Home » Jobs
రాష్ట్రంలోని తొమ్మిది మంది జూనియర్ ఐఏఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రొబేషనరీ హోదా’ కల్పించింది. ఈమేరకు వారి సర్వీసులను కన్ఫర్మ్ చేస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజా విజ్ఞప్తులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ భూపిందర్ పాల్ సింగ్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసుకు హాజరయ్యే విషయంలో సమయపాలనను ఖచ్చితంగా పాటించాల్సిందే. టైమంటే టైముకు రావాల్సిందే.
అమెరికా, చైనా దేశాల్లో ఉద్యోగం చేసిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో వ్యాపారం చేసి నష్టపోయి ర్యాపిడో డ్రైవర్‌గా మారాడు. ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు చివరికి దొంగగా మారాడు. ఓ నగల దుకాణంలో దోపీడీకి యత్నించి పోలీసులకు చిక్కాడు.
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని ఆస్పత్రుల్లో ఖాళీ పోస్టుల భర్తీపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ఇందులో భాగంగా డీహెచ్ పరిధిలోని 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్లతోపాటు 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్‌నర్స్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు.
ఉద్యోగం సంపాదించడం అంత తేలిక కాదు. రెజ్యూమ్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంతో పాటు ఇంటర్వ్యూలో సరైన సమాధానాలు చెబితేనే ఉద్యోగం వస్తుంది. రెజ్యూమ్‌లో అభ్యర్థులు తమ అర్హతలను, పనితీరను వివరిస్తారు. తాము ఆ ఉద్యోగానికి ఎలా సరిపోతామో, ఆ ఉద్యోగం తమకు ఎందుకు అవసరమో వీలైనంత వివరంగా పేర్కొంటారు.
జెన్కోలో అసిస్టెంట్ ఇంజనీర్ల(ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలకా్ట్రనిక్స్, సివిల్స్)తో పాటు కెమిస్ట్ ఉద్యోగాల భర్తీకి వచ్చేనెల 14న పరీక్ష జరగనుంది
సమాచార హక్కు(ఆర్టీఐ) చీఫ్ కమిషనర్, కమిషనర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 29న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ సంబంధిత ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం జారీ చేశారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీకి సంబంధించిన కసరత్తును తుది దశకు తెచ్చింది. ఈ నెల 13 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నట్టు ప్రకటించింది.
మీరు ప్రభుత్వ ఉద్యోగాల(jobs) కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ఇటివల ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) రీజినల్ రూరల్ బ్యాంక్ (RRB)లో 9,995 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
భారత ఐటీ కంపెనీల్లో కొలువుల కోత గప్‌చుప్‌గా కొనసాగుతోంది. గతేడాది దాదాపు 20,000 మంది ఉద్యోగులను ఐటీ కంపెనీలు ఇంటికి పంపాయి. నిజానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందని ఆలిండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ (ఏఐఐఐఈయూ) తెలిపింది.