JD Lakshminarayana: ఏపీకి ప్రత్యేకహోదాపై కార్యాచరణ ప్రకటించిన జేడీ
ABN , Publish Date - Dec 29 , 2023 | 01:46 PM
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై జై భారత్ (ఎన్) పార్టీ అద్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కేంద్రం బాద్యత అని అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై జై భారత్ (ఎన్) పార్టీ అద్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కేంద్రం బాద్యత అని అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్పెషల్ స్టేటస్ అద్యాయం అయిపోయింది అంటున్నారు.. కాదు ఇప్పుడే మొదలైందని అన్నారు. పార్లమెంట్‌లో ఏపీకి హోదా ఐదేళ్లు కావాలని అప్పటి ప్రభుత్వం చెబితే... కాదు పదేళ్లు కావాలని బీజేపి చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు అమలుచేయలేనప్పుడు ఇక పార్లమెంట్‌కు విలువేముంటుందని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఎన్నికల కోసం మాత్రమే హోదా అంశాన్ని టీడీపీ, వైసీపీలు లేవనెత్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా సాధన కోసం బ్యాడ్జీలు ధరించి పోరాటం చేద్దామని పిలుపిచ్చారు. పొలిటికల్ పార్టీ నేతలకు కూడా బ్యాడ్జీలు పెట్టాలన్నారు. ఈరోజు నుంచి తాను ఈ బ్యాడ్జీని తగిలిస్తానన్నారు. జనవరి 26న (రిపబ్లిక్ డే రోజు) ప్రత్యేక హోదా కోసం ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు. ప్రతి ఛానల్ కూడా తమ లోగో పక్కన హోదా లోగోను కూడా పెట్టాలని కోరుతున్నానన్నారు. తమిళనాడులో జల్లికట్టు కోసం ఉద్యమం చేసి సాధించారని.. అలాగే ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు కాకుండా ప్రజలు ఉద్యమిస్తేనే హోదా వస్తుందని జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.