Share News

Kapil Dev: నేను తొలిసారి విమానం ఎక్కింది హైదరాబాద్‌ లోనే..

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:12 AM

‘నేను తొలిసారి విమానం ఎక్కింది హైదరాబాద్‌ లోనే’ అని భారత తొలి క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌(Kapil Dev) తెలిపారు.

Kapil Dev: నేను తొలిసారి విమానం ఎక్కింది హైదరాబాద్‌ లోనే..

- భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌

- ఇండియా ఆన్‌ కాన్వాస్‌ ప్రదర్శన ప్రారంభం

హైదరాబాద్‌ సిటీ: ‘నేను తొలిసారి విమానం ఎక్కింది హైదరాబాద్‌ లోనే’ అని భారత తొలి క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ కెప్టెన్‌ కపిల్‌దేవ్‌(Kapil Dev) తెలిపారు. వ్యాపారవేత్త, ఎన్‌ఏఆర్‌ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ పార్వతీరెడ్డి, అనిల్‌రెడ్డి నూకలపాటితో కలిసి బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో ‘ఇండియా ఆన్‌ కాన్వాస్‌’ పేరుతో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కపిల్‌దేవ్‌ మాట్లాడుతూ ఈ ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ ద్వారా నిధులను సేకరించి, చిన్నారుల విద్య, ఆరోగ్యం కోసం వినియోగించనున్నారని తెలిపారు. ఇప్పటి వరకూ దాదాపు 2 లక్షల మంది పిల్లల విద్యపై ప్రభావం చూపగలిగామన్నారు. హైదరాబాద్‌(Hyderabad) అద్భుతంగా అభివృద్ధి చెందిందని అన్నారు. పార్వతి రెడ్డి మాట్లాడుతూ ఖుషీ బోర్డు సభ్యురాలిగామాత్రమే కాకుండా సౌత్‌ హెడ్‌గా అనేక కార్యక్రమాలను ఖుషీ తరఫున చేస్తున్నామన్నారు. ఈ ప్రదర్శనలో పలువురు సుప్రసిద్ధ ఆర్టిస్టులు చిత్రించిన 300కు పైగా చిత్రాలను ప్రదర్శిస్తున్నామన్నారు. తెలంగాణలో హైదరాబాద్‌తో పాటుగా పెద్దపల్లి, రంగారెడ్డి జిల్లాలో 8 పాఠశాలల్లో 2365 మంది విద్యార్థులకు అండగా నిలిచామని తెలిపారు. ఈ చిత్ర ప్రదర్శనకు ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ విచ్చేయగా, కంట్రీ క్లబ్‌ డైరెక్టర్లు వరుణ్‌ రెడ్డి, సిద్ధార్థ్‌రెడ్డి, గ్రాన్యూల్స్‌ ఇండియా సంస్థ డైరెక్టర్‌ ఉమా చిగురుపాటి సహా పలువురు సోషలైట్లు పాల్గొన్నారు.

city1.1.jpg

Updated Date - Mar 28 , 2024 | 11:12 AM