Home » Kavitha Arrest
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Kejriwa) అరెస్టును బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) ఖండించారు. దేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుని అన్నారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా స్పందించారు. ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఏకైక సంకల్పంతో బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (Delhi Liquor Scam) అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వ్యవహారంలో తాజాగా మరో దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సమయంలో 150 పేజీలతో కూడిన ఓ డాక్యుమెంట్ లభ్యమైందని, దాని ప్రకారం ఆయన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులపైనే గూఢచర్యం చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలకమైన వ్యక్తి అని, కొందరు వ్యక్తులకు మేలు చేసేందుకు డబ్బులు (లంచం) అడిగారని రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ వెల్లడించింది. అక్రమ మార్గంలో వచ్చిన ఈ డబ్బుని గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించిందని పేర్కొంది. మద్యం విధానం రూపకల్పనలో కేజ్రీవాల్‌కు ప్రత్యక్ష పాత్ర ఉందని, స్కామ్‌లో ప్రధాన వ్యక్తి ఆయనేనని తెలిపింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ కస్టడీలో కవిత దినచర్య ఎలా ఉందనే దానిపై పలు కథనాలు వస్తున్నాయి. వాటి ప్రకారం కవిత రోజువారి దినచర్య ఈ విధంగా ఉన్నట్లు తెలుస్తోంది..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. తన అరెస్ట్ అక్రమమని, తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Delhi Liquor Scam Case: మద్యం కుంభకోణం వెలుగు చూసినప్పటి ఎప్పుడూ ఏదో ఒక సంచలనం ఉంటూనే ఉంది. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Kejriwal Arrest) అరెస్ట్‌తో ఈ కేసు పీక్స్‌కు చేరింది. 2022లో ఈ కేసులు వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఈడీ(ED), సీబీఐ(CBI) వేసే ప్రతి స్టెప్.. తీసుకునే ప్రతి నిర్ణయం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత సహాయకులు రాజేష్, రోహిత్ రావులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి విచారణ కొనసాగుతోంది. కవితను అరెస్టు చేసిన రోజున వీరిద్దరి ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో కవిత సహాయకుల పాత్రపై క్లారిటీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై బీజేపీ నేత, ఎంపీ అర్వింద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కవిత త్వరగా బయటకు రావాలంటే ఆమె భర్త అనిల్ ఈడీకి సహకరించాలని అన్నారు. ఈడీ విచారణకు పిలిస్తే.. హాజరు కాకుండా అనిల్ తప్పించుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.
Telangana: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌ను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ టార్గెట్‌గానే ఇవన్నీ జరుగుతున్నాయన్నారు. బ్యాంక్‌లకు లక్షల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారి పోయినవారున్నారని అన్నారు. అధికారంలో ఉన్నామని భయ బ్రంతులకు గురిచేసి పార్టీలో చేర్చుకుంటామంటే కుదరదన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) ఎంఎల్సీ కవిత అరెస్టుపై దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు పేర్కొంది. ఢిల్లీ, హైదరాబాద్ ,చెన్నై, ముంబైతో పాటు పలు ప్రాంతాలో సోదాలు నిర్వహించామని వెల్లడించింది.