Share News

Kaushikreddy: కావాలనే కేసులు.. విచారణ తర్వాత కౌశిక్ రెడ్డి కామెంట్స్

ABN , Publish Date - Jan 17 , 2025 | 01:02 PM

Kaushik Reddy: మాసబ్‌ ట్యాంక్ పోలీసుల విచారణకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. పోలీసులు అడిగిన 32 ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. తనపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నారని విచారణ అనంతరం కౌశిక్ రెడ్డి ఆరోపించారు.

Kaushikreddy: కావాలనే కేసులు.. విచారణ తర్వాత కౌశిక్ రెడ్డి కామెంట్స్
BRS MLA Padi Kaushikreddy

హైదరాబాద్, జనవరి 17: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) విచారణ ముగిసింది. బంజారాహిల్స్ సీఐ విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి ఈరోజు (శుక్రవారం) ఉదయం మాసబ్ ట్యాంక్ పోలీసుల ఎదుట ఎమ్మెల్యే విచారణకు హాజరయ్యారు. దాదాపు గంట పాటు విచారణ చేసిన పోలీసులు.. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. కౌశిక్ రెడ్డిని మాసబ్ ట్యాంక్ పోలీసులు 32 ప్రశ్నలు అడిగి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. విచారణ అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. తనపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.


రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆరు హామీలపై ప్రశ్నిస్తే తనపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. 420 హామీలు, ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. డిసెంబర్ 4న తాను బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్ళానని.. బంజారాహిల్స్ ఏసీపీ అపాయిట్మెంట్ తీసుకుని మరీ వెళ్లినట్లు తెలిపారు. తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఫిర్యాదు చేయడానికి పోతే తిరిగి తనపైనే కేసులు పెట్టారన్నారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎందుకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ప్రశ్నించారు. పండుగ రోజు కూడా దొంగ లాగా తనను అరెస్ట్ చేసి తీసుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మాసబ్ ట్యాంక్ పోలీసులు 32 ప్రశ్నలు సంధించారన్నారు. ‘‘అడిగిన ప్రశ్నే అడిగారు.. నేను అన్నింటికీ సమాధానం చెప్పాను’’ అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెల్లడించారు.

Visakha-Charlapalli: జనంతో కిక్కిరిసిన రైళ్లు.. ఖాళీగా విశాఖ-చర్లపల్లి రైలు.. ప్రయాణికుల ఆగ్రహం


కాగా.. గత ఏడాది డిసెంబర్ 4న తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి కౌశిక్ రెడ్డి వచ్చారు. అయితే తన వాహనాన్ని సీఐ వాహనానికి అడ్డుపెట్టి అనుచరులతో ఆయన హల్‌‌చల్ చేశారు. దీంతో పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని గతంలో కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై బంజారాహిల్స్ పీఎస్‌లో ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్ ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా మసాబ్ ట్యాంక్ ఇన్‌స్పెక్టర్‌ను పోలీస్ ఉన్నతాధికారులు నియమించారు. అందులో భాగంగా విచారణకు హాజరు కావాలంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఈరోజు కౌశిక్ రెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

బాంద్రా పోలీసులు పట్టేశారు

ఏఐతో ఇలా కూడా చేస్తారా.. ఏకంగా దేశ ప్రధానినే

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 17 , 2025 | 01:04 PM