Home » Kangana Ranaut
చండీగఢ్ విమానాశ్రయంలో సీఐఎ్‌సఎఫ్‌కు చెందిన ఒక మహిళా కానిస్టేబుల్ తనను కొట్టారని బాలీవుడ్ నటి, బీజేపీ తరఫున తాజా ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్ నుంచి ఎన్నికైన ఎంపీ కంగనా రనౌత్ ఆరోపించారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ఢిల్లీకి వెళ్లటం కోసం తాను చండీగఢ్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా, భద్రతాపరమైన తనిఖీల అనంతరం సీఐఎ్‌సఎఫ్ కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ తనతో వాగ్వాదానికి దిగి చెంపదెబ్బ కొట్టారని కంగన తెలిపారు.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఢిల్లీకి వెళ్లాల్సి ఉండడంతో మధ్యాహ్న సమయంలో..
లోక్‌సభ ఎన్నికల్లో తారలు తళుక్కుమన్నారు. రామానంద్ సాగర్ రామాయణ్‌లో శ్రీరాముడి పాత్రధారి, బాలీవుడ్ నటుడు అరుణ్ గోవిల్ తొలిసారిగా చట్టసభలో అడుగుపెట్టనున్నారు. యూపీలోని మేరఠ్ నుంచి
సార్వత్రిక ఎన్నికల ఏడో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధం అయ్యింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో శనివారంతో ఎన్నికలు ముగియనున్నాయి. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం పటిష్ఠ ఏర్పాట్లు పూర్తి చేసింది. చివరిదశలో 8రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి 57లోక్‌సభ, ఒడిశా అసెంబ్లీ 42స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
గ్యాంగ్‌స్టర్ అబూ సలేంతో నటి కంగనా రౌనౌత్ ఒక పార్టీలో పాల్గొన్నట్టు చెబుతున్న ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై ఎట్టకేలకు కంగన తన 'ఇన్‌స్టా గ్రామ్' స్టోరీస్‌లో సోమవారంనాడు స్పందించారు. తనతో ఉన్న వ్యక్తి ఒక మాజీ జర్నలిస్టు అని పేర్కొంటూ ఆ ఫోటో స్కీన్‌షాట్‌ను షేర్ చేశారు.
ఆమె సినిమా ‘క్వీన్’.. ఆయన ఒకనాటి రాజ్యానికి వారసుడు..! వీరి మధ్య ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో రాజకీయ కాక పుట్టిస్తోంది. ఇద్దరు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తూ ఆదరణ చూరగొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత చర్చనీయాంశం అవుతున్న నియోజకవర్గం మండి. ఇక్కడినుంచి బీజేపీ
బాలీవుడ్ సెన్సేషన్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నటిగా అడుగిడి, దర్శకురాలిగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. భారతీయ జనతా పార్టీలో చేరి, మండీ లోక్ సభ నుంచి బరిలోకి దిగారు. విపక్ష పార్టీలు, నేతలపై ఒంటికాలిపై లేస్తున్నారు.
ఎన్నికల ప్రచార సందడి ముందు సినిమాలు తీయడం ఓ జోక్‌లా కనిపిస్తోందని నటి, మండీ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో తన అనుభవాలను వివరిస్తూ ఆమె ఇన్‌స్టాగ్రాంలో వీడియోను పోస్టు చేశారు.
బాలీవుడ్ నటి, లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా రనౌత్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. రూ.91 కోట్ల విలువచేసే ఆస్తులు తన పేరుతో ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు.
కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రసంగంలో భాగంగా పప్పులో కాలేశారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్‌పై విమర్శలు చేయబోయి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తేజస్వీ సూర్యపై నోరుజారారు.