Home » Journalist
గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై అమెరికాకు చెందిన జర్నలిస్టు ఎవాన్ గెర్షికోవిచ్ (32)కు ఓ రష్యా కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
జర్నలిస్ట్‌లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీం పొడిగించినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.
జర్నలిస్టుల ఇబ్బందుల గురించి తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు స్పందించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గుర్తింపు పొందిన జర్నలిస్టులకు టోల్ ప్లాజా నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన మంగళవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. వివిధ అంశాల గురించి ప్రస్తావిస్తూనే జర్నలిస్టుల సమస్య గురించి మాట్లాడారు.
సీనియర్ జర్నలిస్టు బి. మురళీధర్ రెడ్డి(64) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మురళీధర్ రెడ్డి ఢిల్లీలోని రామ్మనోహర్ లాల్ ఆస్పత్రిలో శనివారం రాత్రి తుది శ్వాస విడిచారు.
రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు త్వరలోనే కొత్త పాలసీని తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడి ప్రకటించారు. బుధవారం ఖమ్మంలో ప్రారంభమైన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర తృతీయ మహాసభలకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.
దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల నుంచి కాపాడుకునేందుకు జాతీయవాదులు సంఘటితం కావాలని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ప్రధానకార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. సమాచార భారతి సంస్థ ఆధ్వర్యంలో..
Andhrapradesh: సమాజంలో అందరూ రూల్ ఆఫ్ లా పాటించాలని సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాలు పెరిగాయని లెక్కలు చెబుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం మద్యం పాలసీ మార్చిందని... మద్యం డిస్టలరీస్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తుందన్నారు. దీంతో పిచ్చి పిచ్చి బ్రాండ్లు తయారు చేస్తున్నారని..
విద్యావంతులు, యువత ఓటింగ్ ప్రక్రియకు దూరం ఉండటం దేశానికి.. ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ అన్నారు. ప్రజాసామ్య పరిరక్షణకు, బలోపేతానికి ఓటర్ చైతన్యం అవసరమన్నారు. ఓటర్లను చైతన్యపరిచి వారు బూత్‌ల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకనేలా చూడాల్సిన ఎన్నికల కమిషన్ ఆ దిశగా తగినంత కృషి చేయడం లేదన్నారు.
Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబుతో ఏపీయూడబ్ల్యూజే బృందం సోమవారం భేటీ అయ్యింది. జర్నలిస్టుల సమస్యలను మ్యానిఫెస్టోలో పెట్టాలని వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ నేతలు కోరారు. టీడీపీ హయాంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పెట్టిన పలు పథకాలను జగన్ రద్దు చేశారని చంద్రబాబుకు జర్నలిస్తులు వివరించారు. జర్నలిస్టులపై దాడులు జరుగుతుంటే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందనా రాలేదని నేతలు తెలిపారు.
Andhrapradesh: ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై దాడికి నిరసనగా ‘‘ఛలో అనంత’’కు ఏపీయూడబ్ల్యూజే పిలుపునిచ్చింది. అయితే ఏపీయూడబ్ల్యూజే 'చలో అనంత'పై పోలీసులు నిర్బంధం విధించారు. ఈ కార్యక్రమానికి బయలుదేరిన జర్నలిస్టులను ఎక్కడికక్కడ అణచివేసి... స్టేషన్లకు తరలించారు. అయితే పోలీసుల నిర్బంధం మధ్యే జిల్లాలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. సంగమేష్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు ఏపీయుడబ్ల్యూజే, జర్నలిస్టులు శాంతి ర్యాలీ చేపట్టారు.