తనకల్లు మండలం దేవలంతాండాలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిన ఓపీఓ

    • ఫ్యాన్‌కు ఓటు వేయాలని సూచించిన ఓపీఓ

    • ఓపీఓతో వాగ్వాదానికి దిగిన టీడీపీ నాయకులు

    • టీడీపీ నాయకులపై చేయి చేసుకున్న పోలీసులు

    • ఓపీఓను పోలింగ్ బూత్ నుంచి పంపించేసిన అధికారులు

  • 2024-05-13T11:00:51+05:30

    ఆగని వైసీపీ అరాచకాలు!

    • ఏపీలో పలుచోట్ల వైసీపీ దౌర్జన్యాలు

    • పోలీసుల సమక్షంలో గొడవలు

    • చిత్తూరు పూతలపట్టు నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ అరాచకాలు దౌర్జన్యాలు

    • యాదమరి మండలం కసిరాళ్ల , కోడిగుట్ట పోలింగ్ కేంద్రాల బయట వైసీపీ నేతలు ఓటర్లను మభ్యపెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్న వైనం

    • పూతలపట్టు మండలం సంజీవరాయనిపల్లి పోలింగ్ కేంద్రంలోనూ ఇదే పరిస్థితి

    • ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఒకే ఒక్క పోలీసు విధుల నిర్వహణ దీంతో మరింతగా రెచ్చిపోతున్న వైసీపీ శ్రేణులు

    • ఎదిరిస్తున్న టీడీపీ శ్రేణులపై వైసీపీ బెదిరింపు కవింపు చర్యలు

  • 2024-05-13T10:58:01+05:30

    • 150 మంది చొరబడ్డారు!

    • ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఉద్రిక్తత

    • మైలవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి దౌర్జన్యం!

    • 150 మంది గుంపుగా మైలవరం వేములూరి వెంకటరత్నం

    • కళాశాల పోలింగ్ బూత్‌లో జొరబడిన అల్లరి మూక!

    • చూస్తూ మిన్నకుండిపోయిన ఎమ్మార్వో..!

    • అధికారులపై మండిపడిన ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని

  • 2024-05-13T10:52:57+05:30

    వైసీపీ నేతలకు ఖాకీల వకల్తా!

    • వైసీపీ నాయకులు చెప్పు చేతల్లో బెజవాడ పోలీసులు!

    • దేవినేని అవినాష్ అనుచరులు చెప్పిందే వేదంగా పాటిస్తున్న పోలీసులు

    • విజయవాడ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరులను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళుతున్న పోలీసులు

    • కొమ్మా పూర్ణ అనే వ్యక్తిని బలవంతంగా ఇంట్లో నుంచి పటమట పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లిన పోలీసులు

    • వైసీపీ నేతలు పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చి బలవంతంగా టీడీపీ కార్యకర్తలను పీఎస్‌కు తరలిస్తున్న పోలీసులు

    tdp-ycp.jpg

  • 2024-05-13T10:50:52+05:30

    టీడీపీ ఏజెంట్‌పై దాడి.. కన్ను కోల్పోయిన వైనం!

    • అన్నమయ్య జిల్లాలో గొడవలే.. గొడవలు!

    • పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ రచ్చలే!

    • జిల్లా పుల్లంపేట మండలం పాపక్కగారిపల్లెలో టీడీపీ ఏజెంట్‌పై దాడి

    • దాడికి తెగబడిన ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి అనుచరులు

    • దాడిలో కన్ను కోల్పోయిన ఏజెంట్ సుభాష్

  • 2024-05-13T10:45:48+05:30

    జమ్మలమడుగులో అనకాపల్లి అభ్యర్థి ఓటు!

    • కడప జిల్లాలో ఓటేసిన అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్

    • జమ్మలమడుగులోని పొట్లదుర్తి స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న రమేష్

    • ప్రజలందరూ ఓటేయాలని పిలుపు

    CM-RAMESH-(BJP).jpg

  • 2024-05-13T10:40:18+05:30

    ఓటేసిన న్యాయమూర్తి!

    • కృష్ణా జిల్లా గుడివాడలో ఓటు హక్కు వినియోగించుకున్న మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్

    • జస్టిస్‌తో పాటు ఓటేసిన ఆయన సతీమణి, కుమార్తె

    Judge.jpg

  • 2024-05-13T10:35:24+05:30

    ఓటేసిన అయ్యన్న!

    • అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఓటేసిన అయ్యన్న పాత్రుడు

    • నర్సీపట్నం మున్సిపాలిటీ గచపు వీధిలోని గర్ల్స్ హైస్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న అయ్యన్న

    • నర్సీపట్నం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా చింతకాయల అయ్యన్నపాత్రుడు

  • 2024-05-13T10:32:39+05:30

    రాళ్లతో దాడి..

    • పల్నాడు జిల్లాలో ఉదయం నుంచీ గొడవలే!

    • జిల్లాలోని అచ్చంపేట మండలం కొత్తపల్లిలో ఘర్షణ

    • రాళ్లు రువ్వుకున్న వైసీపీ- టీడీపీ వర్గాలు

    • దాడిలో పలువురికి గాయాలు

    • ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు

    ysrcp.jpg

  • 2024-05-13T10:28:11+05:30

    కుప్పంలో దొంగ ఓట్లు!

    • చిత్తూరు జిల్లా కుప్పంలో దొంగ ఓట్ల కలకలం

    • ఓటు వేసేందుకు తమిళనాడు నుంచి మనుషులు వచ్చారనే సమాచారంతో డీఎస్పీకి ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ ఫిర్యాదు

    • ఎవరిదైనా ఓటు వేయకుండా వేసినట్టు తెలిస్తే ఛాలెంజింగ్ ఓట్లు వెయ్యండని పిలుపు

    • మధ్యాహ్నం పైన వైసీపీ అల్లర్లు సృష్టించే అవకాశం ఉందనే సమాచారంతో అప్రమతమైన టీడీపీ శ్రేణులు

  • 2024-05-13T10:25:07+05:30

    • రెడ్ హ్యాండెడ్‌గా పట్టేశారు!

    • కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం గొల్లలమామిడాడలో వైసీపీ అరాచకం

    • పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటర్లను బెదిరిస్తున్న వైసీపీ నేతలు

    • పంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్ బీఎల్వో ముసుగులో వైసీపీ కోసం ప్రచారం

    • రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

    • పెదపూడి పోలీస్ స్టేషన్‌లో అప్పగించిన నేతలు

  • 2024-05-13T10:20:46+05:30

    ద్వారంపూడి అనుచర్ల గుండాయిజం!

    • కాకినాడ నగరంలో వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచర్ల గుండాయిజం

    • అన్నమ్మ ఘాటి సెంటర్ పోలింగ్ బూతుల్లోకి చొరబడి ఓటర్లకు బెదిరింపులు

    • వైసీపీకి ఓటు వేయాల్సిందే అంటూ హెచ్చరికలు

    • పోలింగ్ కోసం వచ్చిన వారికి డబ్బులు ఇచ్చి వేలిపై సిరా వేసి బలవంతంగా ఇంటికి పంపిస్తున్న వైనం

    • గొడవ దిగిన టీడీపీ శ్రేణులు

    dwarampudi.jpg

  • 2024-05-13T10:15:13+05:30

    అటు ప్రలోభాలు.. ఇటు ఫిర్యాదులు!

    • ఏలూరు జిల్లా ముసునూరు మండలం లోపూడి గ్రామ పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లను ప్రలోభ పెడుతున్న వైసీపీ నాయకులు, ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన బూత్ సిబ్బంది

    • నూజివీడు నియోజకవర్గంలోని బూత్ నెం-66 లో ఓటు వేసి పోలింగ్ బూత్ నుంచి బయటకు వెళ్లని వైసీపీ నాయకుడు

    • 61,62 బూత్‌ల వద్ద ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లకు పార్టీ పథకాలను చెబుతూ నిబంధనలను ఉల్లంఘిస్తున్న స్థానిక వైసీపీ నాయకులు

    • వైసీపీ నేతలపై తీరుపై పోలింగ్ అధికారులు సీరియస్

    • నూజివీడు నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌ల వద్ద సరిపడ పోలీసు సిబ్బంది అందుబాటులో లేరని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసిన పోలింగ్ సిబ్బంది

  • 2024-05-13T10:10:09+05:30

    బస్సులేవీ.. ఇంత దారుణమా?

    • తిరుపతి జిల్లాలో బస్సుల్లేక ఓటర్లు ఇబ్బందులు

    • సిద్ధం సభలకు బస్సు.. ఓటు వేయడానికి బస్సు లేదా అంటూ రైతులు, ఓటర్ల ఆగ్రహం

    • తిరుపతి నుంచి చుట్టుపక్కల పల్లెలకు బస్సులు లేక ఓటర్ల అవస్థలు

    • మామూలు రోజుల్లో ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు

    • పచ్చికాపులం, రామచంద్రాపురం ఏరియాలకు వెళ్లడానికి అన్నమయ్య సర్కిల్ వద్ద ఓటర్లు పడిగాపులు

    • మామూలుగా 50 రూపాయలు తీసుకుని ఆటో వాళ్ళు 200 డిమాండ్

    • బస్సులు లేక రూ. 200 ఇచ్చి ఓటు వేయడానికి పోతున్న ఓటర్లు

    • ఆర్టీసీ తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం

    • ఓటర్లు ఓటు వేయకుండా ఆర్టీసీని కూడా కుట్రలో వైసీపీ భాగం చేసిందని ఆరోపణలు

  • 2024-05-13T10:05:41+05:30

    కొట్టుకున్నారు!

    • పల్నాడు జిల్లా ఉదయం నుంచి రచ్చరచ్చగానే పరిస్థితులు

    • సత్తెనపల్లి మండలం ఫణిదంలో టీడీపీ వర్గీయులపై వైసీపీ మూకల దాడి

    • టీడీపీకి ఓట్లు వేస్తున్నారని అక్కసుతో మహిళలపై దాడి

    • ముగ్గురికి స్పల్ప గాయాలు

  • 2024-05-13T10:00:17+05:30

    జిల్లాల వారీగా పోలింగ్ పర్సంటేజ్ ఇలా!

    • ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్

    • అల్లూరిలో 6.77 శాతం

    • అనకాపల్లిలో 8.37 శాతం

    • అనంతపురంలో 9.18 శాతం

    • అన్నమయ్యలో 9.89 శాతం

    • బాపట్లలో 11.36 శాతం

    • చిత్తూరులో 11.84శాతం

    • కోనసీమలో 10.42 శాతం

    • తూర్పు గోదావరి జిల్లాలో 8.68 శాతం

    • ఏలూరులో 9.9 శాతం

    • గుంటూరులో 6.17 శాతం

    • కాకినాడలో 7.95 శాతం

    • కృష్ణాలో 10.80 శాతం

    • కర్నూలులో 9.34 శాతం

    • నంద్యాలలో 10.32 శాతం

    • ఎన్టీఆర్‌ జిల్లాలో 8.95 శాతం

    • పల్నాడులో 8.53 శాతం

    • మన్యం జిల్లాలో 6.30 శాతం

    • ప్రకాశం జిల్లాలో 9.14 శాతం

    • నెల్లూరులో 9.51 శాతం

    • సత్యసాయి జిల్లాలో 6.92 శాతం

    • శ్రీకాకుళంలో 8.30 శాతం

    • తిరుపతిలో 8.11 శాతం

    • విశాఖలో 10.24 శాతం

    • విజయనగరంలో 8.77 శాతం

    • పశ్చిమ గోదావరి జిల్లాలో 9.57 శాతం

    • కడపలో 12.09 శాతం

    • సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉదయం 9 గంటలకు సగటున పోలైన ఓటింగ్ శాతం 9.05 %

    polling.jpg

  • 2024-05-13T09:50:38+05:30

    ఎవరికి చెప్పుకుంటారో.. చెప్పుకో..!

    • అనంతపురం నగరంలోని 124 పోలింగ్ బూత్‌లో వైసీపీ మహిళ కార్పొరేటర్ నాగ వినీత

    • పోలింగ్ బూత్‌లో కూర్చొని ఓటర్లను ప్రలోభ పెడుతున్న పరిస్థితి

    • బయటకు వెళ్లాలని చెప్పిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

    • మళ్ళీ దౌర్జన్యంగా పోలింగ్ బూత్‌లోకి వచ్చిన వినీత

    • దగ్గుపాటి ప్రసాద్‌తో వైసీపీ నేతల వాగ్వాదం

    • పోలింగ్ బూత్‌లో తమ కౌన్సిలర్ ఉంటుందని వాగ్వాదానికి దిగిన వైసీపీ నాయకులు

    • పోలింగ్ బూత్‌లోనే కూర్చుంటాం.. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోండని బెదిరింపులకు దిగిన వైసీపీ నేతలు

    TDP-vs-YSRCP.jpg

  • 2024-05-13T09:48:49+05:30

    • చంద్రబాబు ఆన్ డ్యూటీ!

    • ఓటేసి వచ్చాక డ్యూటీలోకి దిగిన టీడీపీ అధినేత చంద్రబాబు

    • టీడీపీ కేంద్ర కార్యాలయంలో వార్ రూం నుంచి ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తున్న బాబు

    • రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉదయాన్నే ఓటర్లు తరలివస్తున్నారని తెలిపిన నాయకులు

    • పలు చోట్ల వైసీపీ రెచ్చగొట్టే చర్యలు, దాడులపై చంద్రబాబు దృష్టికి తెచ్చిన నేతలు

    • మాచర్ల, పుంగనూరు నియోజకవర్గాల్లో వైసీపీ హింసపై అధినేత ఆందోళన

    • పోలింగ్ ప్రారంభంలోనే దాడులతో కొన్ని చోట్ల ఓటర్లను భయపెట్టేలా వైసీపీ ప్రణాళిక ప్రకారం దాడులు చేసిందన్న చంద్రబాబు

    • పల్నాడు ఎస్పీతో మాట్లాడిన చంద్రబాబు

    • పలుచోట్ల ఏజెంట్లపై దాడులు, కిడ్నాప్‌నకు పాల్పడడంపై ఈసీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు

    • ప్రజలు ఉత్సాహంగా ఓటు వేసేందుకు బయటకు వస్తున్నారని.. దీన్ని చెడగొట్టేలా వైసీపీ కుట్రలు చేస్తోందని అధికారులకు ఫిర్యాదు చేసిన చంద్రబాబు

    chandrababu-bc.jpg

  • 2024-05-13T09:45:19+05:30

    మైలవరంలో ఉద్రిక్తత..

    • ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఉద్రిక్తత

    • మైలవరం దేవుని చెరువులో బాహాబాహీకి దిగిన వైసీపీ, టీడీపీ శ్రేణులు

    • వలంటీర్లు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని ప్రశ్నించిన టీడీపీ నాయకులు

    • టీడీపీ నాయకులతో గొడవకు దిగిన వైసీపీ నాయకుల.. తోపులాట

    • రంగంలోకి దిగి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు

    • దేవుని చెరువు పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావు, కుటుంబ సభ్యులు

    • ఓటర్ల క్యూ లైన్‌లో ఉన్నా వార్డు మెంబర్‌ను పోలీసులతో బయటకు పంపిన తిరుపతిరావు

    • తిరుపతిరావు కుటుంబ సభ్యులు క్యూ లైన్లలో ఉన్న ఓటర్లను ఓట్లు అడుగుతున్నారని, వారిని పంపించివేయాలని పోలీసులను డిమాండ్ చేసిన వార్డు సభ్యురాలు, కుటుంబ సభ్యులు

    • వైసీపీ అభ్యర్థి తిరుపతిరావును అక్కడి నుంచి పంపించేసిన ఎస్పి మురళి మోహన్

    ap news.jpg

  • 2024-05-13T09:42:12+05:30

    ఓటేసిన సేనాని!

    • ఏపీ ఎన్నికల్లో ఓటేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్

    • మంగళగిరిలోని పోలింగ్ బూత్‌‌లో భార్యతో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్

    Pawan.jpeg

  • 2024-05-13T09:40:58+05:30

    ఓటేసిన సీఈవో

    • విజయవాడ రైల్వే క్లబ్ పోలింగ్ బూత్‌లో ఓటేసిన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ముఖేష్ కుమార్ మీనా

    • ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కు వినియోగించు కోవాలని పిలుపు

  • 2024-05-13T09:35:45+05:30

    • లంచం తీసుకోని..!

    • లంచం తీసుకొని వైసీపీకి వత్తాసు!

    • తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం సొరకాయాలపాలెంలో వైసీపీకి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పీఓ

    • పీఓతో టీడీపీ ఏజెంట్లు వాగ్వివాదం

    • రెండు లక్షల లంచం తీసుకుని వైసీపీకి అనుకూలంగా పీఓ వ్యవహరిస్తున్నారని ఆరోపణ

    • ఇంత జరుగుతున్నా పట్టించుకోని అధికారులు, పోలీసులు

  • 2024-05-13T09:30:49+05:30

    ఈవీఎంలు ధ్వంసం!

    • అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం, దలవాయిపల్లిలో ఉద్రిక్తత

    • ఈవీఎంలు పగలకొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

    • రంగంలోకి దిగిన పోలీసులు.. ఉన్నతాధికారులతో చర్చలు

    • ఈ ఘటనతో నిలిచిన పోలింగ్

    • పోలింగ్ ఏజెంట్‌ను కిడ్నాప్ చేశారని జనసేన ఆందోళన

    • వైసీపీ కార్యకర్తలు బలవంతంగా లాక్కెళ్లారని ఆరోపణ

  • 2024-05-13T09:25:56+05:30

    ఓటేసిన పురంధేశ్వరి

    • ఓటు హక్కు వినియోగించుకున్న దగ్గుబాటి పురంధేశ్వరి

    • రాజమండ్రి సిటీ నియోజకవర్గంలోని వీఎల్ పురం పోలింగ్ బూత్- 166లో ఓటేసిన దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు

    • రాజమండ్రి ఎంపీగా కూటమి తరపున పోటీచేస్తున్న పురంధేశ్వరి

    Purandeswari.jpg

  • 2024-05-13T09:22:46+05:30

    • చీకట్లో ఈవీఎంలు!

    • పిఠాపురంలో చీకట్లోనే ఈవీఏంలు

    • చీకట్లో ఏమీ కనిపించ లేదంటూ ఓటర్లు ఆగ్రహం

    • రోడ్డెక్కి ప్లకా ర్డులతో ఆందోళన

    • అడిగితే అధికారులు తిడుతున్నారని ఆగ్రహం

    • పిఠాపురం పోటీచేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్

    • వైసీపీ తరఫున బరిలోకి దిగిన వంగా గీత

  • 2024-05-13T09:20:52+05:30

    లోకేష్ పిలుపు.. రండి.. రారండి!

    • మంగళగిరిలో ఓటేసిన టీడీపీ యువనేత నారా లోకేష్ దంపతులు

    • ఓటేశాక ట్విట్టర్‌లో ఇంట్రెస్టింగ్ ట్వీట్

    • ప్రజలే ప్రజాస్వామ్య బలం, బలగం మార్పు రావాలని కోరుకోవడం కాదు..

    • మార్పు మనతో మొదలుకావాలి

    • మీ ఓటుతోనే భవిష్యత్తు ముడిపడి ఉంది

    • అందరూ ఓటు హక్కు వినియోగించుకోండి : నారా లోకేష్

    Nara-Lokesh.jpg

  • 2024-05-13T09:12:03+05:30

    పోలింగ్ బూత్‌లో వైసీపీ నేతలు

    • అనంతపురం నగరంలోని పాతూరులోని పోలింగ్ బూత్ వద్ద వైసీపీ నేతల మకాం

    • పాతూరులోని నంబర్-02 స్కూల్‌లోని పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటర్లను ప్రలోభ పెట్టిన వైసీపీ నాయకులు

    • ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్

    • పోలింగ్ బూత్‌లో ఉన్న వైసీపీ నాయకుడిని బయటికి పంపించిన పోలీసులు

    • కొందరు పోలీసులు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన దగ్గుపాటి

  • 2024-05-13T09:02:03+05:30

    ఆలస్యంగా ప్రారంభం

    • అల్లూరి జిల్లా రాజవొమ్మంగి 74,75 పోలింగ్ బూత్‌లలో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం

    • గంటన్నరపాటు ఇబ్బందులు పడిన ఓటర్లు

    • మోతుగూడెంలోని 350, 360 బూత్‌లలోఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్

  • 2024-05-13T09:00:29+05:30

    కరెంట్ తీసేశారు!

    • పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి పల్నాడు జిల్లాలో రచ్చే !

    • వెల్దుర్తి మండలం కల్లకుంటలో వైసీపీ దాష్టీకం

    • గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత

    • పోలింగ్ కేంద్రాల్లో పని చేయని సీసీ కెమెరాలు

    • అధికారులకు ఫిర్యాదు చేసిన టీడీపీ

    • సాకులు చెబుతున్న అధికారులు.. ఓటర్లు తీవ్ర ఆగ్రహం

  • 2024-05-13T08:58:13+05:30

    లాగేశారు!

    • ఆగని వైసీపీ నేతల ఆగడాలు

    • పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో రచ్చ రచ్చ

    • రాయవరం పోలింగ్ బూత్‌లో టీడీపీ ఏజెంట్లను లాగేసిన వైసీపీ కార్యకర్తలు

    • రచ్చ రచ్చగా మారిన పరిస్థితి.. రంగంలోకి దిగిన పోలీసులు

  • 2024-05-13T08:55:09+05:30

    వైసీపీ బరితెగింపు..

    • పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాచవరం మండలం వేమన గ్రామంలో బరితెగించిన వైసీపీ నాయకులు

    • బూత్‌లోకి చొరబడేందుకు యత్నం

    • అడ్డుకున్న టీడీపీ నాయకులు

    • టీడీపీ నేతలపై దాడి చేసిన వైసీపీ నాయకులు

  • 2024-05-13T08:52:38+05:30

    వైసీపీ నేతల కుయుక్తులు

    • అనంతపురం అర్బన్‌లో వైసీపీ నేతల కుయుక్తులు

    • నగరంలోని 225, 234 పోలింగ్ స్టేషన్ల వద్ద ఓట్లర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న వలంటీర్లు

    • పోలీసులు, పోలింగ్ అధికారులు ఉన్నా చర్యలు శూన్యం

    • పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్

    • పోలింగ్ బూత్‌ల వద్ద వలంటీర్లకు ఏం పని.. ఎందుకున్నారని ప్రశ్నించిన దగ్గుపాటి

  • 2024-05-13T08:50:15+05:30

    క్యూలో ఓటర్లు.. మొరాయించిన ఈవీఎంలు

    • అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం 78 బూత్‌‌‌లో ఇంకా మొదలవ్వని పోలింగ్

    • పార్లమెంట్‌కు సంబంధించిన ఈవీఎం మొరాయించడంతో

    • లైన్‌లోనే నిలిచిపోయిన ఓటర్లు

  • 2024-05-13T08:47:35+05:30

    • పోలింగ్ నిలిచిపోయింది!

    • నెల్లూరు జిల్లా మర్రిపాడు జడ్పీ హైస్కూల్లోని పోలింగ్ కేంద్రం 24లో ఈవీఎంల మొరాయింపు

    • ఇంకా ప్రారంభం కానీ ఓటింగ్ ప్రక్రియ

    • పోలింగ్ నెంబర్-03 వద్ద పోలీసులు భద్రత లేక ఓటర్ల తోపులాట

    • నిలిచిపోయిన పోలింగ్ ప్రక్రియ

    evms.jpg

  • 2024-05-13T08:45:15+05:30

    బారులు తీరారు.. మేడమ్ వచ్చారు!

    • అల్లూరి జిల్లా పాడేరులో మొదలైన పోలింగ్

    • పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు

    • పెదబయలు మండలం గుల్లేలు పోలింగ్ బూత్‌లో మోరాయించిన ఈవీఎం మిషన్లు

    • గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం

    • పాడేరులో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ సునీత

  • 2024-05-13T08:40:08+05:30

    • ప్రత్యేక ఏర్పాట్లు!

    • నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్

    • ఓటుహక్కు వినియోగించుకొనుటకు క్యూలలో నిలబడిన ఓటర్లు

    • వరికుంటపాడు 88, 89 పోలింగ్ కేంద్రంలో ప్రారంభం కానీ పోలింగ్.

    • వృద్ధులకు, వికలాంగులకు లేని ప్రత్యేక ఏర్పాట్లు

  • 2024-05-13T08:35:28+05:30

    ప్రశాంతం.. అంతా ప్రశాంతమే!

    • పోలింగ్ సరళిపై సీఈవో ముఖేష్ కుమార్ మీనా ప్రకటన

    • రాష్ట్రంలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది

    • మాక్ పోల్ అనంతరం రాష్ట్రంలో ఉదయం 7.00 గంటల నుంచి ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది

    • రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుచేసిన మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలలో పట్టిష్టమైన పోలీసు భద్రత మధ్య పోలింగ్ కొనసాగుతోంది

    • అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినప్పటికీ, నైపుణ్యం గల బీఈఎల్ ఇంజనీర్ల సహకారంతో సెక్టర్ అధికారులు రిజర్వులో ఉన్న ఈవీఎంలను ఏర్పాటు చేశారు

    • ఆ పోలింగ్ స్టేషన్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ సాగుతోంది : సీఈవో ముఖేష్ కుమార్ మీనా

  • 2024-05-13T08:33:09+05:30

    కన్నా కన్నెర్ర!

    • సత్తెనపల్లిలోని హోలీ ప్యామిలి స్కూల్‌లోని 40వ పోలింగ్ బూత్ పీవో రమా నాయక్‌పై టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం

    • వైసీపీకి ఓటు వేయాలని ఓటర్లకు చెప్పిన రమా నాయక్

    • దీంతో ఆమెపై కన్నెర్రజేసిన కన్నా

    • పీవో వ్యవహారశైలిపై ఎన్నికల అధికారి కి ఫిర్యాదు

  • 2024-05-13T08:30:21+05:30

    ఓటు.. ప్రగతికి బాట!

    • గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము కామెంట్స్

    • ఈరోజు ప్రజలు వేసే ఓటు గుడివాడ ప్రగతికి బాటగా నిలుస్తుంది

    • రాజేంద్రనగర్ టౌన్ హైస్కూల్లోని 63వ నంబర్ పోలింగ్ బూత్‌లో మాతృమూర్తి శాంత కుమారితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న రాము

    • ఓటేశాక గుడివాడ ప్రజలకు వెనిగండ్ల విన్నపం

    • ప్రజలందరూ మీ మనసు చెప్పే నిజాన్ని నమ్మండి.. బయట మాటలు దయచేసి వినవద్దు

    • అభివృద్ధి ఎవరు చేస్తారో.. ప్రజలకు మంచి చేసే వ్యక్తి ఎవరు అని ఆలోచించుకొని ఓటు వేయండి

    • గుడివాడను బాగు చేసుకోవడానికి నేను ముందుకు వచ్చాను

    • ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి : వెనిగండ్ల రాము

    Venigandla-ramu-nomination.jpg

  • 2024-05-13T08:27:30+05:30

    మొరాయింపు..!

    • కృష్ణా బాపులపాడు మండలం రంగన్న గూడెం 182వ నంబర్ పోలింగ్ బూత్‌లో ఈవీఎం మొరాయింపు

    • గన్నవరం స్ట్రాంగ్ రూమ్ నుంచి వచ్చే ఈవీఎం కోసం రంగన్నగూడెం గ్రామ ఓటర్లు ఎదురుచూపులు

  • 2024-05-13T08:25:08+05:30

    పోలింగ్ కేంద్రంలోనే కేశినేని చిన్నీ!

    • ఉదయం 7 గంటలకు లయోలా కాలీజీలో ఓటేయడానికి వచ్చిన కేశినేని చిన్ని

    • కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి చిన్ని

    • పోలింగ్ బూత్ నంబర్- 56లో ఈవీఎం మిషన్ పనిచేయని పరిస్థితి

    • ఇంతవరకూ ప్రారంభం కాని పోలింగ్

    • దీంతో పోలింగ్ బూత్‌లోనే ఉండిపోయిన కేశినేని చిన్ని

    • మరోవైపు.. ఇదే పోలింగ్ బూత్‌లో ఓటేయడానికి వేచిచూస్తున్న టీడీపీ నేత పట్టాభి కుటుంబ సభ్యులు

    • క్యూలో ఉన్న ఓటర్లు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి

  • 2024-05-13T08:15:57+05:30

    ఓటేసిన చంద్రబాబు

    • ఓటు హక్కు వినియోగించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

    • సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ఓటేసిన సీబీఎన్

    • ఉండవల్లిలోని పోలింగ్ కేంద్రంలో ఓటేసిన దంపతులు

    • ప్రజలకు నమస్కరిస్తూ పోలింగ్‌ బూత్‌లోకి చంద్రబాబు

    • ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపు

    Chandrabbu.jpg

  • 2024-05-13T07:55:24+05:30

    ఓటేసిన వెంకయ్య!

    ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి

    సతీమణి ఉష నాయుడుతో కలిసి జూబ్లిహిల్స్‌లో ఓటేసిన వెంకయ్య నాయుడు

    Venkaiah.jpg

  • 2024-05-13T07:53:57+05:30

    ఫ్రెండ్ కోసమంతే.. మరేమీ లేదు!

    • ఓటు హక్కు వినియోగించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

    • హైదరాబాద్ జూబ్లీహిల్స్ బీఎస్‌ఎన్‌ సెంటర్‌లో ఓటు వేసిన అల్లు వారబ్బాయి

    • నంద్యాల వెళ్లింది నా ఫ్రెండు అని మాత్రమే

    • ఓటు గురించి నేను ఎక్కడా మాట్లాడలేదు : అల్లు అర్జున్

    Allu-Arjun.jpg

  • 2024-05-13T07:45:06+05:30

    ఓటేసిన వైఎస్ జగన్!

    • పులివెందులలో ఓటేసిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్

    • కుటుంబ సభ్యులతో కలిసి పులివెందులలోని బాకరాపురంలో

    • ఓటేసిన జగన్ రెడ్డి

    • 138వ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం దంపతులు

    YS-Jagan.jpg

  • 2024-05-13T07:35:58+05:30

    పల్నాడు ఘటనపై ఎన్నికల కమిషన్ కన్నెర్ర!

    • పల్నాడు ఘటనలపై ఎన్నికల కమిషన్ సీరియస్

    • పోలింగ్ ప్రారంభానికి ముందే పల్నాడులో గొడవలు జరగడంపై ఈసీ ఆగ్రహం

    • పల్నాడు గొడవపై ఈసీ ఆరా

    • వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశం

    • అవసరమైతే మరిన్ని అదనపు బలగాలను తరలించేలా చూడాలని ఆదేశం

    • పీలేరులో ముగ్గురు ఏజెంట్లను కిడ్నాప్ చేసి పోలింగ్ స్టేషన్లకు..

    • చేరుకోలేని ప్రాంతంలో వదిలారని ఈసీకి టీడీపీ ఫిర్యాదు

    • పల్నాడు ప్రాంతానికి బయల్దేరిన ఎన్నికల ప్రత్యేక అబ్జర్వ్‌ర్ రామ్మోహన్ మిశ్రా

  • 2024-05-13T07:35:42+05:30

    పెద్దిరెడ్డి ఇలాకాలో రచ్చ రచ్చ!

    • మంత్రి పెద్దిరెడ్డి సొంత మండలంలో టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ చేసిన వైసీపీ

    • ఆలస్యంగా వెలుగులోకి ఘటన

    • పెద్దిరెడ్డి సొంతూరు సమీపంలోని బూరగమాంద పోలింగ్ కేంద్రానికి వెళుతున్న..

    • 5 మంది ఏజెంట్లను మరో 10 మంది టీడీపీ నేతలను కిడ్నాప్ చేసిన వైసీపీ

    • పీలేరు శివారులలో వదిలిపెట్టిన పరిస్థితి

    • కిడ్నాపర్లు మధ్యాహ్నం ఒంటిగంట వరకు మీరు పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్‌లుగా..

    • కూర్చోవడానికి వీల్లేదు అంటూ బెదిరింపులు

    • ఏదైనా తోకాడిస్తే మీ అంతు చూస్తామంటూ బెదిరింపులు

    • గతంలో సదుం మండలానికి చెందిన టీడీపీ ఆక్టివ్ నాయకుడు రాజారెడ్డిని..

    • వైసీపీ శ్రేణులు కాళ్లు విరిచి ఆస్పత్రిపాలు చేసిన పరిస్థితి

    • ఆ వ్యక్తిని కూడా ఇవాళ కిడ్నాప్ చేసిన ముఖ్యుల్లో ఉన్న వైనం

    • కిడ్నాప్ విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు

    • వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు

    • ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసే పనిలో టీడీపీ

    peddireddy.jpg

  • 2024-05-13T07:30:54+05:30

    ఎంపీ ముఖమేదీ.. టీడీపీ ఆందోళన!

    • కాకినాడ నాడు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో టీడీపీ ఆందోళన

    • బ్యాలెట్ పేపర్‌లో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ముఖం కనిపించకుండా కలెక్టర్ సీల్ ముద్ర

    • ఓటర్లకు ఎంపీ అభ్యర్థి ముఖం కనిపించని పరిస్థితి

    • అభ్యంతరం వ్యక్తం చేసిన టీడీపీ

    • 14గ్రామాల్లో ఇలా రావడంపై ఆర్వోకు ఫిర్యాదు

  • 2024-05-13T07:22:59+05:30

    టెంట్లు ఏర్పాట్లతో వైసీపీ హడావుడి!

    • తిరుపతిలో పోలింగ్ కేంద్రాల వద్ద అనుమతి లేకుండా టెంట్లు ఏర్పాటు చేసిన వైసీపీ

    • రంగంలోకి దిగిన పోలీసులు.. తొలగిస్తున్న ఖాకీలు

    • 42,43 డివిజన్ల వద్ద టెంట్‌లను తొలగించేస్తున్న పోలీసులు

  • 2024-05-13T07:20:51+05:30

    చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టర్లు!

    • కడప జిల్లాలో అధికార వైసీపీ హడావుడి

    • బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్లలో పోలింగ్ బూత్‌ల వద్ద..

    • చంద్రబాబుకు వ్యతిరేకంగా వెలసిన పోస్టర్లు

    • చంద్రబాబు అధికారంలోకి వస్తే పథకాలు

    • , ఫించన్లు రద్దు చేస్తారని పోస్టర్లు

    • వైసీపీ నేతలు ప్రింట్ చేయించి.. కార్యకర్తలతో హడావుడి చేయిస్తున్న పరిస్థితి

    • పోలింగ్ బూతుల వద్ద అంటించి వైసీపీ శ్రేణులు

  • 2024-05-13T07:10:57+05:30

    ఓ వైపు వర్షం.. గొడుగులతో క్యూ!

    • కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్

    • జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం

    • గొడుగులు పట్టుకొని, జర్కిన్లు వేసుకుని, వాహనాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు

    • పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

  • 2024-05-13T07:08:34+05:30

    అప్పుడే సాంకేతిక లోపం.. పరిష్కారం!

    • మచిలీపట్నం 39వ డివిజన్ పరిధిలోని 144 వ నెంబర్ పోలింగ్ బూత్‌లో..

    • పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలో సాంకేతిక లోపం

    • మాక్ పోల్‌లో ఈవీఎం స్ట్రక్ కావడంతో తలెత్తిన సమస్య

    • అధికారులు అప్పటికప్పుడు సాంకేతిక లోపాన్ని పరిష్కరించడంతో ప్రశాంతం

  • 2024-05-13T07:05:39+05:30

    ఇక్కడ ముందే ముగింపు!

    • అల్లూరి జిల్లా అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని..

    • అరకు, రంపచోడవరం పాడేరు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్

    • పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్

    • ఓటర్లు స్వేచ్ఛగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్న అధికారులు

    voting.jpg

  • 2024-05-13T07:00:20+05:30

    ఇక మొదలెడదామా..?

    • ఏపీ వ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్

    • ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్

    • ఆరు గంటల నుంచే పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టిన జనం

    • సాయంత్రం ఆరు గంటల వరకు జరగనున్న పోలింగ్

    • క్యూ లైన్లలో ఉంటే ఆ తర్వాత కూడా ఓటేసే ఛాన్స్

    • దేశ, విదేశాల నుంచి ఏపీకి భారీగా తరలివచ్చిన ప్రజలు

    • గత ఎన్నికల కంటే ఈసారి మరింత ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్

    Vote-Casting.jpg

  • 2024-05-13T06:40:53+05:30

    కాసేపట్లో ఓటేయనున్న చంద్రబాబు

    • ఉదయం 7 గంటలకే ఓటు వేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబు

    • కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు ఓటు

    • ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల..

    • పోలింగ్ కేంద్రంలో ఓటేయనున్న చంద్రబాబు ఫ్యామిలీ

    • ఓటు వేశాక ఎక్కడేం జరుగుతోందో మానిటరింగ్ చేయనున్న చంద్రబాబు

    • కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న చంద్రబాబు

    Chandrababu-Vote.jpg

  • 2024-05-13T06:30:26+05:30

    హాట్ సీట్.. షర్మిల, అవినాష్ ఓటు ఇక్కడే!

    • ఏపీలో హాట్ సీటుగా కడప పార్లమెంట్ స్థానం

    • ఒకే ఇంటి నుంచి పోటీచేస్తున్న అన్న, చెల్లి!

    • రసవత్తరంగా పోటీ.. గెలుపుపై ఎవరి ధీమా వారిదే

    • కడప పార్లమెంట్ పరిధిలో ఓటేయనున్న ఎంపీ అభ్యర్థులు

    • కడప నియోజకవర్గంలోని జయమహాల్ అంగన్వాడీ పోలింగ్ బూత్-138లో ..

    • ఓటు హక్కు వినియోగించుకోనున్న వైఎస్ షర్మిల, వైఎస్ అవినాశ్ రెడ్డి, చదిపిరాళ్ల భూపేశ్‌రెడ్డి

    • కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీచేస్తున్న వైఎస్ షర్మిలా రెడ్డి

    • వైసీపీ నుంచి పోటీకి దిగిన వైఎస్ అవినాశ్ రెడ్డి

    • కూటమి నుంచి బరిలోకి దిగిన చదిపిరాళ్ల భూపేశ్ రెడ్డి

    • సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైఎస్ అవినాశ్ రెడ్డి

    • తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న వైఎస్ షర్మిల

    Avinash-and-Sharmila.jpg

  • 2024-05-13T06:00:51+05:30

    మాక్ పోలింగ్ ప్రారంభం

    • ఏపీ వ్యాప్తంగా ప్రారంభమైన మాక్ పోలింగ్

    • పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్

    • ఐదు గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ప్రధాన పార్టీల ఏజెంట్లు

    • ఉదయం 7 గంటల నుంచి ప్రారంభం కానున్న పోలింగ్

    • ఇప్పటికే పోలింగ్ బూత్‌లకు క్యూ కడుతున్న జనం

    • ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు..

    • ఒకేసారి జరుగుతున్న ఎన్నికలు

    • జూన్-04న ఓట్ల లెక్కింపు

    Mack-Polling.jpg

  • 2024-05-13T05:45:55+05:30

    కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.. తేడా వస్తే తాట తీసుడే !!

    • ఎన్నికల కమిషన్ పకడ్బంది చర్యలు

    • ఏపీ ఎన్నికల్లో విధుల్లో భారీగా భద్రతా సిబ్బంది

    • విధుల్లో ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర పోలీసులు..

    • హోం గార్డులు ఇతర విభాగాలకు చెందిన ఖాకీలు

    • మొత్తం భద్రతా సిబ్బంది : 1,06,145 మంది పోలీసులు

    • ఏపీఎస్పీ, కేంద్ర సాయుధ భద్రతా బలగాలు : 28,588 మంది

    • పోలింగ్ విధుల్లో పాల్గొనే ఇతర సిబ్బంది : 5 లక్షలు మంది

    • 34వేల కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు

    • ఇందులో 12వేల సమస్యాత్మ కేంద్రాలు

    • నియోజకవర్గానికో పోలీసు అబ్జర్వర్

    • అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కలెక్టర్లు, ఎస్పీలదే బాధ్యత

    • పోలింగ్ కేంద్రాల వద్ద నిబంధనలు ఉల్లంఘించి..

    • అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసుల హెచ్చరిక

    Electionn-Polices.jpg

  • 2024-05-13T05:30:52+05:30

    నివురుగప్పిన నిప్పులా..!

    • ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నివురుగప్పిన నిప్పులా తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాలు

    • గతానుభవాల దృష్ట్యా ఈ రెండు చోట్లా అధికార పార్టీ నేతలు..

    • కండ బలాన్ని, దౌర్జన్యకర సంస్కృతిని ప్రదర్శించి పైచేయి సాధించే అవకాశముందని ప్రచారం

    • ఈ రెండు నియోజకవర్గాల్లో వంద శాతం వెబ్‌ కాస్టింగ్‌..

    • కేంద్ర సాయుధ బలగాల మొహరింపునకు ఈసీ నిర్ణయం

    • వంద శాతం వెబ్‌ కాస్టింగ్‌ వల్ల పోలింగ్‌ కేంద్రాల్లో అక్రమాలు తగ్గడానికి ఛాన్స్

    • అధికార యంత్రాంగానికీ కత్తిమీద సాములా ఈ రెండు నియోజకవర్గాలు

  • 2024-05-13T05:05:40+05:30

    ఏపీలో పోలింగ్ కేంద్రాలు ఎన్ని..?

    • ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం పోలింగ్ కేంద్రాలు : 46,389

    • అత్యంత సమస్యాత్మక కేంద్రాలు : 12,438

    • 74.70 శాతం అనగా మొత్తం 34,651 పోలింగ్ కేంద్రాల్లో

    • పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్

  • 2024-05-12T04:45:00+05:30

    ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగోడు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్‌కు సమయం వచ్చేసింది. ఐదేళ్ళకోమారు పాలకుల రాతలు మార్చే అపూర్వ ఆయుధం ఓటరు చేతికొచ్చింది. దాన్ని వినియోగించుకునే క్రమంలో పైచేయి ప్రలోభాలదా..? విచక్షణదా..? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. రానున్న ఐదేళ్లు తమ భవిష్యత్‌, రాష్ట్ర అభివృద్ధిని నిర్దేశించే పాలకులను ఎంపిక చేసుకొనేందుకు ఓటు ద్వారా ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమై.. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుండా భారీగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,14,01,887 ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 2,03,39,851 మంది.. మహిళలు 2,10,58, 615 మంది.. ఇక ఇతరులు 3,421 మంది ఉన్నారు. వీరంతా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46,389 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు.