AP Election 2024: ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం
ABN , Publish Date - May 09 , 2024 | 01:01 PM
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు-2024 సమీపిస్తున్న తరుణంలో ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్టుగా రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించింది. రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు-2024 (AP Election 2024) సమీపిస్తున్న తరుణంలో ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్టుగా రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించింది. రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో తాము తీవ్రంగా నష్టపోయామని అన్నారు. రేషన్ సరుకుల్లో విధించిన కోతతో తమకు వచ్చే కమీషన్ రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో సతమతమయ్యామని ఆయన వాపోయారు.
‘‘ వైసీపీ పాలనలో మాకు ఒక్క పైసా కమీషన్ పెంచలేదు. వైసీపీ నాయకులు, మంత్రులు మమ్మల్ని అవమానించారు. మా సమస్యలను కూటమి మేనిఫెస్టోలో పొందుపరిచారు. మా సంక్షేమం కోసం ఇచ్చిన వివిధ హామీలు నచ్చడంతో కూటమికి ఈ ఎన్నికల్లో మద్దతు తెలుపుతున్నాం. రానున్న రోజుల్లో ప్రజలకు పెన్షన్లు కూడా రూ.10 కమిషన్‌తో రేషన్ డిలర్లు అందించే విధంగా అవకాశం ఇవ్వాలని కూటమిని ప్రభుత్వాన్ని కోరాము’’ అని రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
జగన్ కుయుక్తులకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్
లండన్ పర్యటనపై జగన్‌కు సీబీఐ షాక్
ఎన్నికల వేళ రూ.8 కోట్లకుపైగా పట్టుబడిన నగదు
Read Latest Election News And Telugu News