Home » Janasena
గుంటూరు జిల్లా: ఏపీలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సోమవారం ఉదయం 7 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Telangana: సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం భార్య, పెద్ద కూతురు సుష్మితతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చిరు వచ్చారు. క్యూ లైన్లో వేచి ఉండి మరీ మెగాస్టార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు. అనంతరం మీడియాతో చిరు మాట్లాడుతూ.. తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Andhrapradesh: ఏపీలో పోలింగ్ ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది నిమిషాలే సమయం ఉంది. పోలింగ్ కేంద్రాల వద్ద అధఇకారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోగా.. ఓటర్లు ఒక్కొక్కరుగా పోలింగ్ బూత్ వద్దకు వస్తున్నారు. అయితే పోలింగ్ ప్రారంభకాకముందే కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపాడు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.
Andhrapradesh: వైసీపీ నేతలు మరొక నీచత్వానికి శ్రీకారం చుట్టారంటూ జనసేన పార్టీ నేత కొణిదల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి రోడ్ షోలో నాగబాబు మాట్లాడుతూ... మే 12వ తేదీ అర్ధరాత్రి నుంచి ఓటుకు నోటు ఇస్తున్నారని.. వైసీపీ రౌడీలు, గూండాలు ప్రతి ఇంటికీ డబ్బులు అందచేయడంతో పాటు.. డబ్బులు ఇచ్చిన ప్రజల వేళ్ళపై ఓటు వేసినట్లుగా సిరా మార్కు వేస్తున్నారని సంచలన అంశాలు బయటపపెట్టారు.
తిరుపతి కేంద్రంగా 50,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. తిరుపతిలో కూటమి రోడ్ షోలో నారా లోకేష్ మాట్లాడుతూ.. రాయలసీమ బిడ్డనని చెప్పి ముద్దులు పెడుతూ వచ్చిన జగన్.. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ లాగా తయారయ్యాడని విమర్శించారు. రాయలసీమలో ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు.
Andhrapradesh: కూటమి అభ్యర్థికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తిరుపతికి చేరుకున్నారు. తిరుపతిలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొనేందుకు జేపీ నడ్డా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే జ్యోతిరావు పూలే విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం జేపీ నడ్డాతో కలిసి లోకేష్ రోడ్ షో నిర్వహించారు. జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు ప్రచారం కోసం ప్రత్యేక విమానంలో లోకేష్ తిరుపతికి వచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు (AP Elections) ఒకట్రెండ్రోజుల ముందు కూడా వైసీపీ (YSR Congress) అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఆటలు ఆడుతోంది. అధికారులు, పోలీసులు ఇలా ఎవర్ని ఎక్కడ వాడాలో అలా వాడేస్తోంది జగన్ సర్కార్. మరీ ముఖ్యంగా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో అయితే వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు చెప్పిందే వేదం అన్నట్లుగా అధికారులు ప్రవర్తిస్తుండటం దారుణం...
ప్రజలకు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. జగన్ పాలనలో పేదలు తృప్తిగా ఉన్నారని ముద్రగడ పేర్కొన్నారు. ప్రతీ ఇంటిలో ప్యాన్లు ఉంటాయని.. గతంలో గాజు గ్లాసు పగిలి పోయిందన్నారు. ఆ ముక్కలు అందరికి ప్రాణహానిని కలిగిస్తాయని, గాజు గ్లాసుకి బదులు స్టీలు గ్లాసులు వాడుతున్నారన్నారు. టీడీపీ సైకిల్ తుప్పు పట్టడం వల్ల ఎవ్వరూ సైకిల్ వాడడం లేదన్నారు.
కాకినాడ సిటీలో పవన్ కల్యాణ్ పర్యటనకు అధికారుల నుంచి చిక్కులు ఎదురవుతున్నాయి. ప్రచారం చివరి రోజున కాకినాడలో పవన్ రోడ్ సభకు టీడీపీ, జనసేన దరఖాస్తు చేసుకున్నాయి. కానీ అదే రోజు కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి బైక్ ర్యాలీ ఉందని పోలీసులు పర్మిషన్‌కు నిరాకరిస్తున్నారు.
ఈ ఎన్నికల్లో వైసీపీపై(YCP) ఉన్న వ్యతిరేకతను ప్రజలు తమ ఓట్ల రూపంలో చూపిస్తారని.. దెబ్బకు వైసీపీ ఫ్యాన్ రెక్కలు ముక్కలవడం ఖాయం అని చంద్రబాబు(Chandrababu) అన్నారు. గురువారం నాడు చంద్రబాబు నాయుడు కురుపాంలో(Kurupam) నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో..