Loksabha Polls: ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్
ABN , Publish Date - May 13 , 2024 | 09:18 AM
Telangana: సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం భార్య, పెద్ద కూతురు సుష్మితతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చిరు వచ్చారు. క్యూ లైన్లో వేచి ఉండి మరీ మెగాస్టార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు. అనంతరం మీడియాతో చిరు మాట్లాడుతూ.. తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
హైదరాబాద్, మే 13: సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం భార్య, పెద్ద కూతురు సుష్మితతో కలిసి జూబ్లీహిల్స్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చిరు వచ్చారు. క్యూ లైన్లో వేచి ఉండి మరీ మెగాస్టార్ తన కుటుంబసభ్యులతో కలిసి ఓటేశారు. అనంతరం మీడియాతో చిరు మాట్లాడుతూ.. తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు (Janasena Chief Pawan Kalyan) ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎవరి ద్వారా రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నారో వారిని ఎన్నుకోవాలన్నారు. ఓటు హక్కు మాత్రమే కాదు అందరి బాధ్యత అని చెప్పుకొచ్చారు. చివరగా... ‘‘మా తమ్ముడికి ఆల్ ది బెస్ట్’’ అని చిరునవ్వుతో తెలుపుతూ చిరంజీవికి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Kishan Reddy: కిషన్ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్‌కు ఫిర్యాదు
మరోవైపు సినీ సెలబ్రెటీలు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR), తన తల్లి, భార్యతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే అల్లు అర్జున్ (Allu Arjun) సైతం ఓటు వేశారు. జూబ్లీహిల్స్ క్లబ్ పోలింగ్ కేంద్రంలో సినీ నటుడు సుమంత్ (Actor Sumanth) ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ.. ‘‘పోలింగ్ డేని హాలీడేగా భావించవద్దు. ఓటు వేయడం మన బాధ్యత. అందరూ బయటకి వచ్చి ఓటు వేయండి’’ అని పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి...
Loksabha polls: స్వేచ్చగా ఓటేయండి: బండి సంజయ్
విజయవాడలో ఓటు వేస్తున్నారా.. ఇవి గుర్తించుకోండి..!
Read Latest Telangana News And Telugu News