Home » Janasena
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి శాసన సభ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అద్భుత విజయం సాధించడానికి కారణమైన కీలక వ్యక్తి పవన్ కల్యాణ్. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన పవన్ కల్యాణ్ పార్టీ జనసేన పోటీ చేసిన అన్ని చోట్లా విజయ ఢంకా మోగించింది. మొత్తం 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ సీట్లలో గెలుపొందింది.
పదవులు దక్కాయని రిలాక్స్ అవకుండా కార్యాచరణ చేపడుతున్నారు కొత్త మంత్రులు. మొన్నటికి మొన్న మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఆకస్మిక పర్యటనలు నిర్వహించి అధికారులను హడలెత్తించారు. తాగునీటి సమస్యకు చెక్ పెట్టించారు. ఇక నేడు తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగారు. ముందుగా రైతుల కోసం పంట కాల్వలు, తెనాలి ప్రజానీకం కోసం డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్నారు
కృష్ణాజిల్లా: కక్ష సాధింపు చర్యలు తమ విధానం కాదని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి అన్నారు. జనసైనికులు కూడా ఎక్కడా దాడులు, దౌర్జన్యాలకు దిగవద్దని కోరారని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో జనసైనికులను ఇబ్బందులకు గురి చేసిన వారిని చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.
AP CM Chandrababu Naidu Swearing in Ceremony Live News Updates: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికాసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా.. ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరవై ఎకరాల ప్రాంగణంలో మూడు అత్యంత భారీ టెంట్లను ఏర్పాటు చేశారు.
రాజకీయాల్లో రాణించడం అంటే.. అంతా మామూలు విషయం కాదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా సరే.. పాలిటిక్స్‌లో ఎదగాలంటే మాత్రం చాలా కసరత్తులు చేయాల్సి ఉంటుంది. ముందుగా జనాల...
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అలాగే చేశారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు తాకనీయబోమన్న వారికి ఓ రేంజ్ సమాధానమిది. ఏకంగా డిప్యూటీ సీఎంగానే అసెంబ్లీలో పవన్ అడుగు పెట్టబోతున్నారు. వాస్తవానికి ఆయన విజయం కూడా ఓ అద్భుతమే.
రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఎన్డీయే కూటమి నేతలు కలిశారు. టీడీపీ తరపున అచ్చె్న్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేశారు.
విజయవాడ: గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితి నెలకొందని, అందరి పోరాటంతోనే అద్భుత విజయం సాధించామని, కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.