Home » JD Lakshmi Narayana
ఏపీలో ఫిబ్రవరి 25వ తేదీన జరగబోయే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) కోరారు.
AP Politics: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జై భారత్ పార్టీ అధినేత వీవీ లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. బుధవారం నాడు అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్.. వైసీపీ ఎన్నికల ప్రచార బడ్జెట్‌లా ఉందని విమర్శించారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. బడ్జెట్ సెషన్‌ను వైసీపీ ఎన్నికల ప్రచార పర్వంలా మార్చేశారని ఫైర్ అయ్యారు.
జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అధ్యక్షతన నడుస్తున్న జైభారత్ పార్టీ మేనిఫెస్టోను కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. విద్యార్ది, ఆటో డ్రైవర్, మహిళలు, రైతు ద్వారా మేనిఫెస్టోను లక్ష్మీనారాయణ అందుకున్నారు.
రాజకీయాల్లో వ్యక్తి పూజ ఉంటే... అది రాచరికానికి దారి తీస్తుందని.. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రంలో వ్యక్తి పూజే జరుగుతుందని జై భారత్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ ( JD Lakshminarayana ) అన్నారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై జై భారత్ (ఎన్) పార్టీ అద్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కేంద్రం బాద్యత అని అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...
దేశంలో కుటుంబ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ( JD Lakshminarayana ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడితే మన యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్లక్కర లేదు.విశాఖపట్నంలో జాబ్ మేళా పెడితే 70 శాతం మంది ఇంజనీర్లు వచ్చారని.. అంటే రాష్ట్రంలో ఉపాధి లేకుండా పోయిందని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
రాజకీయ నాయకుల మాటలు ఆకర్షనీయంగా ఉన్నా వారి కార్యచరణ మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.లక్ష్మి నారాయణ వ్యాఖ్యానించారు. ఇటీవల బహ్రెయిన్‌లో ప్రవాసాంధ్రులు నిర్వహించిన యువ సంకల్పం అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడారు.
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshmi Narayana) తమ పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ (ka paul) తెలిపారు.
‘‘నాకున్న ఆస్తులు అమ్మైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ సంరక్షణ కోసం పోరాడుతాను’’ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ క్రౌడ్ ఫండ్ అమలాపురం నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు.