Share News

AP High Court : బియ్యం రవాణాకు అనుమతులున్నాయా?

ABN , Publish Date - Dec 18 , 2024 | 04:16 AM

కాకినాడ పోర్టులోని తమ పారా బాయిల్డ్‌ రైస్‌ను ఎంవీ స్టెల్లా నౌకలోకి ఎగుమతి చేసేందుకు అనుమతించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు..

AP High Court : బియ్యం రవాణాకు అనుమతులున్నాయా?

  • ఎగుమతిని అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటి?

  • పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచండి.. హైకోర్టు ఆదేశం

  • ‘స్టెల్లా’లో 1,320 టన్నుల రేషన్‌ బియ్యం.. కలెక్టర్‌ షాన్‌మోహన్‌ వెల్లడి

కాకినాడ పోర్టులోని తమ పారా బాయిల్డ్‌ రైస్‌ను ఎంవీ స్టెల్లా నౌకలోకి ఎగుమతి చేసేందుకు అనుమతించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లలో వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. బియ్యం రవాణా చేసేందుకు పిటిషనర్లకు అనుమతులు ఉన్నాయా? బియ్యాన్ని లోడ్‌ చేయకుండా ఉత్తర్వులు జారీ చేసేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటి? తదితర వివరాలను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్‌ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా, ఉపముఖ్యమంత్రి మౌఖిక ఆదేశాలను అనుసరించి కాకినాడ పోర్టులోని తమ పారా బాయిల్డ్‌ బియ్యాన్ని ఎగుమతి చేయనీయకుండా కాకినాడ కలెక్టర్‌, పోర్టు అధికారి అడ్డుకుంటున్నారంటూ చిత్ర అగ్రి ఎక్స్‌పోర్ట్స్‌ ఎండీ కేవీ భాస్కర్‌రెడ్డి, పద్మశ్రీ రైస్‌మిల్‌ ఎండీ పోతంశెట్టి గంగిరెడ్డి, సూర్యశ్రీ రైస్‌మిల్‌ ఎండీ పోతంశెట్టి విశ్వనాథ్‌రెడ్డి హైకోర్టులో వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లు మంగళవారం విచారణకు వచ్చాయి.

Updated Date - Dec 18 , 2024 | 04:16 AM