Hyderabad: తొమ్మిది మందికి ప్రొబేషనరీ ఐఏఎ్‌సల హోదా..
ABN , Publish Date - Jun 27 , 2024 | 05:28 AM
రాష్ట్రంలోని తొమ్మిది మంది జూనియర్ ఐఏఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రొబేషనరీ హోదా’ కల్పించింది. ఈమేరకు వారి సర్వీసులను కన్ఫర్మ్ చేస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజా విజ్ఞప్తులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ భూపిందర్ పాల్ సింగ్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు.
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని తొమ్మిది మంది జూనియర్ ఐఏఎస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రొబేషనరీ హోదా’ కల్పించింది. ఈమేరకు వారి సర్వీసులను కన్ఫర్మ్ చేస్తూ కేంద్ర సిబ్బంది, ప్రజా విజ్ఞప్తులు, పెన్షన్ల మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ భూపిందర్ పాల్ సింగ్ బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. వీరి సర్వీసులను కన్ఫర్మ్ చేస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారని ఆయన పేర్కొన్నారు. ఇందులో 2020 బ్యాచ్‌కు చెందిన కధిరవన్ పలని ఉండగా, మిగతా ఎనిమిది మంది 2021 బ్యాచ్‌కు చెందినవారున్నారు. కధిరవన్ పలనికి 2023 సంవత్సరం అక్టోబరు 7 నుంచి ప్రొబేషనరీ ఐఏఎ్‌సగా కన్ఫర్మేషన్ ఇవ్వగా.. 2021 బ్యాచ్‌కు చెందిన శివేంద్ర ప్రతాప్, సంచిత్ గాంగ్వార్, ఫైజాన్ అహ్మద్, లెనిన్ వత్సల్ టొప్పో, పి.గౌతమి, పర్మర్ పింకేశ్‌కుమార్ లలిత్‌కుమార్, రాధికా గుప్తా, పి.శ్రీజలకు 2023 సంవత్సరం డిసెంబరు 5 నుంచి కన్ఫర్మేషన్ ఇచ్చారు.
వీరంతా ప్రస్తుతం రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లుగా పని చేస్తున్నారు. అసోం క్యాడర్‌కు చెందిన సంచిత్ గాంగ్వార్‌ను 2022 సంవత్సరం డిసెంబరు 23న తెలంగాణ క్యాడర్‌కు బదిలీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరితో పాటు త్రిపుర రాష్ట్రానికి చెందిన మరో ఐదుగురు ఐఏఎ్‌సలకూ కేంద్రం ప్రొబేషనరీ హోదా కల్పించింది. ఈ హోదా రావడంతో వీరంతా ఇక మీదట రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిన రెవెన్యూ డివిజన్లకు సబ్-కలెక్టర్లుగా పనిచేసే అవకాశం ఉంటుంది.