Share News

Nara Lokesh: చికెన్ షాప్ దగ్గర నుంచి సామాన్యుల వరకూ ఎవ్వరినీ వదలట్లే..

ABN , Publish Date - May 11 , 2024 | 01:28 PM

తిరుపతి కేంద్రంగా 50,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. తిరుపతిలో కూటమి రోడ్ షోలో నారా లోకేష్ మాట్లాడుతూ.. రాయలసీమ బిడ్డనని చెప్పి ముద్దులు పెడుతూ వచ్చిన జగన్.. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ లాగా తయారయ్యాడని విమర్శించారు. రాయలసీమలో ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు.

Nara Lokesh: చికెన్ షాప్ దగ్గర నుంచి సామాన్యుల వరకూ ఎవ్వరినీ వదలట్లే..

తిరుపతి: తిరుపతి కేంద్రంగా 50,000 మంది ఉద్యోగ అవకాశాలు కల్పించామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. తిరుపతిలో కూటమి రోడ్ షోలో నారా లోకేష్ (Nara Lokesh) మాట్లాడుతూ.. రాయలసీమ బిడ్డనని చెప్పి ముద్దులు పెడుతూ వచ్చిన జగన్.. రాయలసీమకు పట్టిన క్యాన్సర్ లాగా తయారయ్యాడని విమర్శించారు. రాయలసీమలో ఒక ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. ఇక్కడున్న పరిశ్రమలు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. అమర్ రాజాపై అనేక రైడ్స్ చేసి ఆ పరిశ్రమ పక్క రాష్ట్రానికి వెళ్లిపోయే పరిస్థితిని తీసుకొచ్చారని నారా లోకేష్ అన్నారు. దీనివల్ల 20 వేల ఉద్యోగాలు పోయాయన్నారు.

Lanka Dinakar: వైసీపీ నేతల్లో ఓటమి అనే నైరాశ్యం నిండిపోయి రెచ్చిపోతున్నారు


తిరుపతిలో ఎక్కడ చూసినా భూకబ్జాలు దందాలేనని నారా లోకేష్ అన్నారు. మటన్ షాపు, చికెన్ షాప్ దగ్గర నుంచి సామాన్యుల దగ్గర వరకూ ఎవరిని వదలకుండా వసూళ్లు చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకూ తిరుపతిలో పెద్ద దొంగ కరుణాకర్ రెడ్డి రాజ్యం నడిచిందన్నారు. ఇక చిన్న దొంగకు అవకాశం ఇస్తే తిరుపతిలో ఏది మిగలదని నారా లోకేష్ అన్నారు. ప్రజల తరఫున పోరాడుతున్నది జనసేన అధినేత పవన్ మాత్రమేనని పేర్కొన్నారు. మీకు అండగా నిలబడి పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. తిరుపతిలో ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చేలాగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహకరించాలన్నారు. గతంలో ఇసుక రూ.1000 ఉంటే ఇప్పుడు రూ.5000 చేశారని నారా లోకేష్ అన్నారు.

ఇవి కూడా చదవండి...

Secunderabad: ఎన్ని కుట్రలు చేసినా నివేదిత విజయం ఖరారు

Lok Sabha Elections 2024: రెండు కోట్ల విలువ చేసే మద్యం పట్టివేత

Read Latest AP News And Telugu News

Updated Date - May 11 , 2024 | 01:28 PM