Home » Kaushik Reddy
ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు జనం బుద్ధి చెప్పినా ఆ పార్టీ నేతల్లో మార్పు కనిపిస్తలేదని.. ఇంకా అదే అహంకారాన్ని చూపుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధ అనిపిస్తోందని, అతిగా ముందుకు పోతే ఎలా నియంత్రించాలో ప్రభుత్వానికి తెలుసని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
‘‘రాష్ట్రంలో రోజుకో అంశంతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరిచి డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు.. ఇందులో భాగంగానే తమ ఎమ్మెల్యేలపై దాడులూ చేయిస్తున్నారు’’ అని కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మధ్య రాజుకున్న రగడ శుక్రవారం మరింత ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్‌కు పెట్టుబడులు రాకుండా భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మండిపడ్డారు.
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీతో సవాళ్లు, ప్రతిసవాళ్లకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు ఝలక్ ఇచ్చారు. పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. అడిషనల్ ఎస్పీ రవి చందన్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.
హైదరాబాద్: ఎమ్మెల్యేలు అరెకపూడి, కౌశిక్ రెడ్డిల మధ్య జెండా జగడం రాజుకుంది. పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గాంధీ ఇంటికెళ్లి బీఆర్ఎస్ జెండా ఎగరేస్తానన్న కౌశిక్.. ఆయన విల్లాకు వెళ్లిన గాంధీ, ఆయన అనుచరులు.. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపిచ్చింది.
‘‘బతకడానికి వచ్చినావు.. నీవేందీ?’’ అంటూ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దూషించడంపై సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
పార్టీ ఫిరాయింపుపై రచ్చ రచ్చ! ఎమ్మెల్యేల మధ్య మాటల యుద్ధం! ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటికి పార్టీ మారిన మరో ‘బీఆర్ఎస్’ ఎమ్మెల్యే! అక్కడ హై టెన్షన్ వాతావరణం! ఆయన అరెస్టు.. విడుదల!
బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. దమ్ముంటే కాస్కో అని ఒకరు అంటే.. తేల్చుకుందాం రా అని ఇంకొకరు అంటున్న పరిస్థితి. ఈ మాటల తూటాలతో ఇద్దరి వ్యక్తుల మధ్య నెలకొన్ని ఈ రచ్చ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య గొడవగా మారిపోయింది...