AP Elections: అక్కడ ఫేక్ ఐడీలతో దొంగ ఓట్లు..?
ABN , Publish Date - May 09 , 2024 | 12:44 PM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎలాగైనా సరే గెలవాలని చూస్తోంది. అందుకోసం అడ్డదారులను వెతుకుతుంది. తప్పుడు ఐడీల ద్వారా దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తుంది. తిరుపతిలో ఫేక్ ఐడీలతో దొంగ ఓట్లు వేస్తారనే సమాచారం తమకు ఉందని జనసేన పార్టీ పరిశీలకుడు ఏఎం రత్నం వివరించారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీ (Ycp) ఎలాగైనా సరే గెలవాలని చూస్తోంది. అందుకోసం అడ్డదారులను వెతుకుతుంది. చివరికి తప్పుడు ఐడీల ద్వారా దొంగ ఓట్లు వేసే ప్రయత్నం చేస్తుంది. తిరుపతిలో (Tirupati) ఫేక్ ఐడీలతో దొంగ ఓట్లు వేస్తారనే సమాచారం తమకు ఉందని జనసేన పార్టీ పరిశీలకుడు ఏఎం రత్నం వివరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయొద్దని, అలాగే దొంగ ఓట్లు వేయొద్దని సూచించారు. దొంగ ఓట్లు వేస్తే నేరం చేసినట్టు అవుతుందని, జైలుకు వెళ్లడం ఖాయం అని స్పష్టం చేశారు. అధికార పార్టీ ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తిరుపతిలో జనసేన పార్టీ విజయం సాధిస్తోందని ధీమాతో ఉన్నారు.
పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విజయం తథ్యం అని ఏఎం రత్నం స్పష్టం చేశారు. పిఠాపురంలో వైసీపీ నేతలు ఎన్ని కబుర్లు చెప్పిన జనాలు వినిపించుకోరని తెలిపారు. సీఎం జగన్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన ప్రయోజనం ఉండదన్నారు. పిఠాపురం ప్రజలు డబ్బులు తీసుకోరని ఆయన వివరించారు. పవన్ కల్యాణ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెబుతున్నారు. పిఠాపురంలో పవన్ విజయాన్ని ఏ శక్తి ఆపలేదని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమను జగన్ సర్కార్ వేధింపులకు గురిచేసిందని వివరించారు. గత ఐదేళ్లలో ఇండస్ట్రీ పెద్దలు పడిన ఇబ్బందుల గురించి పూసగుచ్చినట్టు వెల్లడించారు.
Read Latest AP News And Telugu News