Home » Kamala Harris
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్షుడైతే ప్రజలు అత్యంత తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ హెచ్చరించారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌కు కేబినెట్‌లో అవకాశం కల్పిస్తానని.. అలా కుదరకపోతే కనీసం సలహాదారుడిగా నియమించుకుంటానని ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు. కన్నీళ్లు చెమర్చారు. చికాగోలో సోమవారం ప్రారంభమైన ‘డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్’ ఈ దృశ్యానికి వేదికైంది. అధ్యక్ష నామినీని పార్టీ అధికారికంగా ఆమోదించనున్న ఈ సమావేశాల తొలి రోజున అధ్యక్షుడు జో బైడెన్ వీడ్కోలు ప్రసంగం చేస్తూ ఆయన ఎమోషనల్ అయ్యారు.
అమెరికా వైస్ ప్రెసిడెంట్, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ‘డెమొక్రాటిక్ నేషనల్ కన్వెన్షన్’లో సంప్రదాయానికి విరుద్ధంగా ఆశ్చర్యకర ప్రసంగం చేశారు. సాధారణంగా అధ్యక్ష అభ్యర్థి కన్వెన్షన్ చివరి రోజున ప్రసంగం చేస్తారు. కానీ అందుకు విరుద్ధంగా మొదటి రోజునే మాట్లాడిన కమలా హ్యారీస్.. అధ్యక్షుడు జో బైడెన్‌పై ప్రశంసల జల్లు కురిపించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024లో ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారీస్ దూసుకుపోతున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కమల గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన కమలా హ్యారీస్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యర్థి, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారి్‌సపై నోరు పారేసుకుంటున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరింత దిగజారారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నకు అమెరికా అధ్యక్షుడు జోబైడెన్(Joe Biden) సంచలన సమాధానం ఇచ్చారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరగనుండగా.. డెమొక్రటిక్, రిపబ్లిక్ పార్టీల నుంచి అధ్యక్ష ఎన్నికల బరిలో దిగబోతున్న అభ్యర్థులు ఫిక్స్ అయ్యారు. డెమొక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేర్లను ప్రకటించారు. అయితే తాజాగా డెమోక్రటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్‌గా ఉన్న టిమ్‌వాల్ట్స్ ఎంపికయ్యారు.
మొదటి భార్యతో కాపురం చేసిన సమయంలో తనకు వివాహేతర సంబంధం ఉండేదని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ భర్త డగ్ ఎమ్‌హాఫ్ అంగీకరించారు. కమలా హారీస్ ఆయనకు రెండో భార్య కావడం గమనార్హం.