Share News

YCP Workers : అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలేదా?

ABN , Publish Date - Dec 11 , 2024 | 05:57 AM

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైసీపీ మొట్టమొదటిసారిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది.

YCP Workers : అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాలేదా?
Botsa Satya Narayana

  • ప్రజా సమస్యలపై బొత్సను వైసీపీ కార్యకర్తల నిలదీత

కాకినాడ(కార్పొరేషన్‌), డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవి చూసిన వైసీపీ మొట్టమొదటిసారిగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. మంగళవారం కాకినాడలో జరిగిన వైసీపీ సమీక్షా సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కూటమి పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని లేకుంటే జగన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కరెంటు చార్జీలు తగ్గించకపోతే ఈ నెల 27న పోరాటం చేస్తామన్నారు. అయితే.. బొత్స మాట్లాడుతు న్న సమయంలో వేదికముందున్న వైసీపీ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తూ.. ‘‘అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదా’’ అని నిలదీశారు.

Updated Date - Dec 11 , 2024 | 09:29 AM