Home » Jangaon
జనగామ జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహ ధ్వంసం ఘటన అగ్గి రాజేసింది. దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహానికి అనుమతులు లేవంటూ గురువారం రాత్రి అధికారులు కూల్చే ప్రయత్నం చేశారు.
ఎవరు నేర్పారమ్మ ఈ కొమ్మకు.. పూలిమ్మనీ రెమ్మరెమ్మకూ అంటారో భావకవి! కల్లాకపటం తెలియని పిల్లలూ ఇంతే! చక్కగా అర్థమయ్యేట్టు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల పట్ల మాటలకందని గొప్ప బంఽధాన్ని ఏర్పరుచుకుంటారు.
వసతి గృహంలో ఉండడం ఇష్టం లేక ఓ తొమ్మిదో తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన జనగామ జిల్లా చిలుపూర్ మండలం రాజవరం సమీపంలోని కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం)లో జరిగింది.
జనగామ: పట్టణంలోని కలెక్టరేట్లో సోమవారం ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. పసరమట్ల గ్రామానికి చెందిన నిమ్మల నర్సింగరావు అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. కలెక్టరేట్ భవనం ఎక్కి పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు.
వీధి కుక్కలు మరో పసి బాల్యాన్ని చిదిమేశాయి. రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు రెండు రోజులకొకటి జరుగుతున్నా కొంత మంది తల్లిదండ్రులు జాగ్రత్త వహించక తమ పసి మొగ్గలను ఒంటరిగా వదులుతూ వారి నిండు ప్రాణాలను వీధి కుక్కలకు బలి చేస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యంత్రి కేసీఆర్ చేపట్టిన పర్యటనపై కాంగ్రెస్ ( Congress ) నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్ తీహార్ జైలులో ఉన్న కవితను పరామర్శిస్తే బాగుండేదని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Telangana: ‘‘చలో మేడిగడ్డ’’ పర్యటనలో భాగంగా కాళేశ్వరం బయలుదేరిన బీఆర్ఎస్ నేతల కాన్వాయ్‌కు పెను ప్రమాదం తప్పింది. జనగామ మండలం నెల్లుట్ల సమీపంలో బీఆర్ఎస్ నేతల కాన్వాయ్‌లో ఓ బస్సు టైర్ పేలింది. దీంతో బస్సును పక్కకు నిలిపివేశారు. ఆపై బస్సులోని బీఆర్ఎస్ నేతలంతా కార్లలో బయలుదేరారు. బస్సులో ఆందోల్ మాజీ ఎమ్మెల్యే కాంతికిరణ్ సహా పలువురు నేతలు ఉన్నారు.
BRS Chalo Medigadda: ‘చలో మేడిగడ్డ’ కు (Chalo Medigadda) వెళ్తున్న బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేల బస్సు టైర్ ఒక్కసారిగా బ్లాస్ అయ్యింది. దీంతో మార్గమధ్యలోనే బస్సు ఆగిపోయింది. ఈ ఘటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు. బస్సులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఉన్నారు..
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 119 స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం 39 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమి తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ తొలి పర్యటన చేశారు.
Telangana Elections: చేర్యాల పట్టణంలో జనగామ కాంగ్రెస్ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి మద్దతుగా తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి భూకబ్జా దారుడని ఆరోపించారు.