Home » Jupally Krishna Rao
బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకోమని తనకు సీఎం కేసీఆర్ చెప్పారంటూ కాంగ్రెస్ పార్టీ నేత జూపల్లి కృష్ణారావు సంచలనానికి తెరదీశారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కేసీఆర్ తనపై చేసిన కామెంట్స్‌పై స్పందించారు. తనది అహంకారం కాదని.. ఆత్మగౌరవమన్నారు.
తనను ఓడించడానికి ప్రగతి భవన్ నుంచి KCR డబ్బు సంచులు పంపారని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు(Jupalli Krishna Rao) అన్నారు.
పీఆర్ఎల్ఐ (పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం) సందర్శించడానికి వెళ్తున్నామని... ధర్నాకు.. రాస్తారోకోకు వెళ్లట్లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా: కొల్లాపూర్ కాంగ్రెస్ (Congress) పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పలువరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బోరాబండతండా, సున్నపుతాండవాసులకు జూపల్లి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతి, దుర్మార్గపాలన జరుగుతోందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
సీఎం కేసీఆర్ ఆఘమేఘాల మీద 115 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారని.. దాని వల్ల ప్రజలకు ఏంవ ఒరిగిందని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.
గద్దర్‌తో తాను కలిసినప్పుడు సీఎం కేసీఆర్ (KCR) రెండు సంవత్సరాలపాటు అపాయింట్మెంట్ ఇవ్వలేదని గద్దర్ చెప్పాడని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao) తెలిపారు.
తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలన చూస్తే చాలా బాధ కలుగుతోందని కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఎట్టకేలకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గురువారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్జే సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఉదయమే జూపల్లితో పాటు పలువురు నేతలు ఖర్గే నివాసానికి చేరుకున్నారు.
కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక మరోసారి వాయిదా పడింది. ఈరోజు (బుధవారం) జూపల్లి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాల్సి ఉంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి హస్తం పార్టీ తీర్థంపుచ్చుకోవాల్సి ఉంది.