Home » Karnataka
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ‘ఆపరేషన్ కమల’ కుట్ర సాగుతోందని ఒక్కో ఎమ్మెల్యేకు రూ.50కోట్ల చొప్పున చెల్లించాలని రాష్ట్ర బీజేపీ నేతలు ప్రయత్నించారని సీఎం సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. గురువారం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర బెంగళూరులో మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యేలను మార్కెట్లో లభించే వస్తువులుగా పోల్చి సీఎం అవమానించారన్నారు.
కొవిడ్ అక్రమాలపై రిటైర్డు న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా నేతృత్వంలోని కమిటీ నివేదికలోని సిఫారసులను అమలు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గురువారం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది.
రాష్ట్ర కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సి.శిఖా(Senior IAS officer C. Shikha) కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. కేంద్ర పౌర ఆహార సరఫరాల శాఖ జాయింట్ కార్యదర్శిగా వెళ్ళనున్నారు. త్వరలోనే ఢిల్లీలో బాధ్యతలు చేపట్టనున్నారు. 2004 కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా శిఖా సుధీర్ఘకాలం పాటు మైసూరు(Mysore) జిల్లాధికారిగా వ్యవహరించారు.
తప్పుడు కేసులతో నా భార్యను ఇబ్బంది పెట్టారని, నేను 40ఏళ్ల క్రితమే మంత్రిని అయ్యానని, 14 ఇంటి స్థలాలకోసం ఎందుకు తప్పు చేస్తానని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ప్రశ్నించారు. టి నరసీపురలో బుధవారం రూ.470 కోట్లతో అభివృద్ధి పనులు, సంక్షేమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి సీఎం మాట్లాడారు.
పలు కేసులను చేధించి, పోలీసులకు అండగా నిలచిన పోలీస్ జాగిలానికి అరుదైన గౌరవం దక్కింది. మృతి చెందిన పోలీస్ జాగిలాన్ని తలుచుకుని పోలీసులు తీవ్ర వేదనకు గురయ్యారు. జిల్లా పోలీస్ శాఖలో 8 ఏళ్లుగా క్లూస్ టీం(Clues Team)లో సేవలందించిన సిరి అనే పేరున్న డాబర్మాన్ జాతి జాగిలం మృతి చెందగా దానికి సోమవారం అధికారులు అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించారు.
ఆడవారిలాగా ఏడ్చేవారిని ఎవరు నమ్ముతారని జేడీఎస్ నేత దేవెగౌడ కుటుంబీకులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలకృష్ణ(Congress MLA Balakrishna) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నపట్టణ నియోజకవర్గం చక్కెర గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏడ్చేవారిని ఎవరైనా నమ్ముతారా..? అన్నారు.
సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అక్రమాల గుట్టు రట్టయ్యిందని, ఆయన జైలుకెళ్లడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప(Former Chief Minister Yeddyurappa) జోస్యం చెప్పారు. శుక్రవారం సండూరు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న
మోదీపై పోటీ చేయగలిగే నేత 'ఇండియా' కూటమిలో లేరని, దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లడంలో విజయవంతమైన నేతల్లో డొనాల్డ్ ట్రంప్, మోదీ ఉన్నారని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ అన్నారు. మోదీ-ట్రంప్ మధ్య పటిష్టమైన అనుబంధం ఉందని చెప్పారు.
భర్తతో పాటు యోగా ఉపాధ్యాయురాలు సన్నిహితంగా ఉండడంపై ఆ భార్య అనుమాన పడింది. తన భర్త నుంచి ఆమెను దూరం చేయడంలో సహాయం చేయాలని తన స్నేహితుడిని కోరింది. అందుకు అతడు సహయం చేశాడు. ఆ క్రమంలో ఆ యోగా ఉపాధ్యాయురాలని కిడ్నాప్ చేశారు. అనతరం ఆమెను హత్య చేసి గోతిలో పడేశారు. కానీ ఆమె తిరిగి బయటకు వచ్చింది. అది ఎలాగంటే..
మీకు సిగరెట్లు తాగడం, గుట్కా తీసుకోవడం అలవాటు ఉందా అయితే జాగ్రత్త. ఎందుకంటే ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో ఇవన్నీ కూడా నిషేధం. ప్రభుత్వం తాజాగా అందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చుద్దాం.