Share News

JD Lakshminarayana: దేశంలో కుటుంబ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి

ABN , Publish Date - Dec 22 , 2023 | 08:41 PM

దేశంలో కుటుంబ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ( JD Lakshminarayana ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడితే మన యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్లక్కర లేదు.విశాఖపట్నంలో జాబ్ మేళా పెడితే 70 శాతం మంది ఇంజనీర్లు వచ్చారని.. అంటే రాష్ట్రంలో ఉపాధి లేకుండా పోయిందని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

JD Lakshminarayana: దేశంలో కుటుంబ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి

విజయవాడ: దేశంలో కుటుంబ రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ ( JD Lakshminarayana ) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు ప్రకటించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ...‘‘గ్రామాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడితే మన యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్లక్కర లేదు.విశాఖపట్నంలో జాబ్ మేళా పెడితే 70 శాతం మంది ఇంజనీర్లు వచ్చారని.. అంటే రాష్ట్రంలో ఉపాధి లేకుండా పోయింది. రాజకీయాలు కొన్ని కుటుంబ పాలనగా మారాయి. ఒకరు బ్లాక్ కమాండ్ సెక్యూరిటీలో ఇంకొకరు పరదాల సెక్యూరిటీలో ఉన్నారు. నిజానికి ప్రజలకు సెక్యూరిటీ లేదు’’ అని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ను గుజరాత్ కన్నా ముందుకు తీసుకువెళ్తాం

‘‘నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న ప్రజలను కాపాడడానికి ఈ పార్టీ పుట్టింది.ఇతర పార్టీల్లాగా మేము తప్పు చేయం. ఆంధ్రప్రదేశ్‌ను గుజరాత్ కన్నా ముందుకు తీసుకువెళ్తాం. చీకటి ఉంటే దాన్ని తిట్టకుండా చిరు దీపం పెట్టమని మా అమ్మ నాకు నేర్పించింది. ఆ చిరు దీపమే ఈ పార్టీ...రాష్ట్రాన్ని చీకట్ల నుంచి బయటకు తెస్తుంది. జై భారత్ నేషనల్ పార్టీ వలెంటీర్‌గా మా వెబ్ సైట్ ద్వారా చేరాలి. 2014లో ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పారు. నేటి పార్టీలు అనేక అవకాశాలు వచ్చినా హోదాను సాధించలేక పోయాయి. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ పార్టీ ఏర్పడింది. ఒకరు అభివృద్ధిని ఒక నగరం కట్టడానికి ప్రజల అవసరాలను నిర్లక్ష్యం చేశారు. ప్రజల అవసరాలని అభివృద్ధిని మరొకరు పక్కన పెట్టారు .రెండింటినీ జై భారత్ నేషనల్ పార్టీ సాధిస్తుందని జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.

Updated Date - Dec 22 , 2023 | 08:43 PM