Share News

Pawan Kalyan: ఏపీలో రోడ్డు ప్రమాదాలపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి

ABN , Publish Date - May 15 , 2024 | 01:43 PM

Andhrapradesh: ఏపీలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పసుమర్రు దగ్గర బస్సు, టిప్పర్ ఢీ కొని అగ్ని జ్వాలలు ఎగసిపడటంతో ఆరుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు. అక్కడ బైపాస్ రోడ్ పనులు సాగుతున్న క్రమంలో తగిన రహదారి భద్రత చర్యలు తీసుకోవడం, వేగ నియంత్ర చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం సంభవించి ఉండేది కాదని అన్నారు.

Pawan Kalyan: ఏపీలో రోడ్డు ప్రమాదాలపై పవన్ తీవ్ర దిగ్భ్రాంతి
Janasena Chief Pawan Kalyan

అమరావతి, మే 15: ఏపీలో జరిగిన వరుస రోడ్డు ప్రమాదాలపై (Road Accident) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) స్పందించారు. ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. బాపట్ల జిల్లా పసుమర్రు దగ్గర బస్సు, టిప్పర్ ఢీ కొని అగ్ని జ్వాలలు ఎగసిపడటంతో ఆరుగురు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు. అక్కడ బైపాస్ రోడ్ పనులు సాగుతున్న క్రమంలో తగిన రహదారి భద్రత చర్యలు తీసుకోవడం, వేగ నియంత్ర చర్యలు చేపట్టి ఉంటే ఈ ఘోరం సంభవించి ఉండేది కాదని అన్నారు.

AP Elections: అంతలోనే మాట మారింది..?


అలాగే డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఊడిమూడి దగ్గర ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో నలుగురు జట్టు కూలీలు మృత్యువాతపడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పవన్ తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రహదారి ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Politics: టియర్ గ్యాస్‌ ఎఫెక్ట్.. జేసీకి అస్వస్థత

AP Elections: నుదిటిపై గాయం.. రక్తమోడుతోన్నా బెదరని ఏజెంట్

Read Latest AP News And Telugu News

Updated Date - May 15 , 2024 | 02:21 PM