Home » Janasena
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు-2024 సమీపిస్తున్న తరుణంలో ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్టుగా రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించింది. రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎలాగైనా సరే గెలవాలని చూస్తోంది. అందుకోసం అడ్డదారులను వెతుకుతుంది. తప్పుడు ఐడీల ద్వారా దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తుంది. తిరుపతిలో ఫేక్ ఐడీలతో దొంగ ఓట్లు వేస్తారనే సమాచారం తమకు ఉందని జనసేన పార్టీ పరిశీలకుడు ఏఎం రత్నం వివరించారు.
2019లో పరిస్థితి వేరు.. ఇప్పుడు వేరు. ఆ సమయంలో ఒక్క ఛాన్స్ అని ప్రజలను జగన్ అడిగారు. సరేలే అని అవకాశం ఇచ్చి ఉంటారు. ఛాన్స్ ఇస్తే ఏం చేశాడో ఆ జనమే చూశారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజా వేదిక కూల్చి తన మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నాడు. తర్వాత విపక్ష నేతలను టార్గెట్ చేశాడు. తొలినాళ్లలో కరెంట్ సమస్య ఎక్కువగా ఉండేది. రహదారుల సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికి రహదారుల మరమ్మతులు జరగలేదు. అందుకే ఈ సారి కూటమి వైపు జనాలు మొగ్గు చూపే అవకాశం ఉంది.
విజయవాడలో టీడీపీ-బీజేపీ-జనసేన (ఎన్డీయే) కూటమి చేపట్టిన రోడ్ షో సూపర్ హిట్ అయ్యింది. గంటన్నర సేపు బెజవాడ వీధుల్లో ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కలిసి సంయుక్తంగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోపై పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార పర్వానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండడం బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు ప్రచారాన్ని ఉధృతం చేశారు. మరీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్డీయే కూటమి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నేడు (బుధవారం) రంగంలోకి దిగారు.
PM Narendra Modi Pileru Public Meeting Live Updates: ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్డీయే కూటమి దూకుడుగా ప్రచారం చేస్తోంది. ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీనే ఏపీలో వరుసగా పర్యటిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా పీలేరు నియోజకవర్గం పరిధిలో ఏర్పాటు చేసిన ప్రజాగళం బహిరంగ సభలో
Andhrapradesh: స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడే నైతిక హక్కు సీఎం జగన్ మోహన్ రెడ్డికి లేదని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గాజువాకలో వైసీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్కు ఓటు వేస్తే... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని.. కూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే... ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉంటుందని అన్నారు.
వైసీపీ సీనియర్ ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) మరో సంచలనానికి దారితీశారు. ఖాళీగా కూర్చుంటే ఏం వస్తుంది..? ప్రచారానికి పోతే ఏంటి.. పోకపోతే ఏంటనుకున్నారో ఏమో కానీ మీడియా ముందు వాలిపోయారు. ఇక గొట్టాల ముందుకు వస్తే ముద్రగడ ఎలా మాట్లాడుతారో తెలుసు కదా. యథావిధిగా తన నోటికి పనిచెప్పారు. బాబోయ్.. ఆయన మాట్లాడుతుంటే అది నోరా.. తాటిమట్టా అన్నట్లుగా సొంత పార్టీ నేతలు, సామాజికవర్గ నేతలు ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి..
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం ఎన్ఆర్ఐలు తరలివస్తున్నారు. జనసేనాని, అభ్యర్థలు కోసం యూకే, కెనడా నుంచి ఎన్ఆర్ఐలు ఏపీకి విచ్చేసి ప్రచారం నిర్వహిస్తున్నారు. కెనడా నుంచి శంకర్ సిద్ధం, యూకే నుంచి వెంకటేష్ అనే ఎన్ఆర్ఐలు పెందుర్తికి వచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్...
ఏపీ సీఎం జగన్పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి పడకేసిందని వివరించారు. రాజమహేంద్రవరంలో జరిగిన ప్రజాగళం సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సొంత పథకాలుగా సీఎం జగన్ బిల్డప్ ఇచ్చారని విమర్శించారు.