Nadendla Manohar: మొన్న కొల్లు రవీంద్ర.. నేడు నాదెండ్ల మనోహర్..
ABN , Publish Date - Jun 14 , 2024 | 11:58 AM
పదవులు దక్కాయని రిలాక్స్ అవకుండా కార్యాచరణ చేపడుతున్నారు కొత్త మంత్రులు. మొన్నటికి మొన్న మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఆకస్మిక పర్యటనలు నిర్వహించి అధికారులను హడలెత్తించారు. తాగునీటి సమస్యకు చెక్ పెట్టించారు. ఇక నేడు తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగారు. ముందుగా రైతుల కోసం పంట కాల్వలు, తెనాలి ప్రజానీకం కోసం డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్నారు
గుంటూరు: పదవులు దక్కాయని రిలాక్స్ అవకుండా కార్యాచరణ చేపడుతున్నారు కొత్త మంత్రులు. మొన్నటికి మొన్న మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో ఆకస్మిక పర్యటనలు నిర్వహించి అధికారులను హడలెత్తించారు. తాగునీటి సమస్యకు చెక్ పెట్టించారు. ఇక నేడు తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్ రంగంలోకి దిగారు. ముందుగా రైతుల కోసం పంట కాల్వలు, తెనాలి ప్రజానీకం కోసం డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్నారు. అసలే వర్షాకలం కావడంతో రైతులకు అలాగే తెనాలి ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూస్తున్నారు.
రైతులకు పంట కాల్వల ద్వారా నీరు సక్రమంగా అందాలని, పట్టణంలో రోడ్లపై నీరు నిలిచిపోకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంత్రి నాదెండ్ల మనోహర్ డ్రైనేజీలు శుభ్రం చేయిస్తున్నారు. తొలిసారిగా జనసేన తరుఫున మంత్రి రంగంలోకి దిగడం ఆసక్తికంగా మారింది. ప్రజల సమస్యలపై దృష్టి సారించడంతో అక్కడి వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డ్రైనీజీలలో నీరు నిలిచిపోతే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.